ఎందుకు కశ్మీర్ ఫైల్స్ సినిమా మీద యాంటీ బీజేపీ, యాంటీ హిందుత్వ శక్తులన్నీ విరుచుకుపడుతున్నయ్..? ‘‘బీజేపీ తీయించిన సినిమా, కావాలని సమాజంలో పోలరైజేషన్ కోసం ఉద్దేశించిన మూవీ, విద్వేషాన్ని ప్రచారం చేస్తోంది, అబద్ధాల్ని చూపిస్తోంది’’ అని విమర్శిస్తున్నయ్… మోడీ ఆ టీంను పిలిచి అభినందించడాన్ని ఉదహరిస్తున్నయ్… రైట్ వింగ్ సినిమాను బలంగా ప్రమోట్ చేయడాన్ని ఆక్షేపిస్తున్నయ్… నిజంగా ఆ సినిమా బాధ్యులెవరు..? నిజమే, కీలక వ్యక్తులంతా బీజేపీ వాళ్లే… సో వాట్..? అందుకే ధైర్యంగా సినిమా తీశారు, రిలీజ్ చేశారు, ఎవరో ఒకరు చరిత్ర చూపిస్తే తప్పేముంది అంటారా..? సరే, అదంతా వేరే చర్చ… ఈ కీలకవ్యక్తుల గురించి ఓసారి చదవండి…
దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి… సెంట్రల్ సెన్సార్ బోర్డు సభ్యుడు… నేను మోడీ అభిమానిని అని బహిరంగంగానే ప్రకటించుకున్నాడు… అర్బన్ నక్సల్స్ అని ఓ పుస్తకం రాశాడు… లాల్ బహదూర్ శాస్త్రి సందేహాస్పద మరణం మీద 2019లో ది తాష్కెంట్ ఫైల్స్ సినిమా తీశాడు… ఈ కశ్మీర్ ఫైల్స్ సినిమా నిర్మాణంలో తనూ డబ్బుపెట్టాడు… రైటిస్టు… వివేక్ భార్య పేరు పల్లవీ జోషి… ఆమె ఈ సినిమాలో రాధిక మేనన్ అనే ఓ కీలకపాత్రలో నటించింది… కశ్మీర్ ఫైల్స్ నిర్మాతల్లో తన పేరు కూడా ఉంటుంది…
నిర్మాత అభిషేక్ అగర్వాల్… హైదరాబాదీ… అయిదు తెలుగు సినిమాల్ని నిర్మించాడు… కిరాక్ పార్టీ, సీత, గూఢచారి, రాజరాజచోర వంటివి… కశ్మీర్ ఫైల్స్ ప్రధాన నిర్మాత తనే… తన రాజకీయ నేపథ్యం మీద పెద్దగా ఎవరికీ క్లారిటీ లేదు… కానీ ఈ నిర్మాణ, నట బృందం మొత్తం దాదాపు బీజేపీ భావజాలమే… కాబట్టి తననూ అందులో కలిపేస్తే సరి…
Ads
సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసింది జీస్టూడియోస్… ఇది సతీష్ చంద్రది… ప్రముఖ ఎస్సెల్ గ్రూప్ ఛైర్మన్… ఇప్పుడు ఆ వ్యవహారాలన్నీ కొడుకులు చూసుకుంటున్నారు… సతీష్ చంద్ర ఓ దఫా బీజేపీ మద్దతుతో ఎంపీగా గెలిచాడు… ఇండియన్ ఫిలిమ్, మీడియా అండ్ కమ్యూనికేషన్స్ రంగంలో ఈ ఫ్యామిలీది బలమైన స్థానం… ఈ సినిమాలో ఐఏఎస్ బ్రహ్మదత్ పాత్ర పోషించిన మిథున్ చక్రవర్తి బీజేపీ మాజీ ఎంపీ…
ఈ సినిమాలో కీలకపాత్ర పోషించిన అనుపమ్ ఖేర్ హార్డ్ కోర్ మోడీ అభిమాని… కశ్మీరీ పండిట్ల ఇష్యూ మీద మాట్లాడటం తనకు కొత్తేమీ కాదు… Film and Television Institute of India మాజీ ఛైర్మన్… తనను తాను నిజమైన జాతీయవాది అని చెప్పుకునే ఖేర్ భార్య పేరు కిరణ్ ఖేర్… ఆమెకు తనతో రెండో పెళ్లి… 2014లో ఆమె చండీగఢ్ నుంచి బీజేపీ తరఫున ఎంపీగా గెలిచింది… సో, వాళ్లది కాషాయకుటుంబమే…
అనుపమ్ ఖేర్ ఎంత కరడుగట్టిన జాతీయవాది అంటే… 2016లో దిటెలిగ్రాఫ్ ఓ నేషనల్ డిబేట్ నిర్వహిస్తే, ఆ వేదిక మీద సుప్రీం మాజీ జడ్జి జస్టిస్ గంగూలీని నేరుగా నిందించాడు… అఫ్జల్ గురు మీద సుప్రీంకోర్టు తీర్పు తప్పు అని వ్యాఖ్యానించినందుకు గాను గంగూలీని ఉద్దేశించి, ఓ సుప్రీం మాజీ జస్టిస్‌గా ఈమాట మీ నోటి వెంట విన్నందుకు షాకింగ్‌గా ఉంది, నన్ను సిగ్గుపడేలా చేస్తోంది, చింతిస్తున్నాను అని వ్యాఖ్యానించాడు…
(యూట్యూబ్‌లో కూడా ఆ వీడియోలు దొరకొచ్చు చూడాలంటే…) ఈ వ్యాఖ్యల మీద పెద్ద చర్చే సాగింది అప్పట్లో… కాంగ్రెస్ నాయకుడు రణదీప్ సూర్జేవాలాకు అసహనం సబ్జెక్టుపై వాతలు పెట్టాడు… (అప్పట్లో ‘‘అసహనం సీజన్’’ నడుస్తోంది)… దేశాన్ని ముక్కలు చేస్తామంటూ నినాదాలు చేసేవాళ్లను సపోర్ట్ చేస్తున్నారా అనడిగాడు… అఫ్‌కోర్స్, బీజేపీకే చెందిన సాధ్వి ప్రాచీ, యోగి ఆదిత్యనాథ్‌లను పార్టీ నుంచి బయటికి పంపించేసి, జైల్లో పెట్టాలనీ డిమాండ్ చేశాడు…
Share this Article