.
యూట్యూబ్…. వీడియోలు, షార్ట్ వీడియోల ద్వారా ఇండియాలో ఉపాధి పొందుతున్నవారి సంఖ్య దాదాపు 10 లక్లలు… నిజం… గత సంవత్సరం ఏకంగా 21 వేల కోట్లను యూట్యూబ్ చెల్లించింది ఇండియన్ క్రియేటర్లకు…
జనం అడిక్షన్ కనిపిస్తోంది… ఎప్పుడైతే మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ చౌకగా అందుబాటులోకి వచ్చిందో ఇక వీడియోల దూకుడు మొదలైంది… ఇది ఇంకా పెరగబోతోంది… 2021లో 10 వేల కోట్లను సంపాదించిన మన క్రియేటర్లు ఇప్పుడు 21 వేల కోట్లకు మించి గడించారు…
Ads
ఇవేమీ ఉజ్జాయింపు అంచనాలు, లెక్కలు కావు… యూట్యూబ్ సీఈఓ నీల్ మోహన్ ముంబైలో జరిగిన వరల్డ్ ఆడియో విజువల్ & ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (WAVES 2025)లో చెప్పినవే… భారతదేశపు క్రియేటర్ ఎకానమీ (Creator Economy) గురించి పలు కీలక విషయాలను వెల్లడించాడు తను…
- ‘క్రియేటర్ నేషన్’గా భారతదేశం: నీల్ మోహన్ భారతదేశాన్ని వేగంగా అభివృద్ధి చెందుతున్న “క్రియేటర్ నేషన్” (Creator Nation) గా అభివర్ణించాడు…
- ₹850 కోట్లు పెట్టుబడి: భారతదేశంలోని క్రియేటర్ ఎకానమీని మరింత వృద్ధి చేయడానికి యూట్యూబ్ తరుపున రాబోయే రెండేళ్లలో ₹850 కోట్లకు పైగా అదనపు పెట్టుబడిని పెట్టనున్నట్లు ఆయన ప్రకటించాడు… ఈ పెట్టుబడి నైపుణ్యాన్ని పెంచడం, సృజనాత్మకతకు మద్దతు ఇవ్వడం, భారతీయ క్రియేటర్లు ప్రపంచ ప్రేక్షకులకు చేరుకోవడానికి సహాయపడటం వంటి వాటిపై దృష్టి సారిస్తుంది…
ఇంకా ఆశ్చర్యకరమైన గణాంకాలు ఏమిటంటే..?
100 మిలియన్ ఛానెల్స్: గత సంవత్సరంలో భారతదేశం నుండి 100 మిలియన్లకు పైగా యూట్యూబ్ ఛానెల్స్ కంటెంట్‌ను అప్‌లోడ్ చేశాయి…
– మిలియన్ సబ్‌స్క్రైబర్లు: భారతదేశంలో 15,000 కు పైగా యూట్యూబ్ ఛానెల్‌లు ఒక మిలియన్ (10 లక్షలు) సబ్‌స్క్రైబర్ల మైలురాయిని అధిగమించాయి…
భారతీయ కంటెంట్‌కు ప్రపంచ గుర్తింపు: అంతర్జాతీయ ప్రేక్షకులు గత సంవత్సరంలో భారతీయ క్రియేటర్ల కంటెంట్‌ను 45 బిలియన్ గంటలకు పైగా వీక్షించారు, ఇది భారతీయ కంటెంట్ ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రభావం చూపుతుందో తెలియజేస్తుంది…
ప్రధానమంత్రి మోదీ రికార్డు: ప్రపంచంలోనే అత్యధికంగా సబ్‌స్క్రైబర్‌లు ఉన్న ప్రభుత్వ అధినేతగా భారత ప్రధాని నరేంద్ర మోదీ (25 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్‌లు) ఉన్నారని ఆయన ప్రస్తావించాడు…
కానీ… యూట్యూబ్ మైనస్ పాయింట్లపై కనీస ప్రస్తావన లేదు… అభ్యంతరకరమైన వీడియోలు, వాటి నిరోధం, చానెళ్ల రద్దు, ప్రక్షాళన వంటి కీలక పాయింట్లను అసలు ఎత్తుకోలేదు తను… అభ్యంతరకరమైన కంటెంట్ (Objectionable Content) లేదా కంటెంట్ మోడరేషన్ (Content Moderation) వంటి సున్నితమైన అంశాల గురించి చెప్పాల్సి ఉంది…
