నిజానికి మన తెలుగు టీవీల్లో కనిపించేవన్నీ ఫేక్ లవ్ ట్రాకులు… బిగ్‌బాస్ దగ్గర్నుంచి… ప్రతి టీవీ రియాలిటీ షోలో కనిపించేవన్నీ ఉత్తుత్తి ప్రేమలు… అంటే ప్రేక్షకులను ఆకర్షించటానికి ఏవో టక్కుటమార జిమ్మిక్కులు… ఒక యాంకర్ ప్రదీప్, ఒక డాన్సర్ పూర్ణ లేదా ఒక సింగర్ హారిక… ఒక సుడిగాలి సుధీర్, ఒక యాంకర్ రష్మి… ఒక హైపర్ ఆది, ఒక యాంకర్ వర్షిణి… ఇలాగన్నమాట… అయితే ఇటీవల బాగా పాపులర్ అయిన సింగర్ యశస్వి తన ఒరిజినల్ గరల్ ఫ్రెండ్ ని ఎంచక్కా స్టేజ్ మీద బహిరంగంగా పరిచయం చేశాడు…
వచ్చే ఆదివారం రోజులు జీ టీవీలో ప్రసారం చేసే పార్టీకి వేళాయెరా అనే ప్రోగ్రామ్ బాపతు ప్రోమో కొడుతున్నారు నిన్నా ఈరోజు… తాజా ప్రోమో ప్రకారం యశస్వి కళ్ళకి గంతలు కట్టి, తన గరల్ ఫ్రెండ్ ని తీసుకొచ్చి సర్ ప్రైజ్ ఇచ్చారు నిర్వాహకులు…
Ads
తన పేరు జాను… ముంగాళ్ల శ్రీ ఝాన్సీ…! అది కాదు ఇంటరెస్టింగ్ అనిపించింది ఏమిటంటే..? తను ఏడో తరగతిలో ఉండగా ప్రపోజ్ చేశాడట… ఎనిమిదో తరగతిలో ఆక్సెప్ట్ చేసిందట… ఆ తేదీని తన చేతి మీద టాటూ వేయించుకున్నారు… 18 ఆగస్టు 2008… హహహ… అయిదో తరగతి నుంచే కెరీర్… ఏడో తరగతి నుంచి లవ్వు… బాగుందోయ్…
ఏదో టీన్స్‌లో అలాంటి ఆకర్షణలు సహజం… తరువాత ఎవరి దారి వారిదే అంటారా..? కాదు… ఆమెను ఈరోజు దాకా అలాగే ప్రేమిస్తున్నాడు… తన మెడిసిన్ అయిపోయి, సింగర్‌గా కెరీర్ ఎంచుకుని పాటబాటలోనే పయనిస్తున్నాడు… ఆమె తన వెంటే ఉంది… ఓ ప్రియ స్నేహితురాలిలా…
ప్రస్తుతం జీటీవీలో వస్తున్న సరిగమప పాటల పోటీలో యశస్వి కూడా పాల్గొంటున్నాడు… ఆల్రెడీ కొన్ని సినిమా పాటలు పాడాడు ఇప్పటికే… లైఫ్ ఆఫ్ రామ్‌లో పాడిన థీమ్ సాంగ్ ఒకటిన్నర కోట్ల వ్యూస్ సంపాదించింది… మరోవైపు ఓ యూట్యూబ్ చానెల్ నడిపిస్తుంటాడు… వర్తమాన గాయకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న యశస్వికి సెలబ్రిటీ స్టేటస్ ఇప్పుడు… ఆమధ్య ఏదో ప్రోగ్రాం (జీ ఎంటర్టైన్మెంట్ లీగ్ 2020)లో తను ఆ పాట ఆలపిస్తే నటి రీతూ అకస్మాత్తుగా వేదిక మీదకు వచ్చి, కౌగిలించుకుని, అక్కడికక్కడే ప్రపోజ్ చేసిన సంగతి అప్పట్లో నెట్లో రచ్చ రచ్చ అయిన సంగతి తెలుసు కదా…
Share this Article