.
పచ్చి వెలక్కాయ గొంతులో ఇరుక్కున్నట్టు… ఈ పాపులర్ తెలుగు సామెత విన్నారు కదా అనేకసార్లు… ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యతిరేకుల పరిస్థితి ఇదే… కక్కలేక, మింగలేక ఆపసోపాలు.,. అవస్థలు… ఆశాభంగాలు…
ఎందుకంటే…? రేవంత్ రెడ్డి వ్యతిరేక క్యాంపెయిన్ మాఫియా నెట్‌వర్క్‌కు నిజమైన ప్రజాసమస్యల మీద రియాక్ట్ కావడం తెలియదు… ఎంతసేపూ బురద, దుష్ప్రచారం, తద్వారా ఆత్మవంచన… ఎందుకు అంటున్నానంటే…
Ads
ఆ లీడర్‌కు నిజమైన ప్రజాజీవితం అంటే తెలియదు, కాదు, ప్రజాభీష్టాన్ని, ప్రజాభిప్రాయాన్ని గుర్తించి, గౌరవించలేని పెడపోకడ, నియంతతనం… ఏడాదిన్నర దాటినా తను బయటికి రాడు, నువ్వు ప్రతిపక్షంగా ఉండు, పదేళ్లు పాలించిన నీ పోకడలు కాస్త చాలించు అని ప్రజలు చెప్పినా సరే గౌరవించడు, ప్రజలంటే తూష్ణీభావం…
సరే, రేవంత్ రెడ్డికీ కాంగ్రెస్ హైకమాండుకూ అగాధం పెరిగిందనీ, అందుకే ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లినా రాహుల్ గాంధీ టైమ్ ఇవ్వడం లేదనీ, ఇక రేపోమాపో రేవంత్ రెడ్డి పని మటాషేనని ప్రచారం మొదలుపెట్టారు… ఇప్పటికిప్పుడు అవకాశం లేదు గానీ లేకపోతే ఆ కేసీయార్‌ను తీసుకొచ్చి కుర్చీ మీద కూర్చోబెట్టాలనే ఆతృత, యావ… జనం ఏమనుకుంటున్నారనే సోయి కూడా లేని దుర్భావన…
వోకే, రేవంత్ రెడ్డి కులగణన మీద, బీసీ రిజర్వేషన్ల మీద ఎంపీలకు, కాంగ్రెస్ ముఖ్యులకు ప్రజెంటేషన్ ఇవ్వడానికి, మీరు పార్లమెంటులో పోరాడండి అని చెప్పడానికి ఢిల్లీ వెళ్లాడు… అది బీసీల రిజర్వేషన్ల మీద తను కనబరిచిన కమిట్మెంట్… ఫలితం జానేదేవ్, ఎవరెంత పోరాడారనేదే కదా రాజకీయాల్లో ముఖ్యం…
ఎఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, కాంగ్రెస్ బాస్ రాహుల్ గాంధీ సహా అందరూ వచ్చారు, ప్రజెంటేషన్ ఇచ్చారు… రేవంత్ తను ఎక్సపెక్ట్ చేసిందానికన్నా బాగా పనిచేస్తున్నాడు అని రాహుల్ కితాబునిచ్చాడు… ఖర్గే, వేణుగోపాల్ తదితరులు అభినందనగా భుజం తట్టారు… అంతేకాదు, సోనియాగాంధీ కూడా ‘సారీ, రేవంత్, టైమ్‌కు నీ ప్రజెంటేషన్‌కు రాలేకపోయాను’ అని ఓ లెటర్ పెట్టింది…
అంటే… ఎఐసీసీ హేపీ విత్ రేవంత్ రెడ్డి… అవును, పార్టీలో ఓ కార్యకర్తకు, ఓ నాయకుడికి ఆనందమే కదా… అందుకే సోనియా లేఖ నాకు ఆస్కార్, లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్, నోబెల్ అని సంబరపడ్డాడు… మీటింగులో ఆ లేఖ చూపించి చెబుతున్నప్పుడు ప్రియాంక కూడా ఎమోషన్‌కు గురైంది… ఆమె తన పట్ల వ్యతిరేక భావనతో లేదనీ, తన పనితీరు పట్ల సంతృప్తిగా ఉందని గమనించి, గుర్తించి, ఆనందపడితే అందులో తప్పేముంది..?
ఎస్, ఇందులో తప్పేముంది..? ఎస్, తెలంగాణలో కులగణన మోడీని డిఫెన్సులో పడేసింది… నేనూ చేస్తాను అని తలవంచి ప్రకటించాడు… రేవంత్ రెడ్డికి ఇది ఓ విజయమే కదా… వోకే, రిజర్వేషన్లపై పోరాటం తప్పదు, నేను రెడీ అంటున్నాడు రేవంత్ రెడ్డి…
ఇది సోకాల్డ్ బీఆార్ఎస్ పార్టీకి నిజంగానే జీర్ణం కావడం లేదు, మింగుడుపడటం లేదు… సహజమే, రాజకీయాల్లో ఇవన్నీ ఉంటాయి… కానీ లోలోపల రేవంత్ రెడ్డి కులగణన, బీసీ రిజర్వేషన్లపై దూకుడుగా వెళ్తున్న పోకాడ, కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి అనివార్యంగా దక్కుతున్న మద్దతు ఆ క్యాంపుకి మరింత కంటగింపుగా మారింది…
ఇదంతా రియాలిటీ… ఎవరికి డైజెస్టయినా కాకపోయినా సరే..,. నిజం చెప్పుకోవాలంటే ఇదే… రేవంత్ రెడ్డి పార్టీలో అంతర్గతంగా, పార్టీ బయట బహిర్గతంగా అప్పర్ హ్యాండ్‌లోకి రావడం చాలామందికి మింగుడుపడకపోతే ఫాఫం తనేం చేస్తాడు… తన దారిలో తాను వెళ్లాల్సిందే కదా…
Share this Article