.
Nallamothu Sridhar Rao …….. మీకు తెలుసా.. యూట్యూబ్ తెలుగు న్యూస్ ఛానెళ్లకి వార్నింగ్ పంపించింది! ఇక చెత్త కంటెంట్ చేసే వారికి చుక్కలే!
ఒక న్యూస్ ఛానెల్‌లో ఇంటర్నెట్ విభాగంలో కీలక స్థానంలో ఉన్న ఓ సోదరునితో ఈరోజు మాట్లాడాను. మన ఛానెల్ వైరల్‌గా వెళ్లడం గురించి అతను ఆనందం వ్యక్తం చేశారు. తెలుగు వాళ్లకి మరో గుడ్ న్యూస్ చెప్పాడు.
Ads
తెలుగులో ఉన్న అన్ని న్యూస్ ఛానెల్స్ రీచ్‌ని ఇటీవల యూట్యూబ్ విపరీతంగా తగ్గించేసింది. షాకింగ్ అంటూ చెత్త టైటిల్స్ పెట్టి థంబ్ నెయిల్స్ పెట్టే వాటికి ఈ క్రింది సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.
“క్వాలిటీ కంటెంట్ అందించే ఇండివిడ్యువల్ క్రియేటర్స్ కి యూట్యూబ్ ప్రాముఖ్యత ఇవ్వబోతోంది, మీరు సరైన సమయంలో వచ్చారు అన్నా” అంటూ ఆ సోదరుడు తెలియజేశారు. ఇప్పటికే వేలాది చెత్త వీడియోలు చేసిన న్యూస్ ఛానెల్స్, యూట్యూబ్ ఛానెల్స్ clickbaitలుగా ఉన్న వేలాది వీడియోలు తొలగించమని యూట్యూబ్ కోరింది. ఆ తర్వాతే మీకు రీచ్ ఇస్తామని తెలియజేసింది.
ఈ నెల 28వ తేదీన తెలుగులోని అన్ని న్యూస్ ఛానెల్స్ కి వర్చ్యువల్ సెషన్ నిర్వహించబోతోంది.
ఇదీ ఈ మెసేజ్ సారాంశం.
Hi There,
I’m reaching out to let you know about a recent update to YouTube’s policies on misleading metadata, such as egregious clickbait, that may be highly relevant to your content.
Egregious clickbait can occur when the video’s metadata, like the title or thumbnail, includes promises or claims that aren’t delivered within the video itself, especially when that content focuses on breaking news, current events, or sensitive topics like elections or politics.
To ensure viewers aren’t misled about what they watch on YouTube, we’re strengthening our enforcement against videos where the title or thumbnail promises viewers something that the video doesn’t deliver.
In December, we announced that we have started strengthening this enforcement in India. You can learn more in our announcement here.
Please note that future violations of this policy and other policies may result in restrictions being applied to your channel, which could include upload and live stream restrictions.
To better equip you and your team with this policy, we will hold a 45 minute virtual session on Jan 28, 2025 11 AM IST.
సో, చూశారు కదా.. మన యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన ముహూర్తం బాగుంది, యూట్యూబ్ కి, తెలుగు వాళ్లకి మంచి రోజులు రానున్నాయి ఎంతో కొంత!
Share this Article