Murali Buddha….. నువ్వు రామోజీ ఉద్యోగివి రామోజీవి కాదు … టీడీపీ బీట్‌లో చాలా మంది కొత్త జర్నలిస్టులు పరిచయం అయ్యేవారు . పరిచయాలు అయ్యాక … నువ్వు రామోజీరావు సంస్థ లో ఉద్యోగివి అంతే కానీ రామోజీ సంస్థ నీది కాదు … అని జ్ఞాన బోధ చేసే వాడిని …జీవిత సారం బోధ పడే వరకు కొత్త కుర్రాళ్ళు కొంత మంది చిన్న రామోజీ లా ఫీల్ అయ్యే వారు …. ఇలాంటి వారిని ఏదో ఓ శుభ ముహూర్తం లో బయటకు పంపితే నీళ్ల నుంచి బయట పడ్డ చేప పిల్లల్లా విల విలలాడే వారు …
….
ప్రపంచవ్యాప్తంగా సర్వే జరిపితే గూగుల్ సంస్థ నంబర్ వన్ గా నిలిచింది … ఉద్యోగులకు అద్భుతమైన సౌకర్యాలు కల్పించడంలో ఉద్యోగులను బాగా చూసుకోవడంలో ప్రపంచంలో గూగుల్ నంబర్ వన్ అని అనేకసార్లు వార్తల్లో చూశాం … అలాంటి గూగుల్ లో పన్నెండు వేల మందిని ఒకే సారి ఉద్యోగం లోంచి తీసేశారు … ‘‘12 ఏళ్ల నుంచి గూగుల్ లో ఉద్యోగం, తెల్లవారు జాము మూడుగంటలు లాప్ టాప్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే … నన్ను ఉద్యోగం నుంచి తీసేశారు అని తెలిసింది … ఇదొక కథ… తను గర్భిణీ, భర్త లేడు, పిల్లల బాధ్యత తనదే, ఉద్యోగం పోయింది .. ఇది మరో కథ… ఇలా 12 వేల మందివి పన్నెండు వేల బాధాకరమైన కథలు.
Ads
….
మానవులను కరుణించి మనిషి రూపంలో వచ్చిన దేవుడు రామోజీ అని కొందరి భక్తి కావచ్చు … కొందరికి విలన్ కావచ్చు … రామోజీ ఐనా జగన్ సాక్షి ఐనా గూగుల్ ఐనా వ్యాపారం లాభం కోసం ప్రారంభిస్తారు … లాభం తగ్గింది అంటే నిర్ధాక్షిణ్యంగా రోడ్డున పడేస్తారు … నీ పిల్లల చదువు, వృద్ధులైన తల్లిదండ్రుల బాధ్యత, నీ కుటుంబ కష్టాలు నీవే కానీ నీకు ఉద్యోగం ఇచ్చిన వారివి కాదు … నీ కష్టాలు ఆలోచిస్తే వారి బుర్ర పని చేయదు …
నీ కష్టాలు నీ సుఖాలు నీ కుటుంబం మాత్రమే నీది … నీ యజమాని సంపద నీది కాదు … అందుకే నిన్ను నువ్వు బుల్లి రామోజీ, జగన్, రాధాకృష్ణ, సంఘీ అనే భ్రమలు ఎంత త్వరగా వదిలితే అంత మంచిది ….. నీ కన్నా నీ యజమాని గురించి ఎక్కువ ఆలోచించడం ఆరోగ్యానికి మంచిది కాదు…. (ఎప్పుడూ ప్లాన్ బి, ప్లాన్ సి అవసరం)…
Share this Article