సాధారణంగా యూట్యూబ్ సీఈఓలు తమ ప్లాట్‌ఫారమ్ పరిశుభ్రత (Hygiene), ప్రామాణికత (Authenticity) ను నిర్వహించడం గురించి మాట్లాడుతుంటారు గానీ వాటిని దెబ్బతీసే అంశాల గురించి అస్సలు మాట్లాడరు…
యూట్యూబ్ ఎకోసిస్టమ్ భారతదేశంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 7.5 లక్షల (7,50,000) పూర్తికాలపు ఉద్యోగాలకు మద్దతు ఇస్తున్నట్లుగా అంచనా ఉంది… ఇది 2021 నాటి అంచనా… ఈ సంఖ్యను ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ (Oxford Economics) సంస్థ చేసిన విశ్లేషణ ఆధారంగా రూపొందించిన యూట్యూబ్ ఇంపాక్ట్ రిపోర్ట్ 2021 (YouTube Impact Report 2021) వెల్లడించింది…
ఈ ఉపాధి క్రియేటర్‌లు, వారి వీడియోల నిర్మాణ బృందాలు (ఎడిటర్లు, కెమెరామెన్‌లు), ఇతర అనుబంధ వ్యాపారాలు (లైటింగ్, స్టూడియోలు, మేనేజ్‌మెంట్), యూట్యూబ్ చుట్టూ ఉన్న విస్తృత సేవలను (ప్రత్యక్ష, పరోక్ష, ప్రేరిత, ఉత్ప్రేరక ప్రభావాల ద్వారా) కలిగి ఉంటుంది…
- వివిధ నివేదికలు, అంచనాల ప్రకారం, భారతదేశంలో అత్యధిక నికర విలువ (Net Worth) కలిగిన టాప్ 10 యూట్యూబ్ క్రియేటర్ల జాబితా ఉజ్జాయింపుగా ఈ విధంగా ఉంది….
(ఈ జాబితా క్రియేటర్ల నికర విలువ (Net Worth) అంచనాపై ఆధారపడి ఉంటుంది. ఇందులో యూట్యూబ్ ఆదాయంతో పాటు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, స్పాన్సర్‌షిప్‌లు, వ్యాపారాలు మరియు ఇతర ఆదాయ వనరులు కూడా కలిసి ఉంటాయి.
ర్యాంక్, యూట్యూబర్, ముఖ్య ఛానెల్ పేరు, కంటెంట్ రకం, నికర విలువ ( INR)…
1 తన్మయ్ భట్ (Tanmay Bhat) Tanmay Bhat స్టాండప్ కామెడీ, గేమింగ్, ఫైనాన్స్ ₹665 కోట్లు (అత్యధిక అంచనా)
2 గౌరవ్ చౌదరి (Gaurav Chaudhary) Technical Guruji టెక్నాలజీ, రివ్యూలు ₹356 కోట్లు
3 సమయ్ రైనా (Samay Raina) Samay Raina స్టాండప్ కామెడీ, గేమింగ్ ₹140 కోట్లు
4 అజేయ్ నగర్ (Ajey Nagar) CarryMinati రోస్టింగ్, కామెడీ, గేమింగ్ ₹131 కోట్లు
5 భువన్ బామ్ (Bhuvan Bam) BB Ki Vines కామెడీ స్కెచ్‌లు, మ్యూజిక్ ₹122 కోట్లు
6 అమిత్ భడానా (Amit Bhadana) Amit Bhadana కామెడీ స్కెచ్‌లు ₹80 కోట్లు
7 ట్రిగ్గర్డ్ ఇన్‌సాన్ (Triggered Insaan – Nischay Malhan) Triggered Insaan రియాక్షన్, కామెడీ, గేమింగ్ ₹65 కోట్లు
8 ధృవ్ రాఠీ (Dhruv Rathee) Dhruv Rathee కరెంట్ అఫైర్స్, విద్య ₹60 కోట్లు
9 రణ్‌వీర్ అల్లాబాడియా (Ranveer Allahbadia) BeerBiceps / The Ranveer Show ఫిట్‌నెస్, లైఫ్‌స్టైల్, ఇంటర్వ్యూలు ₹58 కోట్లు
10 సౌరవ్ జోషి (Sourav Joshi) Sourav Joshi Vlogs డైలీ వ్లాగ్స్ ₹50 కోట్లు…
వందల యూట్యూబ్ చానెళ్లను స్టార్ట్ చేసిన మన తెలుగు వాళ్లు కొందరు కోట్లకుకోట్లు గడిస్తున్న తీరు చూసి, మెయిన్ స్ట్రీమ్ శాటిలైట్ చానెళ్ల యజమానులే కుళ్లుకుంటున్న తీరు చూస్తూనే ఉన్నాం కదా… కానీ వాటిల్లో అభ్యంతరకరమైన కంటెంట్ మాటేమిటి..? ఇదే కీలక ప్రశ్న..!!
Share this Article