Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రష్మిక మంధాన శుక్రమహర్దశ..! నాగార్జున చెప్పింది అక్షరసత్యం..!

June 22, 2025 by M S R

.

ఆమె ఓ పవర్ హౌజ్… మాకెవ్వరికీ లేని రికార్డు ఆమెది… 3000 కోట్ల రూపాయల పర్సనాలిటీ అన్నాడు నాగార్జున రష్మిక మంధానను ఉద్దేశించి… అతిశయోక్తి ఏమీ లేదు… నిజాయితీగానే, ప్రశంసాపూర్వకంగానే అన్నాడు…

ఆలియా, దీపిక, ప్రియాంక ఎట్సెట్రా అందరికన్నా ఆమె సక్సెస్ రేట్ హైరేంజ్ ఇప్పుడు… ప్రస్తుతం అక్షరాలా ఆమె దశ నడుస్తోంది… ఎహె, అదేమీ లేదు… పుష్ప బన్నీ- సుకుమార్ ప్రతిభ.., యానిమల్ రణబీర్‌కపూర్, వంగ సందీప్ రెడ్డి ప్రతిభ… ఛావా విక్కీ కౌశల్ ప్రతిభ, అంతేతప్ప ఆమెదేముంది అని ఆల్రెడీ కొట్టిపారేస్తున్నారు కొందరు…

Ads

అంటే, ఆ విజయాల్లో ఆమె పాత్ర లేదా..? పోనీ, ఆమె లేకుండానే ఆ విజయాలు సాధ్యమయ్యాయా..? మరి ఆమెకు ఎందుకు క్రెడిట్ ఇవ్వడానికి వెనుకాడటం..! ఖచ్చితంగా ఇప్పుడు ఆమె ఇండియాన్ సినిమాకు సంబంధించి ఫుల్ డిమాండ్ ఉన్న నటి…

rashmika

వాటికి తోడు ఇప్పుడు కుబేర… అన్నీ సాలిడ్ హిట్స్… పుష్ప-2 గురించి చెప్పక్కర్లేదు… కుబేరకు 4 కోట్లు తీసుకున్న ఆమె పుష్ప-2కు 10 కోట్లు తీసుకుందని అంటారు… అంటే, అవసరాన్ని బట్టి, బ్యానర్‌ను బట్టి, కథను బట్టి, పాత్రను బట్టి పట్టూవిడుపులే తప్ప నాకు ఇంత కావాల్సిందేనని భీష్మించదు…

పైగా ఆ పాత్రల ఎంపిక చూడండి… పుష్ప, పుష్ప-2 ఓ స్మగ్లర్ భార్య… యానిమల్ ఓ బోల్డ్ తరహా కేరక్టర్… ఛావాలో ఓ హిస్టారిక్ వీరుడి భార్య పాత్ర… కుబేరలో అంత ప్రాధాన్యం లేదు కానీ ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల సినిమా అనగానే ఆమెకు నచ్చి చేసింది… ఇవే కాదు… ఇప్పుడు ఆమె చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి… అందులో ఒకటి సల్మాన్ ఖాన్ సినిమా…

rashmika

తెలుగు, తమిళం, హిందీ… ఎటొచ్చీ అప్పుడప్పుడూ ఆమె చుట్టూ కన్నడ వివాదాలు చుట్టుముట్టి తనే దూరదూరం ఉంటోంది… అప్పుడెప్పుడో కిరిక్ పార్టీ తొమ్మిదేళ్ల క్రితం అరంగేట్రం… ఈ స్వల్ప వ్యవధిలోనే టాప్ స్టార్ అయిపోయింది… అదృష్టమే కాదు, అందం, నటన, పాత్రల ఎంపికలో జాగ్రత్త… అవీ కారణాలు…

కెరీర్ మొదట్లో రక్షిత్ శెట్టితో ప్రణయం, ఎంగేజ్‌మెంట్, కానీ బ్రేకప్… తరువాత రక్షిత్ శెట్టి బాపతు స్నేహగణం ఒకరకంగా ఆమె పట్ల విముఖంగా… ఆమెకు వ్యతిరేకంగా వ్యవహరించారు… తెలుగులో గీతగోవిందం, తరువాత సరిలేరు నీకెవ్వరు సినిమాతో తెలుగులో బలంగా అడుగుపెట్టి… పుష్పతో స్టాండయిపోయింది, పుష్ప-2తో పాతుకుపోయింది…

rashmika

ఆ గీతగోవిందుడు విజయ్ దేవరకొండ సాహచర్యంతో పాత చేదు అనుభవాల్ని మరిచిపోయి, ఈ సక్సెస్‌లను ఎంజాయ్ చేస్తోంది ఈ కొడవ పిల్ల… అంటే అదొక ప్రత్యేకమైన కులం… కొడగు జిల్లాలో బీసీలు… ప్రత్యేక సంస్కృతిని పాటించే మిలిటరీ బాపతు కులం… అంటే సైనికకులం… లైసెన్స్ లేకుండా తుపాకీ కలిగి ఉండే హక్కు ఉంది…

ఫీల్డ్ మార్షల్ కేఎం కరియప్ప, ఆర్మీ జనరల్ కేఎస్ తిమ్మయ్య, ఎయిర్ మార్షల్ కేసీ కరియప్ప, లెఫ్టినెంట్ జనరల్ బాన్సీ పొన్నప్ప… అదీ ఆమె పరంపర… ఇదంతా ఎందుకు చెప్పడం అంటే… ఆమె కూడా ఫైటర్ అని చెప్పడానికి..!! మాతృ ఇండస్ట్రీలో రకరకాల విమర్శలతో ఆమె పట్ల వివక్ష చూపిస్తున్నా.,., ఇంట కాదు, రచ్చ గెలిచి చూపిస్తోంది కాబట్టి..!!

kubera

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ దళపతి సీఎం జోసెఫ్ విజయ్ కాదు… రజినీకాంత్…
  • Drone Warfare … 5 లక్షల మందితో ‘డ్రోన్ ఆర్మీ’… ప్రత్యేక శిక్షణ…
  • నాటి ఆ స్వాతికిరణం గంగాధరం ఇప్పుడేం చేస్తున్నాడు..?
  • SCCL … సింగరేణి కుటుంబాలకు కోటి రూపాయల భరోసా…
  • ‘ఓటీటీలపై ఆశలు పెట్టుకుని సినిమాలు తీయకండి’… అల్లు ఉద్బోధ…
  • బాబును ఏమీ అనలేడు- పవన్‌ తప్పనలేడు- జగన్‌ను అనకుండా ఉండలేడు…
  • సీజేపీ ధర్నా… బొద్దింకల పేరిట ‘యాంటీ మోడీ’ సెక్షన్ హంగామా…
  • … అలా నెమ్మ‌దిగా ఇళ‌య‌రాజా అనేవాడి మీద కాస్త ఇంట్ర‌స్టు మొద‌లైంది’
  • నిర్మాతలు, హీరోలు దర్శకుల్ని పేద్ద కాక్రోచ్‌లను చేస్తే… ‘పెద్ది’లు పుడతారు…
  • రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌పై కాక్రోచ్ మీడియా తప్పుడు వాదనలు ఇలా..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions