ఆచితూచి, అన్నీ బేరీజు వేసి, పొల్లు మాటలేవీ రాకుండా జాగ్రత్తపడే వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి… ఎక్కడా టెంప్ట్ కాడు, ఎమోషన్‌తో కంట్రోల్ తప్పడు మాట్లాడేటప్పుడు… అందుకే పార్టీకి అత్యంత కీలకమైన సలహాదారు కమ్ అధికార ప్రతినిధి… తను చెబితేనే అది పార్టీ వాయిస్… ఆయన తప్ప ఎవరేం మాట్లాడినా అది పరిగణనలోకి రాదు… అలాంటి సజ్జలకు కూడా వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో పార్టీ స్టాండ్ ఏమిటో సరిగ్గా చెప్పలేని స్థితి…
ప్రపంచంలో జరిగే ప్రతి అనర్థానికీ చంద్రబాబు నిర్వాకమే కారణం అన్నట్టుగా… ఈ హత్య కేసునూ ఆయనకే రుద్దితే ఎలా సార్..? తను శుద్ధపూస అని కాదు… కానీ ఈ హత్యకు సంబంధించి జగన్‌ను ఏమీ సాధించలేకపోయాడు… తను అధికారంలో ఉండి కూడా దీన్ని జగన్ మీద కక్షసాధింపుకు వినియోగించుకోలేకపోయాడు… పోనీ, జగన్ అధికారంలోకి వచ్చాక సున్నితంగా డీల్ చేసి, ఎక్కడికక్కడ నట్లు బిగించి, ఈ కేసుకు మేకులు కొట్టగలిగాాడా అంటే అదీ లేదు…
వివేకా బిడ్డ పోరాటం మూలంగా కేసు సీబీఐ దాకా వచ్చింది… సీబీఐ దర్యాప్తు కావాలని జగనే మొదట్లో డిమాండ్ చేశాడు, సరే, చంద్రబాబు దీన్ని తెలివిగా తనకు వ్యతిరేకంగా వాడుకుంటాడేమో అనే సందేహంతో అప్పుడలా డిమాండ్ చేయాల్సి వచ్చింది… పొలిటికల్‌గా కూడా సహజమే… కానీ అదే స్టాండ్ తను అధికారంలోకి వచ్చాక మాయమైపోయింది… నిజంగానే మీరు చెబుతున్నట్టుగా చంద్రబాబు కోవర్టులు సీబీఐలో ఉన్నారు, సీబీఐ చంద్రబాబు చెప్పినట్టు ఆడుతుందీ అనుకుంటే… మరి అప్పట్లో సీబీఐ దర్యాప్తును మీరే ఎందుకు డిమాండ్ చేసినట్టు..?
Ads
జగన్‌కు చుట్టుకునేలా సీబీఐ ప్రయత్నిస్తోందని అంటున్నారు కదా… ఆ అవసరం సీబీఐకి ఏముంది..? ఎలాగూ జగన్, బీజేపీతో బాగుంటున్నాడు… సీబీఐ కేంద్రం చేతిలో చిలుక కదా… మరి బీజేపీ స్నేహితుడికి వ్యతిరేకంగా సీబీఐ ఎందుకు వెళ్తున్నట్టు..? దాన్ని మోడీ ఎందుకు సహిస్తున్నట్టు..? అనేకానేక కారణాలతో చంద్రబాబు రాష్ట్రంలోకి సీబీఐ ఎంట్రీని నిషేధించాడు… కేసీయార్ కూడా అదే పనిచేశాడు… పలు రాష్ట్రాలు కూడా చేశాయి… మరి జగన్ ప్రభుత్వం కూడా ఎందుకు చేయలేకపోయింది తమకు అధికారం వచ్చిన కొత్తలోనే…!?
ఆయన కుటుంబంలోనే వివాదాలున్నాయంటున్నారు సరే, రెండో పెళ్లి తగాదాలు కూడా ఉండే ఉండవచ్చు, వివేకాను ఆయన చుట్టూ ఉన్నవాళ్లే చంపారనేదీ నిజమే అనుకుందాం… ఈ కోణంలో విచారణ ఎందుకు జరగడం లేదనే వాదన ఎందుకో నప్పడం లేదు సార్… మీరు అధికారంలోకి వచ్చిన కొత్తలో ఇదే కోణంలో దర్యాప్తు చేయించి, చార్జిషీట్ ఫైల్ చేసేస్తే కథ వేరేగా ఉండేది కదా మరి..?
సీబీఐని మేనేజ్ చేసేంత సీన్ నిజంగా చంద్రబాబుకు ఉందా..? ఇది పెద్ద ప్రశ్న… ఎస్, తన రూట్స్ చాలా వ్యవస్థల్లో ఉన్నమాట నిజమే కావచ్చు… ఏదైనా మేనేజ్ చేయగలడు… ఆ సామర్థ్యం ఉన్నవాడే… కానీ ఒకవైపు మోడీ ప్రాపకం కోసం మళ్లీ మళ్లీ విశ్వప్రయత్నం చేస్తున్న చంద్రబాబు, మోడీ కనుసన్నల్లోని సీబీఐని మేనేజ్ చేసే ప్రయత్నం, అదీ బీజేపీతో బాగున్న జగన్ మీద కుట్రలు చేసేలా, బీజేపీ కోవర్టుల సాయంతో సీబీఐని మేనేజ్ చేయడం జరిగే పనేనా..? నమ్మబుల్‌గా లేదు… అవినాశ్‌ను ప్రొటెక్ట్ చేసుకోవాలనే కోణంలో అడుగులు సరిగ్గా పడటం లేదనిపిస్తోంది…!! అవినాశ్ కూడా ఎవరినో ప్రొటెక్ట్ చేయబోయి తను బుక్ అయినట్టున్నాడు… అవునూ, బీజేపీలోని తెలుగుదేశం మద్దతుదారులైన కోవర్టుల గురించి బీజేపీ హైకమాండ్‌కు తెలియదా ఏం..?!
Share this Article