.
John Kora
YouTube కొత్త పాలసీ గురించి ఒక మిత్రుడు కాల్ చేసి పలు విషయాలు వివరించాడు. అతను చాలా ఏండ్ల నుంచి యూట్యూబ్ ఛానల్స్ విజయవంతంగా నడుపుతున్నాడు. ప్రస్తుతం 12 channels అతని చేతిలో ఉన్నాయి.
ఇవి కాక ఎన్నో ఛానల్స్ స్టార్ట్ చేసి మానిటైజ్ అయిన తర్వాత అమ్మేశాడు. ఇలా యూట్యూబ్ గురించి ఎంతో అనుభవం ఉన్న ఆ మిత్రుడు పలు విషయాలపై అనుమానాలు తీర్చాడు.
Ads
1. యూట్యూబ్ గత కొన్ని నెలలుగా మానిటైజేషన్, కంటెంట్ విషయంలో ఎన్నో కొత్త కండిషన్స్ అమలు చేస్తోంది. ఆ నిబంధనలనే తాజాగా కొత్త పాలసీ అంటూ అధికారికంగా ప్రకటించింది. కొత్త పాలసీలోని 80% కండిషన్స్ ఆల్రెడీ అమలులో ఉన్నాయి.
2. రిపీటెడ్ కంటెంట్‌కు ఆల్రెడీ మానిటైజేషన్ ఆపేశాడు.
3. పాత కంటెంట్‌ను గ్రేడ్లుగా విభజించి.. దాని ప్రకారమే మానిటైజ్ చేస్తున్నాడు.
3. ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ స్థాయి పిక్చర్ క్వాలిటీ ఇవ్వాలనేది YT లక్ష్యం. అందుకే హై క్వాలిటీ, ఒరిజినల్ కంటెంట్‌కు ప్రాధాన్యత ఇవ్వనున్నాడు.
4. ఐదు, పది నిమిషాల వీడియోల కంటే నిడివి ఎక్కువ ఉన్న వీడియోలకు అధిక రెవెన్యూ ఇస్తాడు.
5. సౌండ్, వీడియో క్వాలిటీతో పాటు.. ఎడిటింగ్, లైటింగ్, బీజీఎం.. ఇలా ప్రతీ విషయాన్ని యూట్యూబ్ ఏఐ టూల్స్ గమనిస్తూ ఉన్నాయి.
6. న్యూస్ కేటగిరీ కింద ఛానల్‌ను రిజిస్టర్ చేసి, ఇంత మంది యాంకర్లు, వాయిస్ వోవర్ ఆర్టిస్టులు ఉన్నారని ముందుగా చెప్తే.. కొన్ని రిపీటెడ్ క్లిప్స్‌కి కూడా మానిటైజేషన్ ఆపడు.
7. మన వీడియోలను వ్యూయర్ నాలుగైదు నిమిషాలకే పదే పదే స్కిప్ చేస్తుంటే.. మనకు రెవెన్యూను తగ్గించి.. కొన్నాళ్లకు లోగ్రేడ్‌లోకి చానల్‌ను నెట్టేస్తాడు.
8. కొత్త వాళ్లు వినూత్నంగా ఆలోచించి మంచి కంటెంట్ ఇస్తే తప్పకుండా నిలదొక్కుకోవచ్చు.
9. అయితే.. గతంలో మాదిరిగా యూట్యూబ్ ఆదాయాన్నే నమ్ముకొని ఖర్చు పెట్టడం వేస్ట్. క్రమక్రమంగా యూట్యూబ్ పార్ట్‌నర్‌షిప్ ప్రోగ్రామ్‌ను మరింత కఠినంగా మార్చబోతున్నాడు. రాబోయే రోజుల్లో యూట్యూబ్ చానల్స్ నిర్వహిస్తున్నందుకు యూజర్ చార్జీలు వసూలు చేసినా ఆశ్చర్యం లేదు.
చివరిగా ఏమన్నాడంటే.. ఒక చిన్న కార్పొరేట్ కంపెనీగానో, నలుగురైదుగురు ఫ్రెండ్స్ కలిసి నిర్వహిస్తే ఓకే.. అంతే కానీ సింగిల్ సింతకాయలా అంతా తానై నిర్వహిస్తానంటే మాత్రం.. నెత్తిమీద వైట్ క్లాత్ వేసుకోవడమే! #భాయ్‌జాన్
Share this Article