Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కేసీయార్ పదేళ్ల స్వరాష్ట్ర పరిపాలనకు మరో వికృతకోణం ఇది…

September 13, 2025 by M S R

.

స్వరాష్ట్ర సాధన తరువాత కేసీయార్ సాగించిన పదేళ్ల అరాచక, అక్రమ, అవినీతి, అప్రజాస్వామిక, నియంతృత్వ పాలనలో ఇది మరో వికృతకోణం…

ఈమాట హార్ష్‌గా అనిపించినా సరే… వరుసగా బట్టబయలవుతున్న విషఅధ్యాయాల్లో మరొకటి చెప్పుకోవాలి… వెయిట్, వివరంగానే చెప్పుకుందాం…

Ads

ముందుగా ఈ ఫోటో చూడండి…

acb

90 రోజుల్లో 84 మందిని దొరకబుచ్చుకుంది ఏసీబీ… సరే, టిప్ ఆఫ్ ఐస్ బర్గ్… ఐనా సరే, పదేళ్ల తరువాత కాస్త దూకుడు కనిపిస్తోంది… సీన్ కట్ చేయండి ఇక…

కేసీయార్ అవినీతి భ్రష్ట చరిత్ర ఏమిటో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు వెలుగుబంటి సూర్యనారాయణ ఈఎస్ఐ బిల్డింగు దగ్గర నుంచి వేల కోట్ల సహారా కుంభకోణం దాకా తెలుసుకున్నాం కదా… తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, సోకాల్డ్ జాతిపిత, దేవుడు, కాస్మిక్ శక్తి, మన్నూమశానం అనే విశ్వకీర్తనల్ని కాసేపు పక్కన పెడితే…

ధరణి… ప్రపంచం ఎన్నడూ ఎరుగని స్కామ్… కాళేశ్వరం, సీఎమ్మార్, విద్యుత్తు కొనుగోళ్లు, గొర్లు, బర్లు, వాట్ నాట్… ఫోన్ ట్యాపింగు వంటి అనైతిక, అరాచక పాన్ వరల్డ్ అక్రమాల దాకా… గులాబీ ప్రపంచంలో  ప్రతిదీ అవినీతే… నెవ్వర్, రేవంత్ రెడ్డి మరో ఇరవై ఏళ్లు పాలించినా సరే, వాటి నిగ్గు తేల్చలేడు, శిక్షించలేడు… అదొక పూర్ యాంగిల్ అండ్ రియాలిటీ…

అన్నీ కాసేపు వదిలేస్తే… మరో కోణం… ఎమ్మెల్యేలను సామంతరాజులను చేసి, అరాచక పాలనకు ఊతమిచ్చిన కేసీయార్ చివరకు ఉన్నతాధికారులు, ఉద్యోగులను కూడా సమాజం మీదకు వదిలేశాడు, మీ ఇష్టం వచ్చింత దోచుకొండిరా, మీ మీద ఈగ వాలకుండా నేను చేసుకుంటాను అని… బహుశా ప్రపంచంలో తనొక్కడే అనుకుంటా ఈ రేంజ్ అక్రమాల మద్దతుపాలకుడు…

ఎవరైనా సరే, తన పాలనలో అధికార్లు (తనెంత దోచుకున్నా సరే) అవినీతికి పాల్పడకుండా ఉండాలని కోరుకుంటారు… కానీ కేసీయార్ డిఫరెంట్… నేనూ దోచుకుంటా, మీరూ దోచుకొండి అని ప్రజాప్రతినిధులకు, అధికార్లకు ఫ్రీడం ఇచ్చేయడం… ప్రపంచం ఇలాంటి పాలకుడిని ఇక చరిత్రలో చూడలేదు…

kcr

ఇది వెలుగు అనే కాంగ్రెస్ అనుకూల పత్రికలో వచ్చిన ఫస్ట్ పేజీ కథనం… పదేళ్లలో 800 కేసులు..,. సర్లేరా, భలే సంపాదించుకున్నారు అని ఏసీబీ ట్రాప్ చేసినా సరే… కేసీయార్ క్షమించేసిన చరిత్ర… చాలా ఔదార్యం… నేనొక్కడినే ఎందుకు..? ఎమ్మల్యేలు, ఉన్నతాధికార్లు మాత్రమే కాదు… ఎవడికి అందినకాడికి వాడు… దండుకొండి అన్నట్టుగా…

కేసీయార్ పాలనలో ఏ అధికారిని ఏసీబీ తన్నినా కోట్లకుకోట్లు బయటపడ్డయ్… ఇప్పటికీ కాళేశ్వరం బాపతు కేసుల్లో వందల కోట్లు… ఒక్కొక్కడూ ఎమ్మెల్యేలను మించి… మంత్రులు కూడా సిగ్గుపడేలా సంపాదించారు… ఒక్కడిని… ఒక్కడిని చూపించండి… శిక్ష పడినవాడిని… నెవ్వర్…

కేసీయార ప్రభుత్వం ప్రాసిక్యూషన్‌కు అనుమతిస్తే కదా… 800 కేసులు… అర్థం చేసుకొండి… నేనూ, మీరూ, మనమందరమూ తెలంగాణ స్వరాష్ట్రాన్ని దోచుకుందాం, ఇక అడ్డేముంది అన్నట్టుగా… నిజంగా తెలంగాణ ఎంత ఎడ్డి తెలంగాణ… ఓ నియంత, ఓ పెద్ద దొర పాలనలో… ఓ బాధిత తెలంగాణ… దశాబ్దాల చరిత్రలో, ఉమ్మడి, దుర్మార్గపు ఆంధ్రా పాలనల్లో కూడా ఎరుగనంత దారుణంగా… ఘోరంగా…

ఏసీబీ, సీఐడీ వ్యవస్థల్ని మరీ దారుణంగా నిర్వీర్యం చేసిన ఘనత… పేరుకే అవి ఉంటయ్.., ఎవడికీ శిక్ష పడదు… ప్రాసిక్యూషన్ ఉండదు… డిపార్టమెంట్ విచారణ అనే దుర్మార్గమైన విధానంలో… రెడ్ హ్యాండెడ్ అక్రమార్కులను కూడా క్షమించేసిన చరిత్ర…

దురదృష్టం ఏమిటంటే... ఈరోజుకూ ఈ డిపార్ట్‌మెంట్ ఎంక్వయిరీ అనే వెసులుబాటు కొనసాగడం... అవినీతి, అక్రమాలకు పాల్పడనివాడే చరిత్రహీనుడు ఇప్పటికీ..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అసలే ఆమె రేఖ… పైగా ఓ సరళీకృత అక్రమ ప్రేమ కథ… తెర చించేసింది…
  • ఆహా… నోబెల్ అవార్డుల జ్యూరీకి మనస్పూర్తి ప్రశంసలు… ఎందుకంటే..?
  • అంబానీలు, ఆదానీలు బోలెడు… అచ్చమైన భారత ‘రతన్’ టాటా ఒక్కడే..!
  • రేఖ బయోబుక్..! పుట్టుక నుంచీ ఆమె లైఫ్ జర్నీపై సంపూర్ణ చిత్రణ…
  • రష్మికపై కన్నడ ఇండస్ట్రీ నిషేధం..? నిజమేనా..? ఎవరితో లొల్లి..?!
  • అగ్ని శలభ న్యాయం… జర్నలిజం కొలువులూ అంతే… మాడిపోతారు..!!
  • నీయమ్మని, నీయక్కని, నీతల్లిని… ఈ డర్టీ సాంగ్‌కు సిగ్గూశరం లేని సమర్థన..!!
  • నా బిడ్డ పెళ్లిని ఆ బైకర్ల గ్రూప్ రఫ్‌గా అడ్డుకుంది… కానీ మంచే జరిగింది…
  • ఆహా… దక్షిణ వాగ్గేయకారులకూ అయోధ్య రాముడి చెంత చోటు…
  • గుడ్డు అంటేనే గుడ్డు… వెరీ గుడ్డు… అకారణ భయాలే నాట్ గుడ్డు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions