ఈటీవీ వాళ్ల జబర్దస్త్ షోకు ఎలాంటి పేరు ఉందో అందరికీ తెలుసు కదా… ఆ దుర్వాసనల నడుమ ఓ మట్టి పరిమళం… దాని పేరు రాకింగ్ రాకేష్… అసలు తెలుగు టీవీ కామెడీ అంటేనే అక్రమ సంబంధాలు, పక్కింటి యవ్వారాలు, లేచిపోవడాలు, శృంగార బాగోతాలు, ఫస్ట్ నైట్ ముచ్చట్లు, లైనేసే సంగతులు… మెజారిటీ… అసలు జబర్దస్తే ఆ బాపతు అనుకుంటే జీతెలుగులో వచ్చే దీని కాపీ ప్రోగ్రాం బొమ్మ అదిరింది మరీ నేలబారు… సరే, ఈటీవీ జబర్దస్త్ విషయానికి, అందులోనూ రాకేష్ వరకు వస్తే… ఈ కామెడీ పోకడలకు కొంత భిన్నంగా చెప్పుకోవాలి… వినోదంతోపాటు కాస్త విభిన్నం… అంతే ప్రత్యేకత…
కళల పుట్టిల్లు వరంగల్ తనది… జబర్దస్త్‌లో ఏదో ఓ టీం మెంబర్‌గా స్టార్ట్ చేశాడు… తరువాత టీం లీడర్ అయ్యాడు… మల్లెమాల వాళ్ల టేస్టులో ఇమడలేదు… తను ప్రత్యేకంగా, విభిన్నంగా స్కిట్లు రాసుకుంటాడు… మొదట్లో పిల్లలతో కలిసి చేసేవాడు… ఇప్పుడు అందరితోనూ చేస్తున్నాడు… ఇప్పుడు చెప్పుకునేది ఏమిటంటే..?
Ads
(ఫోటో సౌజన్యం :: ఈటీవీ జబర్దస్త్ షో తాజా ప్రొమో)
ఢిల్లీలో లక్షల మంది రైతులు ఆందోళనలు చేస్తున్నారు కదా… దేశమంతా వాళ్లకు కొంత సంఘీభావం కనిపిస్తోంది… సరే, ఆ రైతుల వెనుక ఉన్న పార్టీలు ఏమిటో, వాటి అసలు ఉద్దేశాలేమిటో కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నా సరే… దేశంలో రైతు సుఖంగా లేడనేది కఠిన వాస్తవం… ఏటా వేల ఆత్మహత్యలే రుజువులు… ఈ స్థితిలో ఈ వర్షాలు, ఈ నష్టాలతో రైతు గుండె ఎలా పగిలిపోతుందో తన తాజా స్కిట్లో టచ్ చేశాడు రాకేష్…
ప్రొమోలోనే అంత బాగా వచ్చిందంటే, వచ్చే నాలుగున అది ఫుల్ స్కిట్‌గా మరింత బలంగా ప్రదర్శితం కావచ్చు… ఎస్, రాకేష్ తన యూనిక్‌నెస్ ఇలాగే కాపాడుకోవాలి… నిజానికి తను ఎప్పుడూ అంతే… ఏదో కాస్త భిన్నత్వాన్ని ప్రదర్శిస్తాడు… అసలు ఈ వినోద కార్యక్రమంలో ఈ సందేశాల కథలేమిటి అనే ఓ చిన్న విమర్శ వస్తే రావచ్చుగాక… కానీ అది తప్పేమీ కాదు… నాలుగు వినోదాల స్కిట్ల నడుమ ఓ విషాదాన్ని చూపిస్తే… అది బలంగానే ఎక్కుతుంది… సొసైటీలో అనేక ఇష్యూలున్నయ్… కాస్త వినోదాన్ని మేళవిస్తూనే, ఎక్స్పోజ్ చేయడానికి ప్రయత్నిస్తే అది మంచి టేస్టే…
ఎటొచ్చీ రాకేష్‌ను ఈ ప్రోగ్రాం ఆర్గనైజర్లు మిగతా రొటీన్ ఫార్ములా కామెడీ వైపు నెట్టేయకుండా ఉంటేనే, తను మరింతగా తన కలానికి, తన నటనకు పదును పెట్టుకోగలడు… కీపిటప్ రాకేష్… పడీ పడీ నవ్వినప్పుడు కూడా కన్నీళ్లొస్తాయి… వాటి నడుమ ఒక్క నిజమైన విషాదాశ్రువును రప్పించగలిగితే అది గొప్ప కామెడీ… దీని సారాంశం ఏమిటో చాలామందికి అర్థం కాదు… కానీ, రాకేష్‌కు అర్థమవుతుంది…!!
Share this Article