Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

యశస్వి జైస్వాల్ కథ కంచికేనా ? మీడియాలో బోలెడన్ని తీర్పులు !!

August 24, 2026 by M S R

.

యశస్వి జైశ్వాల్… శ్రీలంక బౌలర్‌తో గొడవపడ్డాడు… తనపై అయిదు టెస్టుల నిషేధం లేదా పది వన్డేల నిషేధం లేదా జీవితకాలం క్రికెట్ ఆడకుండా నిషేధం అంటూ చాలా వార్తలు, అభిప్రాయాలు కనిపిస్తున్నాయి… కానీ..?

నిన్న … ఆగస్టు 23న శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు యశస్వి జైస్వాల్ 45 పరుగుల వద్ద అసిత ఫెర్నాండో బౌలింగ్‌లో అవుటయ్యాడు. అవుటైన తర్వాత ఫెర్నాండో అతనికి కాస్త ఆగ్రహంగా, దూకుడుగా ఏదో అంటూ “సెండ్-ఆఫ్” ఇచ్చాడు. ఆటలో జరుగుతూనే ఉంటాయి అలా…

Ads

జైస్వాల్ మొదట సైలెంటుగా, తలవంచుకుని పెవిలియన్ వైపు నడిచినా, బైలర్ మాటలు విని, మళ్లీ వెనక్కి తిరిగి ఫెర్నాండో దగ్గరకు వెళ్లాడు. ఇద్దరూ చాలా దగ్గరగా నిలబడి మాటలు అనుకున్నారు. ఆ సమయంలో జైస్వాల్ హెల్మెట్ ఫెర్నాండో తల/ నుదుటి భాగానికి తగిలింది. తర్వాత మిగతా ఆటగాళ్లు వచ్చి ఇద్దరినీ విడదీశారు. (జైస్వాల్ ఉద్దేశపూర్వకంగా తలతో కొట్టడానికి ప్రయత్నించినట్టుగా ఏమీ లేదు వీడియోలో… జస్ట్, తాకీతాకనట్టుగా ఉంది…)

ఇక్కడ ముఖ్యమైన విషయం మాటల యుద్ధం కాదు — శారీరకంగా తగలడం. ICC Code of Conduct లోని Article 2.12 ప్రకారం మరో ఆటగాడితో అనుచితమైన శారీరక స్పర్శకు శిక్ష పడవచ్చు. అది ఉద్దేశపూర్వకంగా జరిగిందా, నిర్లక్ష్యంగా జరిగిందా, ఎంత బలంగా తగిలింది, గాయం జరిగిందా వంటి విషయాలను మ్యాచ్ రిఫరీ పరిశీలిస్తాడు.

అందువల్ల జైస్వాల్ ICC కోడ్‌ను ఉల్లంఘించినట్టు తేల్చే అవకాశం ఉంది. అయితే వెంటనే “ఐదు టెస్టుల నిషేధం” లాంటి పెద్ద శిక్ష వస్తుందని చెప్పడం అతిశయోక్తి. ఆటగాడు– ఆటగాడి మధ్య ఇలాంటి సంఘటన సాధారణంగా Level 1 లేదా Level 2 offence కింద పరిశీలిస్తారు. గతంలో జైస్వాల్‌కు డీమెరిట్ పాయింట్లు కూడా ఏమీ లేవు.

Level 1 అయితే మందలింపు నుంచి మ్యాచ్ ఫీజులో 50% వరకు జరిమానా, అలాగే 1 లేదా 2 demerit points రావచ్చు. Level 2గా భావిస్తే మరింత కఠినమైన జరిమానా, ఎక్కువ demerit points రావచ్చు.
జైస్వాల్ వెనక్కి తిరిగి ఫెర్నాండో దగ్గరకు వెళ్లడం తప్పే. ఫెర్నాండో రెచ్చగొట్టేలా మాట్లాడి ఉండొచ్చు; అతనిపైనా చర్య ఉండవచ్చు. కానీ దాంతో శారీరకంగా తగిలే హక్కు జైస్వాల్‌కు రాదు. ఇప్పుడు అసలు నిర్ణయించాల్సింది — హెల్మెట్‌తో తగలడం ఉద్దేశపూర్వకమా, లేక ఇద్దరూ ముఖాముఖిగా దగ్గరకు రావడంతో అనుకోకుండా జరిగిందా అన్నదే. అదే శిక్ష తీవ్రతను నిర్ణయిస్తుంది.

అది ఒకప్పుడు, ఇప్పుడు ఇది ఏమాత్రం  జెంటిల్మెన్ గేమ్ కాదు… రాగద్వేషాలు, ఆగ్రహావేశాలు అన్నీ ఉన్నయ్… అంతేకాదు, బెట్టింగులు, కరప్షన్, అవినీతి, అక్రమాలు అన్నీ రాజ్యమేలుతున్నాయి… బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌ను ఈ ఏడాది నిర్వహించకూడదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిర్ణయించడం ఇదే.

దాదాపు 40 కోట్ల టాకా (సుమారు ₹31 కోట్లు) నష్టం, ఫ్రాంచైజీల ఆర్థిక అవకతవకలు, అప్పులు, బెట్టింగ్‌, కరప్షన్‌, లంచగొండితనం వంటి ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు BCB అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్ చెప్పాడు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • యశస్వి జైస్వాల్ కథ కంచికేనా ? మీడియాలో బోలెడన్ని తీర్పులు !!
  • తెగ బలిసిన కార్లు పైకి ఎక్కేస్తాయి – మనమే పైలంగా ఉండాలె !!
  • K I L L …! యండమూరి విశ్లేషణ- సమీక్ష … భిన్నం – ఆసక్తికరం !
  • ఎలపరం ! కాలేజీ ప్రాంగణాలు ఇక సినిమా ఫంక్షన్లకు అద్దె వేదికలు !!
  • ప్రతి మెహిందీ కథా ఇంతే ! వెలుతురు ఎరుగని చీకటి తడి అంగడి !
  • నిజం- ఓటీటీ భ్రమలు బద్ధలయ్యాకే… తెలుగు సినిమా బతుకుతోంది !
  • సంక్షోభమూ ఓ అవకాశమే ! రేవంత్ రెడ్డి వాడుకోగలిగితే భలే చాన్స్ !!
  • Save Vijayawada – ముందు బెజవాడను బతికించండి, తరువాతే మెట్రో !!
  • ఇస్రో ఇకపై రాకెట్లు తయారుచేయదట… మరి ఏం చేస్తుంది ? 
  • నిజం ఏదో చెప్పాల్సిన మీడియానే… నిజం కోసం వెతకాల్సి వస్తే ?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions