Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బండి పోయిందా..? అక్కడ ఆల్‌రెడీ స్పేర్‌పార్టులుగా మారిపోయి ఉంటుంది..!!

December 17, 2021 by M S R

…….. By… పార్ధసారధి పోట్లూరి ……… ఉత్తరప్రదేశ్, మీరట్… చోర్ బజార్ అని ప్రసిద్ధి చెందిన సొంటి గంజ్ మార్కెట్… దాన్ని ఇప్పుడు మూసేసే పనిలో ఉన్నాడు సీఎం యోగి ఆదిత్యనాథ్ ! అసెంబ్లీ ఎన్నికల వేళ కూడా ఏమాత్రం బెదరక తీసుకున్న కఠిన నిర్ణయం ఇది! ఇలాంటి నిర్ణయం కేవలం యోగి మాత్రమె తీసుకోగలడు, అమలుపరచగలడు. అయ్యో వోట్లు పోతాయేమో అనే భయం లేదు… యోగి ఆదిత్యనాథ్ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి వరుసగా తీసుకుంటున్న నిర్ణయాలతో ఇప్పటికే యూపీ గూండా రాజ్ సగం చచ్చిపోయింది… ఎన్‌కౌంటర్లలో చనిపోయిన వారు చనిపోగా, ప్రాణ భయంతో మిగిలిన గూండాలు వాళ్ళ గ్యాంగులు మహారాష్ట్ర, బెంగాల్ రాష్ట్రాలకి పారిపోయి బిక్కు బిక్కుమని బ్రతుకుతున్నారు. ఏదో ఆశ… మళ్లీ అఖిలేష్ రాజ్యం రాకపోదు, మళ్లీ పూర్వ వైభవం రాకపోదు అని…! ఇక ఈ గూండాల అనుచరులు లొంగిపోయి జైళ్లలో మగ్గుతున్నారు. కనీసం బెయిల్ కోసం కూడా ప్రయత్నించట్లేదు.. ఎందుకంటే జైల్లో ఉంటె కనీసం బ్రతికి ఉంటాము అనే భరోసా… ఇక వీళ్ళకి బెయిళ్లు ఇప్పించే ముఠాలు ఉంటాయి సిద్ధంగా 24 గంటలు సదా సేవలో! మూడేళ్ళుగా వీళ్ళకి పని లేక ఆదాయం లేక గిలగిలలాడుతున్నారు… యోగి రాకముందు వీళ్ళందరికీ భలే డిమాండ్ ఉండేది…

chorbazar

1. చోర్ బజార్ గా ప్రసిద్ధి చెందిన సొంటి గంజ్ అనేది ఆటోమొబైల్ కి సంబంధించిన ప్రతిదీ దొరికే దొంగ వ్యాపారం జరిగే ప్రదేశం… దాదాపుగా 10 వేల మంది బ్రతుకుతున్నారు ఈ సొంటి గంజ్ అలియాస్ చోర్ బజార్ మీద… 2. తాజాగా ఈ సొంటి బజార్ లోని షాపుల యజమానులకి మీరట్ పోలీసులు 91 of CrPC సెక్షన్ కింద నోటీసులు ఇచ్చారు. దీని ప్రకారం గత 10 సంవత్సరాల రికార్డులతో పాటు GST వివరాలు ఇవ్వాలి. అప్పుడే ఆ షాపులు నడుపుకోవడానికి అనుమతి ఇస్తారు. మీరట్ జిల్లా పోలీస్ సూపరింటిండెంట్ ప్రభాకర చౌదురి స్వీయ పర్యవేక్షణలో కథ మొదలైంది…

Ads

౩. మొత్తం ౩౦౦ దాకా షాపులు ఉన్నాయి సొంటి గంజ్ మార్కెట్ లో… వీటిలో 100 షాపులు దొంగ వ్యాపారం చేసున్నట్లు గుర్తించారు పోలీసులు… [నెలకి సొంటి గంజ్ మార్కెట్ నుండి 10 లక్షల దాకా పోలీసు మామూళ్ళు వెళతాయంటారు… కాబట్టి ఎవరు దొంగ బండ్లు కొని అమ్ముతారో పోలీసులకి బాగానే తెలుసు]. ఇక పోలీసు మామూళ్ళు కూడా ఆగిపోయినట్లే !

4. ఈ సొంటిగంజ్ ఆటో మొబైల్ మార్కెట్ ఆసియాలోనే No.1 దొంగ స్పేర్ పార్టులు అమ్మే మార్కెట్ !

5. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం అయిన ఉత్తరప్రదేశ్ లో చోరీ అయిన కార్లు, మోటార్ సైకిళ్ళు ఎక్కువగా ఢిల్లీలోని ఆటో చోర్ బజార్ లో అమ్మేస్తారు. లోకల్ చోరీ వాహనాల్లో చాలా కొద్దిగా మీరట్ సొంటి గంజ్ మార్కెట్ కి వస్తాయి. ఇది ఢిల్లీ మీరట్ చోర్ బజార్ ల మధ్య ఒప్పందం అన్నమాట ! ఎందుకంటే ఒక మోటార్ సైకిల్ పోయింది అని ఫిర్యాదు చేస్తే అది సొంటిగంజ్ లో ఉండదు, ఢిల్లీ వెళ్లి వెతకాలి కాబట్టి పోలీసులు వాహనదారుడిని వేల లంచం అడుగుతారు కాబట్టి వాహన స్వంతదారుడు పోలీసులకి వేలు ఇచ్చే బదులు కొత్తది కొనడమే మేలు అని భావించి ఊరుకుంటాడు. ఇదీ మీరట్ లోని సొంటి గంజ్ చోర్ బజార్, ఢిల్లీలోని చోర్ బజార్ ల మధ్య అవగాహనకి ప్రధాన కారణం.

chorbazar

6. ఇక దేశంలోని అన్ని ప్రధాన నగరాలలో చోరీకి గురయ్యే వాహనాలలో ఢిల్లీదే అగ్రస్థానం. అలాగే ఢిల్లీలో చోరీకి గురయిన కార్లు, మోటార్ సైకిళ్ళు మీరట్ సొంటి గంజ్ చోర్ బజార్ కి చేరుకుంటాయి కాబట్టే ఆసియాలోనే అతి పెద్ద ఆటో చోర్ బజార్ గా ప్రసిద్ధి చెందింది. మళ్ళీ అదే పాత కధ రిపీట్ అవుతుంది ఢిల్లీ వాహన స్వంతదారులకి. మేము మీరట్ వెళ్లి వెతికి తీసుకురావాలి అని చెప్పి స్వంతదారుడిని వేలు అడుగుతారు ఎటూ వాళ్ళు ఇవ్వరు. వీళ్ళు మీరట్ వెళ్లరు. అలా వాహనాల్ని ఏ పార్టుకి ఆ పార్టు పీకేసి విడిగా అమ్మేసుకుంటారు. నష్టపోయేది వాహన స్వంతదారుడు. ఆపై ఆ బండి దొరకట్లేదు అంటూ పోలీసులు ఇచ్చిన సర్టిఫికేట్ ని చూసి ఎంతో కొంత ముట్టచెప్పే ఇన్స్యూరెన్స్ కంపెనీలు… అదో వేల కోట్ల రూపాయల వ్యాపారం !

7. అధికారిక లెక్కల ప్రకారం 2020 లో చోరీకి గురయిన వాహనాల సంఖ్య 13,130… అదీ లాక్ డౌన్ అమలులో ఉన్నా కూడా జరిగినవి. వీటి రికవరీ శాతం వచ్చేసి 11.94% మాత్రమే. అంటే దాదాపుగా 10 వేల వాహానాల ఆచూకి తెలియలేదు. ఇవన్నీ ఏమయిపోయి ఉంటాయి ? భారత్ లోని 5 పెద్ద చోర్ బజార్లలో అమ్ముడుపోయాయి. వీటిలో ఖరీదు అయిన కార్లు, మోటార్ సైకిళ్ళు కూడా ఉన్నాయి. ఈ లెక్కలు అన్నీ 2020 ఆగస్ట్ నెల వరకే అంటే, ఆ తరువాత ఎన్ని చోరీకి గురయ్యాయో ?

8. ఇదంతా రాజకీయ పార్టీలు, ప్రభుత్వాల అండ లేకుండా జరిగే అవకాశం ఉంటుందా ? అస్సలు ఉండదు. బదులుగా ఎంతో కొంత లంచాలు ఇచ్చి, ఎన్నికలప్పుడు వోట్లు వేస్తారు. అసలు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఈ దొంగ వాహనాల వ్యాపారంలో వస్తుంది అనేది అధికారికంగా లెక్కలు లేవు ఇప్పటివరకు. ఏదన్నా లెక్క చెప్తే అవి కాకి లెక్కలు మాత్రమే.

9. అబ్బో, చాలా మంచి జరిగిపోతున్నది అంటూ సంతోషపడకండి. యోగి ఏదో రోజున మీరట్ సొంటిగంజ్ ని మూసేస్తాడని తెలుసు సదరు శాల్తీలకి ! కాబట్టి ముందస్తుగా మహారాష్ట్రలోని మరో కూటమి వీళ్ళకి ఒక దారి చూపెట్టింది ఆల్రెడీ!

10. ముంబైలోని CST రోడ్ లో, తలెజా దగ్గర దొంగ బండ్ల వ్యాపారం జోరు అందుకుంది గత సంవత్సరకాలంగా… అంటే ఇప్పుడు మీరట్ సొంటి గంజ్ వ్యాపారం అంటే దొంగ వ్యాపారం అంతా తలెజా, CST రోడ్ లోకి తరలి వెళ్ళిపోతుంది. అంచేత ఇక వాహన చోరీలు జరగవు, అలాగే దొంగ బండ్ల స్పేర్ పార్ట్స్ దొరకవు అని గ్యారంటీ లేదు. ఇంకా రెచ్చిపోయి జరిగిపోతుంది… కాకపొతే కావాల్సిన వాళ్ళు మీరట్ వెళ్ళకుండా ముంబై వెళతారు అంతే !

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions