Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆరోజున ఆ ముప్పు నుంచి లక్కీగా ఎలా తప్పించుకున్నామంటే..!!

June 5, 2025 by M S R

.

కార్యకారణ సంబంధం… ఎక్కడో ఓ గడ్డిపోచ ఇటు నుంచి అటు పడిపోయిందంటే దానికీ ఓ కారణం ఉంటుంది, ఎక్కడో ఏదో ప్రభావం ఉండి ఉండవచ్చు… లేదా ప్రభావం వల్ల కావచ్చు… దేన్నీ తేలికగా తీసుకోవద్దు…

సెప్టెంబరు 11… అమెరికాను కుదిపేసిన జంట టవర్ల ధ్వంసం సంఘటన అందరికీ తెలిసిందే… ఆ చేదు అనుభవాల నుంచి, భయాల నుంచి కాస్త తేరుకున్నాక, గతంలో ఆ టవర్లలో ఓ పెద్ద ఆఫీసు నడిపించిన కంపెనీ ఏం చేసిందంటే… ఆ విలయం రోజు ఆఫీసుకు ఆ సమయానికి రాకుండా మరణం నుంచి తప్పించుకున్నవారితో ఓ భేటీ ఏర్పాటు చేసింది…

Ads

మీ ఫీలింగ్స్ షేర్ చేసుకొండి అనడిగారు… ఇప్పటికీ ఆ సంఘటన తలుచుకుంటేనే వణికిపోయే చాలామంది ఆరోజున తాము ఆ ముప్పు నుంచి తప్పించుకున్నందుకు చిన్న చిన్న కారణాలు చెప్పారు… అవి ఎలాంటివంటే..?

మా అబ్బాయి ఫస్ట్ స్కూల్ డే, అందుకని ఆరోజు ఆఫీసుకు ఆ టైంకు రాలేదు అన్నాడు ఆ కంపెనీ డైరెక్టర్ ఒకాయన ఎప్పుడూ సరిగ్గా పనిచేసే అలారం పీస్, ఆరోజు పొద్దున మాత్రం పనిచేయలేదు, సమయానికి నిద్రలేవలేదు, లేటైపోయి, ఆగిపోయాను అని చెప్పింది ఓ లేడీ ఎగ్జిక్యూటివ్

కారులో ఆఫీసుకు వస్తుంటే మధ్యలో అనుకోకుండా ఓ చిన్న యాక్సిడెంట్ ఎదురైంది, దాంతో చాలాసేపు అక్కడే స్టకయిపోయాను అన్నాడు ఓ ఉద్యోగి

కాస్త లేటవడంతో ఒకాయనకు ఆఫీసు బస్సు మిస్సయింది
వస్తుంటే మధ్యలో ఫుడ్ పాకెట్ లీకై బట్టలు పాడయ్యాయి, ఇక వెనక్కి వెళ్లిపోయానన్నాడు మరొకాయన
సరిగ్గా ఆరోజే కారు ట్రబులిచ్చింది, ఎంతకూ స్టార్ట్ కాలేదు, సర్వీసింగుకు ఇచ్చేసరికి లేటై, రాలేకపోయాను అన్నాడు ఇంకొకాయన

మరొకరి భార్యకు ఆరోజే డెలివరీ అయ్యింది, అబ్బాయి పుట్టాడు
ఒకాయనకు ఎంతసేపటికీ టాక్సీ దొరకలేదు, ఈరోజు ఆఫీసుకు ఏం వెళ్తానులే అనుకుని ఇంట్లోకి వాపస్ వెళ్లిపోయాడు

ఒక ఉద్యోగి చెప్పిన కారణం మరీ స్ట్రేంజ్… తను కొత్తగా బూట్లు కొనుక్కున్నాడు, అవి కరుస్తున్నయ్… పాదానికి బొబ్బ వచ్చింది… దాంతో ఓ ఫార్మసీ షాపు దగ్గర ఓ బ్యాండ్ ఎయిడ్ కొనడానికి ఆగాడు, ఈలోపు ఆ సంఘటన జరిగిపోయింది…

ఓ మహిళ హడావుడిగా చేరేసరికి ఎలివేటర్లు పైకి వెళ్తున్నాయి, వెయిట్ చేయసాగింది, ఈలోపు భారీ చప్పుళ్లు, దాంతో బయటికి పరుగు తీసింది… ఇలా ఎన్నో చిన్న చిన్న కారణాలు, వాళ్లను ముప్పు నుంచి కాపాడాయి… అంటే ఏమిటి అర్థం..? వాళ్ల డెస్టినీ వాళ్లను ఆరోజు ఆఫీసుకు ఆ సమయానికి చేరకుండా ఆపింది…

పహల్‌గాం ఉగ్రఘాతుకం నుంచి తప్పించుకున్నవాళ్లకూ ఇలాంటి కారణాలు బోలెడు ఉండే ఉంటాయి కదా… ముప్పు తప్పించుకునే రాత ఉంది కాబట్టే అలాంటి కారణాలూ, అనుకోని కారణాలూ అడ్డుపడ్డయ్…

ఇది ఇప్పుడు ఎందుకు చెప్పుకోవడం అంటే… కారు తాళపు చెవులు కనిపించడం లేదనీ, పిల్లలు సమయానికి డ్రెస్సులు వేసుకోలేదనీ, కారు స్టార్ట్ కావడం లేదనీ, ట్రాఫిక్ ఎర్ర లైట్లు ఎక్కువ సేపు వెలుగుతూనే ఉన్నాయనీ… ఇలా చిన్న చిన్న కారణాలకూ విసుక్కుని, బీపీ పెంచుకుని, ఆవేశపడిపోయి, ఆ కోపాన్ని ఇంకెవరి మీదో ప్రదర్శించకండి…

ఏమో, వాటికీ ఏదో రీజనింగ్ ఉండే ఉంటుంది… అందులో మిమ్మల్ని కాపాడే అదృష్టం ఏదో దాగుండి ఉండవచ్చు కూడా… అందుకే ఊరకే ఫ్రస్ట్రేట్ కావద్దు… జరిగేది ఆగదు, జరగాల్సిన దాన్ని ఏదీ ఆపదు, జరగొద్దు అని రాసి ఉంటే ఏదో ఒకటి ఆపేస్తుంది…

పైన అనుభవాలు చదివారు కదా… అంతే… మరి ఆరోజున సాగిన విధ్వంసం మాటేమిటి అంటారా..? ఆ తరువాతే కదా అంతర్జాతీయ రాజకీయాల్లో దేశాల ప్రయారిటీలు, బంధాలు, కొత్త స్నేహాలు, నమ్మకాలు ఒక్కసారిగా మారిపోయాయ్… ప్రభావం ఉండకపోయే చాన్సే లేదు…

.

(బహుశా చాలామంది దీన్ని చాలాసార్లు ఇంగ్లిషులో చదివే ఉంటారు… సోషల్ మీడియాలో కనిపించిన ఈ పోస్టును ఓసారి తెలుగులో మన పాఠకులతో ఓసారి చెప్పుదామని ఈ ప్రయత్నం… నిజంగా అంత భావగర్భితంగా చెప్పలేకపోవచ్చు… కానీ అర్థం చేసుకునేవాడికి ఇది చాలు…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అవును… అందరూ పేదలే… రేవంత్, బాబు, మోడీ మినహా..!!
  • అధికారానికి మాత్రం మేం… పోరాటాలకు, కేసులకు బడుగులు…
  • కృష్ణ గారడీ ఏమీ లేదు… అంతా పక్కా టైం పాస్ పల్లీబఠానీ…
  • రోడ్ల గుంతలా మజాకా… పెద్ద పెద్ద కంపెనీల్నే తరిమేస్తున్నయ్…
  • సేమ స్టోరీ… సేమ్ ప్రచారం… సేమ్, అప్పట్లో శ్రీదేవి… ఇప్పుడు దీపిక…
  • గెలిచానని నవ్వనా… ఏడ్వనా… మనసా కవ్వించకే నన్నిలా..!
  • ఫాఫం నాగార్జున..! బిగ్‌బాస్ లాంచింగ్ షో రేటింగుల్లో బిగ్గర్ ఫ్లాప్..!!
  • ట్రంపుడి సుంకదాడికి విరుగుడు ఉంది… మోడీయే గుర్తించడం లేదు…
  • రెండూ ప్రభాస్ సినిమాలే… రెండూ కీలకపాత్రలే… రెండింటి నుంచీ ఔట్..!!
  • డియర్ రేవంత్‌రెడ్డి సార్… మీరు ఇంకాస్త బాదండి సర్, పర్లేదు..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions