‘‘నేను అప్పుడు రాధిక వాళ్లదే ఓ తమిళ సీరియల్‌లో చేస్తున్నాను… అమ్మవారి గెటప్… కుట్రాలంలో షూటింగ్, అది ఫినిష్ చేసుకుని, టాటా సఫారీలో బెంగుళూరు వెళ్తున్నాం… మధ్యలో మీనాక్షి హోటలో, మరొకటో ఆపుకుని లంచ్ చేశాం… ఆ టైమ్‌లో నేను ఏదో ఫోన్ మాట్లాడుతూ డోర్ తీయడానికి ప్రయత్నించాను… కానీ డ్రైవర్ లాక్ చేసుకుని ఎక్కడికో వెళ్లాడు… ఎవరైనా కారు లాక్ తీయడానికి ప్రయత్నిస్తే అరుస్తుంది కదా… అప్పట్లో అదొక అలర్ట్ సిస్టం ఉండేది…
అది కుయ్ కుయ్ అని అరుస్తుంటే ఒకాయన వచ్చి ఏదో వైర్ కట్ చేశాడు, దాంతో ఆ సౌండ్ ఆగిపోయింది… కానీ సెంట్రల్ లాక్ సిస్టం పనిచేయకుండా పోయింది… అక్కడి నుంచి బయల్దేరాక ఓ స్పాట్ ఉంటుంది… అది డేంజరస్ స్పాట్, తరచూ యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయట అక్కడ… డైవర్షన్స్ సరిగ్గా ఉండవు… ఓ లారీ వాడు ఓ బస్సును ఓవర్ టేక్ చేసి, ఎదురుగా వస్తున్న మా కారును సరిగ్గా గమనించక గుద్దేశాడు… కొద్దిదూరం అలాగే లాక్కుపోయింది.. బాయ్‌నెట్ ఓపెనైంది… డీజిల్ అంటుకుంది… మంటలు కనిపిస్తున్నాయి… డ్రైవర్ బయటకు పడిపోయాడు… నేను అప్పటికీ అందులోనే ఉన్నాను… గబగబా డోర్ తీసుకుని బయటికి దూకేశాను… కొన్ని గాయాలు తగిలాయి…
సినిమాల్లో చూపించినట్టుగా కారు నా కళ్ల ముందే కాలిపోయింది… ఇక్కడ నా లక్ ఏమిటంటే… సెంట్రల్ లాక్ పడకపోవడంతో డోర్లు ఆ టైమ్‌కు ఓపెన్ అయి బయటికి దూకగలిగాను… లేకపోతే ఊహించుకోవడానికి భయమేస్తోంది… అరగంట ముందే కారు సెంట్రల్ లాక్ ఏదో వేరే అనుకోని కారణంతో పనిచేయకుండా పోవడం ఏమిటి, అదే సరిగ్గా నా ప్రాణాల్ని కాపాడటం ఏమిటి..?’’
Ads
…. ఇది నటి యమున చెప్పుకున్న ఓ యాక్సిడెంట్ స్టోరీ… ఆలీతో సరదాగా చాట్ షోలో… సాధారణంగా ఈనాడు సైటులో ఇలాంటి ఇంటర్వ్యూలను ప్రశ్న- జవాబు పంథాలో రాసేస్తుంటారు… ఇదీ రాశారు… కానీ ఈ యాక్సిడెంట్ గురించి, సరిగ్గా ఏ పాయింట్ ఆమె ప్రాణాల్ని కాపాడిందో అదే రాయలేకపోయారు… అది చదివితే నవ్వొచ్చింది… ఆమె సరిగ్గా వివరించలేకపోయింది ఎందుకో, నిజానికి ఆమె తెలుగు అనర్గళంగా బాగా మాట్లాడుతుంది… ఆలీ కూడా సరిగ్గా చెప్పించలేకపోయాడు…
నిజమే… డెస్టినీ అంటే అదే… ఓ గడ్డుదశ వచ్చింది ఆమె లైఫులో… వ్యభిచారం కేసు మీదపడింది… సరిగ్గా అదేసమయంలో తండ్రి చనిపోయాడు… ఇద్దరు ఆడపిల్లలు… ఓ ఫైనాన్స్ ఇష్యూలో ఒకరితో గట్టిగా డీల్ చేసినందుకు నన్నలా ఇరికించారంటుంది ఆమె… ఆ ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది… ఫంక్షన్లు, పబ్లిక్‌లోకి వెళ్లడం పూర్తిగా ఆపేసింది… అందరి చూపుల్ని భరించలేక, జవాబులు చెప్పలేక… తరువాత కోర్టు నుంచే బయటపడింది… నిలబడింది…
సొంతంగా ఓ యూట్యూబ్ చానెల్ పెట్టుకుని, మోటివేషన్ వీడియోలు చేసేది… అడపాదడపా సీరియళ్లలో నటించడం మళ్లీ స్టార్ట్ చేసింది… పాత యమున మళ్లీ కనిపించింది… ఆరోజు కారు సెంట్రల్ లాక్ చెడిపోకుండా, యాక్సిడెంట్ సమయంలో డోర్లు ఓపెన్ కాకపోయి ఉంటే..? ఏముంది..? యమున అనే ఫైల్ డిలిట్ అయిపోయి ఉండేది అప్పుడే… ఇంకా నూకలున్నయ్ కాబట్టే బతికింది… డెస్టినీ…!!
Share this Article