శతాధిక చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తన 67 వ పుట్టినరోజు సందర్బంగా ప్రఖ్యాత రచయిత – దర్శకులు యండమూరి వీరేంద్రనాధ్’తో ఓ చిత్రం ప్రకటించారు. యండమూరి రాసిన నవలల్లో అగ్ర తాంబూలం అందుకునే “అంతర్ముఖం”ను వెండితెరపై ఆవిష్కరించనున్నారు. భీమవరం టాకీస్ పతాకంపై 117వ చిత్రంగా యండమూరి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కనున్నది ఈ చిత్రం…
ఈ వంద చిత్రాలు నిర్మించిన తుమ్మలపల్లి ఎవరో నాకు తెలియదు… నా అజ్ఞానానికి క్షమించగలరు… కానీ యండమూరి తెలుసు… విద్యార్థి దశ నుంచి మొదలైన అభిమానం… తను చిరంజీవి సినిమాల కథారచయిత, దర్శకుడు అయ్యేంతవరకు మాత్రమే తెలుసు… తరువాత తను రచయితగా ఏమయ్యాడో నాకు విశ్లేషించే సామర్థ్యం లేదు… చిరంజీవి చిత్రాలు అంటేనే అవి ‘‘ఎంత టేస్టుతో ఉంటాయో’’ తెలుసు కాబట్టి…
ఎస్, పైన వార్తలో చెప్పినట్టు అంతర్ముఖం మొత్తం తన రచనల్లో అగ్రతాంబూలం దానిదే… మాస్టర్ పీస్… క్లాసిక్… వాణిజ్య రచయిత యండమూరికి అది మరో కోణం… గతంలో ఆనందో బ్రహ్మ వంటి కొన్ని… కెరీర్ మొదట్లో తను రాసిన మరికొన్ని నవలలు… ప్రత్యేకించి పర్ణశాల వంటివి తన రచన సామర్థ్యానికి తార్కాణాలు… తరువాత తనలోని నిజమైన రచయితను తనే హతమార్చుకున్నాక ఇక తనతో పెద్దగా ‘బంధం’ లేదు…
Ads
ఇప్పుడు అకస్మాత్తుగా ఓ వార్త… అదేనండీ, పైన చదివారు కదా… అదే… తన అంతర్ముఖం నవలను తనే డైరెక్ట్ చేస్తాడట… ఆయనెవరో ఫాఫం, డబ్బు పెడతాడట… సరే, పెడితే పెట్టనివ్వండి గానీ… ఒక రాక్షసుడు, ఒక ఛాలెంజ్, ఒక అభిలాష కాదు… ఈ నవలను సినిమాకరీంచడం… ఓ ఉద్వేగ రచన… ఫిలసాఫికల్ టచ్… అంత వీజీ కాదు, దాన్ని చిత్రీకరించడం…
అనేకానేక సినిమాటిక్ ట్విస్టులు ఉండే ఆ పర్ణశాలనే ఎవరూ సరిగ్గా తెర మీదకు తీసుకురాలేకపోయారు… ఆనందోబ్రహ్మ, వెన్నెల్లో ఆడపిల్ల వంటివి సరేసరి… అవి పఠనంలోనే ఆనందాన్నిచ్చేవి… తెర మీదకు యథాతథంగా రావాలంటే కష్టం… యండమూరికి మరీ కష్టం… ఎందుకంటే, తను ప్రొఫెషనల్ దర్శకుడు కాదు… మొన్నామధ్య రంగమార్తాండ అని ఓ క్లాసిక్ తీయాలనుకున్నాడు కృష్ణవంశీ… ఫ్లాప్… ప్రకాష్ రాజ్ మొనాటని పుణ్యమాని అట్టర్ ఫ్లాప్… ఇదీ రియాలిటీ…
ఫుల్లీ ఎమోషన్ లోడెడ్ సినిమాలు బ్రహ్మాండంగా తీస్తే తప్ప నలుగురు థియేటర్‌కు రాని రోజులివి… ఒక వంశీ, ఒక విశ్వనాథ్, ఒక బాపు కాలం కాదిది… యండమూరి ఆ రేంజుకు సినిమా తీస్తాడనీ అనుకోలేం… ఎంత తన రచనైనా సరే… ఆ రచనకు కమర్షియల్ వాసనలూ లేవు… కృత్రిమంగా సినిమాలో యాడ్ చేస్తే పూర్తిగా బెడిసికొట్టే ప్రమాదమూ బోలెడు… అంతకుమించి, ఆ కథానాయకుడి పాత్రకు సూటయ్యే ఒక్క నటుడూ, అంగీకరించే హీరో ప్రస్తుతం తెలుగులో లేడు… లేడు…! అబ్బే, ఓటీటీకి అమ్ముకోలిగితే చాలు అంటారా..? సరే, మీ ఇష్టం…!!
Share this Article