Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అన్నిటికన్నా నన్ను ఆకర్షించింది జగన్ వెంటే నీడలా వెన్నాడుతున్న ఓ కుర్రాడు !

April 8, 2024 by Rishi

ఏపీలో జరగబోయే ఎన్నికల్లో గెలుపోటముల సంగతి ఎలా ఉన్నా జగన్ బస్సు యాత్రకు.. చంద్రబాబు సభలకు మండుటెండలను సైతం లెక్క చేయక జనం భారీగానే వస్తున్నారు !

ఇద్దరి ఎన్నికల యాత్రలు టీవీల్లో చూసిన  నేను కొన్ని విషయాలు పరిశీలించాను !

ముందుగా జగన్ యాత్రలో నేను పరిశీలించినవి చెప్పుకుని రెండో పార్టులో చంద్రబాబు యాత్ర గురించి చెప్పుకుందాం !

టీవీల్లో జగన్ బస్సు యాత్రను చూసినప్పుడు కొన్ని దృశ్యాలు నన్ను ఆకర్షించాయ్ !

బస్సు యాత్ర కోసం జగన్ ఎంపిక చేసుకున్న బస్సు పవన్ కళ్యాణ్ వారాహి కన్నా బావుందనిపిస్తుంది !

టాప్ బాగా ఎత్తుగా ఉండటం వల్ల కాబోలు ఎటునుంచి చూసినా జనాలకు జగన్ కనపడతాడు !

బస్ టాప్ మీద జగన్ తో పాటు అభ్యర్థి అండ్ సెక్యూరిటీ మాత్రమే ఉంటున్నారు !

జగన్ జనాలకు కనపడే విధంగా అవసరమైనప్పుడు సెక్యూరిటీ కిందకి కూర్చుంటున్నారు !

జనాలు విసిరే పూలు జగన్ మీద పడకుండా పాడ్స్ అడ్డుపెట్టి కాపు కాస్తున్నారు !

బస్సు యాత్ర.. సభలు పక్కా ప్లానింగ్ గా ఆర్గనైజ్ చేస్తున్నారనిపిస్తుంది !

ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను టార్గెట్ చేసుకుని సభల్లో వారి చేతనే ప్రభుత్వ పనితీరుపై ముఖాముఖి చెప్పించటం బావుంది !

ఇందులో ప్రస్తుతం పెన్షన్లు పొందుతున్నవాళ్ళందరూ రాబోయే ఎన్నికల్లో కూడా జగన్ కే ఓటు వేసే వ్యూహం కనిపిస్తుంది !

తన దోవన తను బస్సులో అలా వెళ్లిపోవడం కాకుండా జనాలకు చేరువ కావటంలో జగన్ వినూత్న శైలి అనుసరిస్తున్నారు !

ఈ విషయంలో  జగన్ కొద్దిగా ఎన్టీఆర్ శైలిని అనుసరిస్తున్నట్టు అనిపిస్తుంది !

సోషల్ మీడియాలో స్క్రోలింగ్ చేస్తున్నట్టు  పెయిడ్ ఆర్టిస్టులు అవునో కాదో తెలీదు కానీ బస్సు యాత్రలోనే కొన్ని చోట్ల ఆగి ప్రజల సమస్యల మీద వినతి పత్రాలు తీసుకోవటం.. దానిపై చర్యలు తీసుకోవాలని అక్కడికక్కడే మనుషులను పురమాయించటం వంటివి ఖచ్చితంగా పదిమందిని ఆకర్షిస్తుంది !

మాములు జనాలు తాకటానికి కూడా భయపడే వంటినిండా కురుపులు ఉన్న మహిళను జగన్  చేయి పట్టుకుని ఓదార్చి భరోసా ఇవ్వటం ఖచ్చితంగా జనాల దృష్టిని ఆకర్షిస్తోంది !

ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా కూడా సెక్యూరిటీని పక్కన పెట్టి జగన్ వీలున్న చోట జనాలకు చేరువ కావటానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టు కనిపిస్తుంది  !

గతంలో లేని విధంగా బహిరంగ సభల్లో రాంప్ వాక్ పెట్టి కొత్త ఒరవడి సృష్టించారు !

సభల్లో చంద్రబాబుని విమర్శించడానికి జగన్ ఎంత సమయం తీసుకుంటున్నారో.. ప్రభుత్వం  అమలు చేసిన ఉచిత పధకాలను విడమర్చి చెప్పటానికి అంతే సమయం తీసుకుంటున్నారు !

రాజకీయ నాయకుడికి కావాల్సిన ముఖ్య లక్షణం జనంలోకి వెళ్ళినప్పుడు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం.. ఓర్పు.. సహనం.. చిరునవ్వు !

జగన్ ఎంత అలసటలో ఉన్నా కూడా ముఖాన చిరునవ్వు చెదరనీయట్లేదు !

మండే ఎండల్లో తరలి వస్తున్న జనాల కోసం వ్యానుల్లో మంచినీటి పొట్లాలు.. మజ్జిగ ప్యాకెట్లు పంచటం కనిపించింది !

కానీ సభలల్లోనూ.. యాత్రల్లోనూ మేడలు మిద్దెల మీదా.. కరెంట్ స్తంభాల మీద.. కూలిపోయేలా ఉన్న గోడల మీద.. రేకుల షెడ్డుల మీద ఎగబడుతున్న జనాల్ని కంట్రోల్ చేసే నాధుడు ఎవరూ కనిపించలేదు !

ఒకవేళ తొక్కిసలాటలో జరగరానిది జరిగి ప్రాణ నష్టం ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత అటు పార్టీ నాయకుల మీద.. ఇటు ప్రభుత్వ అధికారుల మీదా ఉంది !

యాత్రలో ట్రెండ్ చూస్తుంటే వైసీపీ లో  అభ్యర్థుల చరిష్మాకన్నా జగన్ చరిష్మా మీదే ఓట్లు పడతాయ్ అనిపిస్తుంది !

అన్నిటికన్నా నన్ను ఆకర్షించింది జగన్ వెంటే నీడలా వెన్నాడుతున్న ఓ కుర్రాడు !

నల్లగా ఉన్న ఈ కుర్రాడు ప్రైవేట్ పర్సనో.. ప్రభుత్వ పర్సనో తెలీదు కానీ జగన్ ప్రసంగిస్తున్నప్పుడు ముందుగా రాసిపెట్టుకున్న కాగితాలు డెస్క్ మీద పెట్టటం.. అవసరమైనప్పుడు వాటర్ బాటిల్ అందివ్వటం.. జగన్ ప్రసంగానికి అనుగుణంగా ఆఖర్లో ఫ్యాన్ గుర్తును జగన్ చేతికి అందించటం అన్నీ సిస్టమాటిక్ గా చేసుకుంటూ పోతున్నాడు !

స్పీచ్ ఫ్లో లో జగన్ ఏదన్నా విషయం మర్చిపోతే వెంటనే  స్లిప్ అందించి గుర్తు చేస్తున్నాడు  !

ఎందుకో అతన్ని చూస్తే నాకు సూరీడు గుర్తుకొచ్చాడు !

గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి పర్యటనల్లో కూడా  సూరీడే అన్నీ ముందే ముందుండి  చూసుకునేవాడు !
  
చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ ల  యాత్ర గురించి ఇంకో పోస్టులో చెప్పుకుందాం ! (….. పరేష్ తుర్లపాటి)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions