Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రాజీనామా చేశాడట… బారా ఖూన్ మాఫ్… వాటీజ్ దిస్ మోడీ…

April 10, 2026 by M S R

.

మరేమనుకున్నారు నా భారత దేశ అత్యద్భుత రాజనీతి గురించి… ఈ జాతి నిష్కల్మష నిజాయితీ గురించి… ఏ అక్రమార్కుడినీ వదలని నా జాతి గొప్పతనం గురించి… క్రాస్ చెక్స్ ఉన్న పరమాద్భుత సిస్టం గురించి… సూపర్ అసలు…

ఎందుకో తెలుసా… అప్పట్లో ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో కట్టలుకట్టలుగా కరెన్సీ కట్లపాముల గుట్టలు బయటపడ్డాయి తెలుసు కదా… నో, నాన్సెన్స్, అబ్సర్డ్ అని అందరు అక్రమార్కుల్లాగే తనూ బుకాయించాడు… న్యాయమూర్తి అంటే నిజాయితీకి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదనుకునే బాపతు తను…

Ads

మమ్మల్నెవడురా ఆపేది అనుకునే బాపతు అన్యాయమూర్తుల కేటగిరీ… తరువాత ఏమైంది..? మొదట వేరే హైకోర్టుకు బదిలీ చేసింది సుప్రీం… మన సుప్రీం అంటే వేరే ఇతర వ్యవస్థలకూ అతీతం కదా… బదిలీ చేస్తే మాఫ్ అయిపోయినట్టేనా అనే విమర్శలు వెల్లువెత్తాయి… దాంతో ఓ కమిటీ, నిజనిర్ధారణ… దోషి అన్నట్టుగా నిర్దారణ…

బదిలీలు, నియామకాలు, పదోన్నతులు ఇచ్చే కొలీజియం మరి చర్య తీసుకోవచ్చు కదా… అబ్బే, మీ ఇష్టం అని మోడీ ప్రభుత్వం మీదకు విసిరేసింది బంతి… అప్పుడేమో ఓవరాక్షన్, డబుల్ యాక్షన్ ఉపరాష్ట్రపతి కమ్ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ‘ధన్‌ఖడ్’… మోడీకి, తనకూ ఎక్కడో దారుణంగా బెడిసికొట్టింది… కారణాలు బహుశా అజిత్ దోవత్ రాబోయే రోజుల్లో ఒకవేళ రాస్తే ఆ 100 సీరీస్ పుస్తకాల పుటల్లో కనిపిస్తాయేమో…

సరే, అవమానకరంగా ‘ధన’ఖడ్ వైదొలిగాడు… మరీ మోడీ గ్యాంగ్ ఏమైనా దీన్ని ఓ కొలిక్కి తీసుకొచ్చిందా..? లేదు… అప్పట్లో అందరూ కలిసికట్టుగా సదరు జడ్జిని తొలగించే అభిశంసనకు తీర్మానం ఆలోచించారు కదా… ఏమీ జరగలేదు… హఠాత్తుగా ఏమైందో ఏమిటో గానీ… సదరు జడ్జి యశ్వంత్ వర్మ రాజీనామా చేశాడు… ఈ సిస్టం మీద సానుభూతితో… ఈ మోడీ మీద సానుభూతితో…

సంపాదించుకున్నది చాల్లే, ఇక చాలించండి… ఏదో పొరపాటున దొరికాను, ఇక వదిలేయండి అన్నట్టుగా… ఓ అవినీతి న్యాయమూర్తిని అభిశంసించే తొలి ఉదాహరణకు తావు లేకుండా… మొత్తం న్యాయవ్యవస్థకు ఓ హెచ్చరికలా ఉండే అవకాశమే లేకుండా…. సో, ఇక్కడ కొన్ని ప్రశ్నలు… అమిత్ షాకు కాదు, మోడీకి కాదు, సుప్రీం కోర్టుకే… మీ వ్యవస్థ విశ్వసనీయత రక్షణ కోసమే…

ఓ పే-ద్ద అక్రమార్కుడు రేప్పొద్దున ఇలాగే తన పదవికి రాజీనామా చేసేస్తే… బారా ఖూన్ మాఫీ అని వదిలేస్తుందా ఈ వ్యవస్థ..? ఈ మినహాయింపు, ఈ కరుణ కేవలం న్యాయమూర్తులకే ఎందుకు..? అసలు వ్యవస్థలో ప్రస్తుతం క్రెడిబులిటీని రక్షించుకోవాల్సింది ప్రథమంగా న్యాయవ్యవస్థే కదా… రాజీనామా అన్ని తప్పుల్ని కడిగేస్తుందా..?

అయితే గియితే సదరు న్యాయమూర్తి బీజేపీలో చేరాలి, తులసి తీర్థం తీసుకోవాలి… అప్పుడు కదా ప్రాయశ్చితం, దోషి పరిహారం, విముక్తి లభించేది… పోనీ, చేరాడా..? అదీ క్లారిటీ లేదు… పోనీ, బారా ఖూన్ మాఫీ పాలసీ ఏదో పారదర్శకంగా ప్రకటించొచ్చు కదా..!! అవునూ, ఎన్నికల కమిషనర్ అభిశంసన అనే రాజకీయ సంకల్పం సరే, ఈ జడ్జిని ఎందుకు వదిలేసినట్టు సోకాల్డ్ ప్రతిపక్షాలు…!?

10, 100, 1000 రూపాయల అవినీతికి కూడా ఏళ్లుగా జైళ్లలో వేసి, బెయిల్ కూడా ఇవ్వకుండా… శిక్షించిన న్యాయవ్యవస్థలోని తనలోని రాచపుండును వదిలేయడం దేనికి..? ఇప్పుడు తనకు శిక్షేమీ లేదా మహాప్రభూ..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రాజీనామా చేశాడట… బారా ఖూన్ మాఫ్… వాటీజ్ దిస్ మోడీ…
  • పిల్లి కళ్ల పిల్ల మోనాలిసా ప్రేమపెళ్లి కథలో ట్విస్ట్… మొగుడిపై పోక్సో…
  • రేపు పోలింగ్ అనగా… ఓ ఉపఎన్నిక రద్దు… ఓ చిత్రమైన కేసు…
  • కొత్త కొత్త నాయికలతో రాజేంద్ర ప్రసాద్ రొమాన్స్… ఈమె ఎవరో తెలుసా…
  • ధ్వజమెత్తిన సందీప్ వంగా… ‘ధురంధర్ 2’ విమర్శకులకు చెంపపెట్టు…!
  • గులాబీ బాస్ ‘మౌన’ ముద్ర… తమ్ముళ్లలోనూ అదే ‘నిద్ర’…!
  • అడివి శేషుకు దీటుగా… అక్కడక్కడా దాటేసి… మెప్పించిన మృణాల్…
  • ఐపీఎల్ 2026… పదునైన ఆట మాత్రమే కాదు… అనేక ఎమోషన్స్ కూడా…
  • పాతతరం చీప్ మిసైళ్లతో అమెరికాకు చుక్కలు… నేలరాలిన విమానాలు…
  • మరిచిపోలేని మహామనీషి… మనం మరో పీవీని చూడగలమా..? నెవ్వర్..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions