ఆకలితో ఉన్నవాడి కడుపు నింపు… కడుపు గొట్టేవాడి తాట తీసెయ్………. ఇదే యోగిని ఓ చారిత్రిక విజయతీరాలకు చేర్చింది… ఇదే సత్యం… ఈ సోకాల్డ్ జర్నలిస్టుల సుదీర్ఘ, నిరర్థక విశ్లేషణలు, మన్నూమశానం వదిలేయండి… ఫీల్డులో బాగా తిరిగి, జనాభిప్రాయం సరిగ్గా తెలుసుకున్న మన హైదరాబాదీ జర్నలిస్టులు కూడా చెప్పింది ఇదే… ‘‘బాబా ఔర్ మోడీ’’… అంటే యోగి పాలన, మోడీ పట్ల జనాదరణ, ప్రత్యేకించి మహిళల వోట్లు బీజేపీని పైకి లేపాయి, అఖిలేష్‌ను తొక్కేశాయి…
దేశ రాజకీయాల్లో ఎప్పుడూ ప్రధానపాత్ర పోషించే ఉత్తరప్రదేశంలో దారిద్ర్యం ఎక్కువ… దానికితోడు ఈసారి కరోనా… చిన్నాచితకా కొలువులు లక్షల్లో ఎగిరిపోయాయి… వలస కూలీలు ఎక్కడెక్కడి నుంచో తిరిగి సొంతూళ్లు చేరారు… బతుకుబండి లాగడమే కష్టమైన నేపథ్యంలో యోగి సర్కారు గోధుమలు, వంటనూనెలు, శెనిగెలు ఉచితంగా, విస్తృతంగా పంపిణీ చేసింది… అది కడుపు నింపడం…
అఖిలేష్ పార్టీ పాలన ఓ గూండారాజ్… అరాచకం… యాంటీ బీజేపీ పార్టీలన్నీ సమాజ్‌వాదీకి మద్దతు ప్రకటించి, తమ ఇజ్జత్ పోగొట్టుకున్నయ్… టీఆర్ఎస్ సహా..! ఇప్పటికి దేశచరిత్రలో ఏ ముఖ్యమంత్రికీ చేతకాని రీతిలో… చివరకు నియంతగా పరిపాలించిన ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కాలంలో కూడా ఇంతగా ఎన్‌కౌంటర్లు లేవు… అరెస్టులు లేవు… బయట ఉంటే చస్తవ్, జైలుకు వెళ్లు… క్రిమినల్స్‌కు ఇదే సూత్రం… ప్రత్యేకించి ముస్లిం-యాదవ్ దాష్టీకాలు- సమాజ్‌వాదీ పార్టీ మద్దతు… ఆ కడుపులు గొట్టే బ్యాచ్ పనిపట్టడమే యోగి పాపులారిటీకి మరో కారణం…
Ads
నో డౌట్… భద్రత మీద విశ్వాసం ఉన్నప్పుడు ఫస్ట్ ఆనందపడేది, అభిమానించేది మహిళలే… ‘‘బేటీ ఔర్ బెహన్ సురక్షిత్ హై’’… అందుకే ఈ విజయం… రేషన్-ప్రశాసన్ ముందు మిగతా రాజకీయ అంశాలు, రాద్ధాంతాలు ఏమీ నిలవలేదు… రైతు ఉద్యమం కేవలం రాజకీయ ప్రేరితమే అని ప్రజలు నిరూపించారు… యాంటీ బీజేపీ జర్నలిస్టులు, నాయకులు, ఖలిస్థానీవాదులు సృష్టించిన ఒక మాయపొరను సగటు రైతులు, సామాన్య ప్రజలే బద్దలు కొట్టేశారు… లఖింపూర్ సహా పశ్చిమ యూపీలో బీజేపీ ఆధిక్యం చెబుతున్నది కూడా అదే…
ఈ యాంటీ బీజేపీ వర్గాల ప్రచారం చివరకు ఏ స్థాయికి వెళ్లిందంటే… ఓ దశలో మోడీ షాలు యోగిని పీకిపారేయాలని అనుకున్నారు… ఉత్తరాఖండ్‌లో మార్చినట్టుగా సీఎం పదవితో ప్రయోగాలకు సిద్ధపడ్డారు… (గతంలో కాంగ్రెస్‌లో ఈ చెడపోకడ కనిపించేది… ఎడాపెడా సీఎంలను మార్చేయడం అనేది…) కానీ యోగి తుపాకీకి బెదురు తక్కువ… అది పెద్ద ముదురు… అది తపంచా కాదు, లైట్ మెషిన్ గన్… అది బీజేపీలో కూడా విధేయంగా, అణకువగా, ఒద్దికగా ఒదిగిపోయే రకం కాదు… అది మోడీకి కూడా తెలుసు… చివరకు హైకమాండే రాజీపడింది… యోగి మార్క్ రాజకీయం అది…
యోగి పాలన సూపర్బ్ అని సర్టిఫికెట్ ఇవ్వాల్సిన పనేమీ లేదు… కానీ తను ఎగిరెగిరి పడే ప్రతి పొలిటికల్, క్రిమినల్ తోకనూ కత్తిరించాడు… అసలు యూపీ రాజకీయాలతో సంబంధం లేని ప్రాంతీయ పార్టీలు యాంటీ బీజేపీ ధోరణితో ఏవేవో విమర్శలు చేస్తున్నా… యూపీలో ఎస్పీకి మద్దతు పలుకుతున్నా… లైట్ తీసుకున్నాడు… గెలుపో, ఓటమో జానేదేవ్… ఏ దశలోనూ తన ధోరణి నుంచి తప్పుకోలేదు… ‘‘బుల్‌డోజర్ల’’ భాషే దానికి పక్కా నిదర్శనం… మిగతా నాలుగు రాష్ట్రాలనూ కాసేపు వదిలేయండి… యూపీ సీట్లలో ఆ నాలుగు రాష్ట్రాల సీట్లు మొత్తం కలిపి సగం… యూపీ రాజకీయాలు దేశం దశను నిర్దేశిస్తుంటయ్… యోగికి కూడా ఏదో భవిష్యత్తు కర్తవ్యపాలనను, దిశను సూచిస్తున్నది ఈ గెలుపు… అది హస్తిన వైపే కావచ్చు కూడా…!!
Share this Article