బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది… అసలే బాలీవుడ్ మాఫియా మీద కంగనా విరుచుకుపడుతోంది కదా… రిపబ్లిక్ టీవీ తన దాడిని ఆపడం లేదు కదా… తాజాగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి రంగంలోకి దిగాడు… ఇలా కాదు గానీ… అసలు బాలీవుడ్‌నే యూపీకి తరలించుకుపోతాను అంటున్నాడు… అదుగో అప్పుడు ఉలిక్కిపడింది బాలీవుడ్… ఈ వుడ్డే కాదు, మహారాష్ట్ర అధికార పక్షాలు కూడా ఉలిక్కిపడ్డయ్… చివరకు ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే సైతం గొంతు సవరించుకోవాల్సి వచ్చింది… ఇంట్రస్టింగుగా అసలు ఏం జరుగుతున్నదంటే..?
మా రాష్ట్రంలో సినిమాలు తీయండి, రాయితీలు ఇస్తాం, తక్షణం అనుమతులు ఇచ్చేస్తాం, రెడ్ కార్పెట్ పరుస్తాం అని ప్రతి రాష్ట్రమూ చెబుతుంది… ఆల్రెడీ ఇండస్ట్రీ బలంగా ఉన్న రాష్ట్రాలు తమ నేల దాటిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటుంటాయి… ఇండస్ట్రీ ద్వారా ఏదో భారీ ఆదాయం వస్తుందని కాదు… కానీ ఎకనమిక్ యాక్టివిటీ పెరుగుతుంది… వినోదపరిశ్రమ… వేల మందికి ఉపాధి దొరుకుతుంది… హైదరాబాద్ నుంచి తెలుగు ఇండస్ట్రీ ఆంధ్రాకు తరలిపోవద్దని కేసీయార్ కూడా అప్పుడప్పుడూ వేల ఎకరాలిస్తా, ఫిలిమ్ సిటీ కట్టేసుకొండి, స్టూడియోలు కట్టుకొండి అని టాలీవుడ్ ప్రముఖులకు చెబుతుంటాడు… ఐనా హైదరాబాద్ విలాసాన్ని, వైభోగాన్ని అనుభవించిన సినిమా పెద్దలు అంత వీజీగా ఎటూ పోలేరు… అది వేరే సంగతి…
Ads
యోగి సెప్టెంబరులో ఒక ప్రకటన చేశాడు… గౌతమబుద్ధ నగర్లో 1000 ఎకరాలను కేటాయించాడు… అక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో ఫిలిమ్ సిటీ కట్టాలనేది ప్లాన్… ఆ తరువాత దర్శకులు సుభాష్ ఘయ్, ఓం రౌట్, రజినీకాంత్, ఆయన బిడ్డ సౌందర్య, సింగర్స్ కైలాష్, ఉదిత్ నారాయణ్ తదితరులు వెళ్లి యోగిని కలిశారు…
నిన్న షేర్ మార్కెట్ నుంచి 200 కోట్ల లక్నో మున్సిపాల్ కార్పొరేషన్ నిధుల సమీకరణ కోసం ముంబై వచ్చాడు యోగి… పనిలోపనిగా ఫిలిమ్ పర్సనాలిటీలతో కూడా భేటీలు వేశాడు… బీజేపీతో కాస్త రాసుకుని పూసుకుని తిరిగే అక్షయ్ కుమార్ తనను ఫస్ట్ కలవగా… తరువాత యోగి సుభాష్ ఘయ్, బోనీకపూర్, జతిన్ సేఠి, భూషణ్ కుమార్, రణదీప్ హుదా, జిమ్మీ షెర్గిల్, కోమల నహతా, రాజ్‌కుమార్ సంతోషి తదితరులతోనూ భేటీ వేశాడు… తన ఫిలిమ్ సిటీ గురించి డిస్కస్ చేశాడు…
అలాగని తను సినీ ప్రముఖులను కలవగానే బాలీవుడ్‌ను పెకిలించుకుపోతాడనేమీ కాదు… బాలీవుడ్ ముంబై వదలడం అంత వీజీ కాదు… కానీ యూపీలోనూ ఆ యాక్టివిటీ పెంచడం యోగి ఉద్దేశం… కానీ… నో, నో, బాలీవుడ్‌ను తరలించుకుపోవడం నీ తరం కాదు, నీ తల్లో జేజమ్మ తరం కూడా కాదు అంటూ ఎన్సీపీ యోగి బస చేసిన హోటల్ ఎదుట ఆందోళనలకు దిగింది… ఈ ప్రయత్నాలను ప్రభుత్వం ఎందుకు ఉపేక్షిస్తున్నదనీ ప్రశ్నించింది… దాంతో ఉద్దవ్ ఠాక్రే కూడా ‘ఇలాంటివి నేనొప్పుకోను, ఒక ఇండస్ట్రీని తరలించుకుపోతానంటే చూస్తూ ఊరుకుంటామా..?’ అన్నాడు…
ఇవన్నీ గమనించిన యోగి… ఒరే నాయనలారా..? మీ బాలీవుడ్ వస్తానంటే వెల్కమ్… కానీ నేనేమీ దాన్ని పెకిలించుకుపోను… కావాలని ఎవరినీ ప్రలోభపెట్టడం లేదు’ అని క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది… అవునూ, రాజధానితోపాటు విశాఖలో ఓ ఫిలిమ్ సిటీ కట్టే ఆలోచన ఏమైనా ఉందా జగన్ భయ్యా..? ఐనా నీకెందుకులే భయ్యా… మళ్లీ అదే రామోజీ, అదే నాగార్జున, అదే సురేష్, కాకపోతే అదే మెగా గ్రూపు…!!
Share this Article