Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

61 మంది మాఫియా డాన్‌ల పేర్లతో… యోగి సర్కార్ తాజా హిట్ లిస్ట్…

April 19, 2023 by M S R

ఈమధ్య యూపీలో అతిక్ అనే నొటోరియస్ గ్యాంగ్‌స్టర్ పొలిటిషియన్, తన బ్రదర్ ముగ్గురు యువకుల కాల్పుల్లో మృతిచెందాడు తెలుసు కదా… అంతకుముందు అతిక్ కొడుకు అసద్ ఎన్‌కౌంటరయ్యాడు… దాదాపు 11 వేల ఎన్‌కౌంటర్లతో ప్రకంపనలు సృష్టిస్తున్న యోగి ప్రభుత్వం ఇప్పటిదాకా కేవలం ‘కొమ్మ నరుకుడు’ చర్యలకే పరిమితమైంది… అంతగా యూపీలో మాఫియా, గ్యాంగ్‌స్టర్స్, పొలిటిషియన్స్ మిళితమైన అరాచకం పాతుకుపోయి ఉంది… ఇప్పుడిక వేళ్లు నరికే పని మొదలుకాబోతోంది…

హక్కుల సంఘాల మొత్తుకోళ్లు, సుప్రీంలో పిల్స్ గట్రా నడుస్తున్నయ్… యాంటీ బీజేపీ పార్టీలు ధ్వజమెత్తుతున్నయ్… కానీ నేరగాళ్లకు అవి మద్దతునిస్తున్నట్టుగా సంకేతాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి… దాదాపు 500 కోట్ల ప్రాపర్టీస్ అటాచ్ చేసిన పోలీసులు 61 మంది మాఫియా నేరగాళ్ల పేర్లతో ఓ జాబితా ప్రిపేర్ చేశారు… వాళ్లు ప్రధాన టార్గెట్లు… అయితే యోగి ఆదిత్యనాథ్ ఇంకా ఆ జాబితాకు ఆమోదముద్ర వేయలేదు… కానీ ఎప్పుడో ఓసారి తప్పదు… యోగి అంటే అంతే కదా మరి… (ఈ స్టోరీ ఇండియాటుడేలో పబ్లిషైంది…)

లా అండ్ ఆర్డర్ స్పెషల్ డీజీ ప్రశాంత్ కుమార్ ఈ మాఫియా హిట్ లిస్టు ఆచరణలోకి వస్తుందని గట్టిగా చెబుతున్నాడు… వారిలో పశు స్మగ్లర్లు, అక్రమ ఇసుక దందారాయుళ్లు, లిక్కర్ మాఫియా, ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్రూపులు ఉండగా, అందులో కొన్ని గట్టి పేర్లు కూడా ఉన్నయ్… అంటే పాపులర్ పిగర్స్ అన్నమాట… వీళ్లందరినీ మెడికల్ చెకప్ కోసం జైళ్ల నుంచి తీసుకురావల్సి ఉందని అర్థం చేసుకోవాలా..?

Ads

Sudhakar Singh, Pratapgarh … సుల్తాన్ పూర్ కు చెందిన లిక్కర్ మాఫియా డాన్ ఇతను… ప్రతాప్ గఢ్, సుల్తాన్ పూర్ ప్రాంతాల్లోని అక్రమ ఆల్కహాల్ వ్యాపారమంతా తనదే… గత ఏడాది లక్షల రూపాయల లిక్కర్ సీజ్ చేశారు… ప్రస్తుతం జైలులో ఉన్నాడు…

Gabbar Singh, Behraich ... గబ్బర్ సింగ్ అని కూడా పిలుస్తారు… చోరీలు, హత్యలు, దోపిడీలు, భూకబ్జాలు వంటి దాదాపు 56 నేరాలు తనపై నమోదై ఉన్నయ్… ఫైజాబాద్, గోండా, సుల్తాన్‌పూర్, లక్నో, బహ్రెయిచ్ ప్రాంతాల్లో నొటోరియస్…

Guddu Singh, Kunda …… అసలు పేరు సంజయ్ ప్రతాప్ సింగ్… గుడ్డూ సింగ్ అంటుంటారు… ప్రస్తుతం జైలులో ఉన్నాడు… ప్రతాప్ గఢ్ లోని కుండా ఇతని ఊరు… లిక్కర్ డాన్… హథిగవా పోలీసులు దాదాపు 12 కోట్ల విలువ చేసే మద్యాన్ని కనిపెట్టారు…

Udham Singh, Meerut.... యోగి ప్రభుత్వం తొలి టరమ్‌లోనే లిస్టవుట్ చేసిన 25 మంది టాప్ క్రిమినల్స్ జాబితాలో ఈయన పేరు కూడా ఉంది… పశ్చిమ యూపీ ఇతని కార్యస్థలి… తను కూడా జైలులో ఉన్నాడు ప్రస్తుతం… తన గ్యాంగ్ చేసిన హత్యల లిస్టు ఇంకా క్రోడీకరించాల్సి ఉంది… అంటే సంఖ్యలో అంత ఎక్కువగా ఉన్నాయని అర్థం…

Yogesh Bhadaura, Meerut…… మీరట్‌కు చెందిన క్రిమినల్… ఇతను ఉదమ్ సింగ్ ప్రత్యర్థి… గ్యాంగ్ డీ75 ఈ మాఫియా పేరు… మీరట్ ఏరియాలో భదవురాలో ఉండేవాడు… రకరకాల సీరియస్ కేసులు 40 వరకూ నమోదై ఉన్నాయి… ప్రస్తుతం జైలులో ఉన్నాడు…

Badan Singh Baddo…… ఇతను కూడా పశ్చిమ యూపీయే… హాలీవుడ్ స్టార్లను అనుకరిస్తుంటాడు జీవనశైలిలో… 40 కేసులున్నయ్… మొదట్లో టాప్ 25 క్రిమినల్స్ జాబితా ప్రిపేర్ చేస్తే అందులో తను కూడా ఉన్నాడు… కానీ 2019 నుంచి కనిపించడం లేదు… కనిపిస్తే కేసు ఖతమే అనేది భయం…

Ajit Chowdhary Akku…….. ఇతను మొరదాబాద్ మాఫియా సభ్యుడు… వసూలీ భాయ్… అధికారికంగానే 14 కేసులున్నయ్… సీరియస్ కేసులే…

Dharmendra kirthal…….. ఇతని మీద 49 సీరియస్ కేసులున్నయ్… అందులో 15 మర్డర్ కేసులే… స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఇతన్ని 2021లో డెహ్రాడూన్‌లో పట్టుకుంది…

Sunil Rathi …… భాగ్ పట్ కు చెందిన మరో నొటోరియస్ మాఫియా డాన్… ఇతను కూడా టాప్ 25 క్రిమినల్స్ లిస్టులో ఉన్నాడు… జైలులోనే మున్నా భజరంగి అనే వాడ్ని చంపినట్టు ఆరోపణ…

Abhishek Singh Honey aka Jahar …….ఐడీ 23 గ్యాంగ్ కు లీడర్… వారణాసి… జహర్ అంటారు… 20 వరకూ మర్డర్, దోపిడీ కేసులున్నయ్…

Nihal alias Bacha Pasi…….. డీ-46 గ్యాంగ్ లీడర్ తను… బచ్చా పాసి అని కూడా పిలుస్తారు… ప్రయాగరాజ్ ఏరియాలోని ధుమన్‌గంజ్ నివాసి… రెండు డజన్ల కేసులున్నయ్… మొదట్లో ఎక్సైజ్ యాక్ట్ కింద బుక్ చేశారు… 2006లో ముంబైలో కాలా ఘోడా షూటవుట్ కేసులో తన పేరు కూడా ఉంది… పరారీలో ఉన్నాడు…

Rajan Tiwari ….… గోరఖ్‌పూర్ జిల్లా, సోహ్‌గౌరాకు చెందినవాడు… ప్రకాష్ శుక్లా అసిస్టెంట్… బీహార్‌లో రెండుసార్లు ఎమ్మెల్యే అట… 2019 లోకసభ ఎన్నికల ముందు బీజేపీలో చేరాడనేది ఓ విశేషం… తరువాత పార్టీ నుంచి విడిపోయాడు… అంతకు ముందు 2016లో బీఎస్పీలో ఉన్నాడు…

Sudhir Kumar Singh …. ఇతను బీఎస్సీ… పిప్రవులి బ్లాక్ మాజీ చైర్మన్… సుదీర్ఘమైన నేరచరిత్ర… 26 ఆరోపణలున్నయ్ తనమీద…

Vinod Upadhyay…. ఇతను కూడా గోరఖ్‌పూరే… పలు పోలీస్ స్టేషన్లలో 25 ఫిర్యాదులున్నయ్ తన మీద… ప్రస్తుతం జైలులో ఉన్నాడు…

Rizwan Zaheer …. ఎస్పీ లీడర్, మాజీ ఎంపీ రిజ్వాన్ జహీర్… 14 కీలక కేసులున్నయ్… వాటిల్లో మర్డర్ కేసులు కూడా…

Dilip Mishra…….. గతంలో బీఎస్పీ, ఎస్పీ లీడర్, తనది ప్రయాగరాజ్… ప్రస్తుతం జైలులో ఉన్నాడు… గతంలో ప్రిపేర్ చేసిన టాప్ 25 క్రిమినల్స్ జాబితాలో ఉన్న పేరే ఇది కూడా…

Anupam Dubey, Farrukhabad…. ఇతను బీఎస్పీ లీడర్… 41 కేసులు… అందులో ఒకటి ప్రధానమైంది మర్డర్ కేసు…

Haji Iqbal.…. ఇతనిది మైనింగ్ మాఫియా… మాజీ ఎమ్మెల్సీ… బాల అని పిలుస్తారు… లఖింపూర్, గోరఖ్‌పూర్, సితాపూర్ సుగర్ మిల్లులకు ఓనర్…

Bachchu Yadav…. లక్నోకు చెందిన బచ్చూ యాదవ్ గంజాయి అమ్మేవాడు… తరువాత 25 కేసులు నమోదయ్యాయి…

Jugnu Walia…… తనదీ లక్కోయే… గ్యాంగ్ స్టర్ టర్న్‌డ్ పొలిటిషియన్ ముక్తార్ అన్సారీకి ప్రధాన అనుచరుడు… పరారీలో ఉన్న తన మీద 12 పెద్ద కేసులున్నయ్…

Lallu Yadav….. లక్నో… చాలా ఫేమస్ క్రిమినల్… ప్రస్తుతం కస్టడీలో ఉన్నాడు…

ముక్తార్ అన్సారీ, బ్రిజేష్ సింగ్, త్రిభువన్ సింగ్, ఖాన్ ముబారక్, సలీమ్, సోహ్‌రబ్, రుస్తుం, బబ్లూ శ్రీవాత్సవ, వ్లుమేష్ రాయ్, కుంతు సింగ్, సుభాష్ ఠాకూర్, సంజీవ్ మహేశ్వరి జీవా, మునీర్ తదితరులు కూడా ప్రస్తుతం లిస్టవుట్ చేసిన పేర్లలో ఉన్నారు… పలువురు లక్నో జైలులో ఉన్నారు… యోగి హిట్ లిస్టులో కేవలం ముస్లింలే ఉన్నారనే ప్రచారం అబద్దమని ఈ లిస్టే చెబుతోంది… కానీ అందరికీ ‘‘మెడికల్ చెకప్స్’’ సాధ్యం కాకపోవచ్చు…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions