.
చివరకు ఎవరూ పెద్దగా పట్టించుకోని జెమిని, ఈటీవీ సీరియల్స్‌లో… ఓ నాసిరకం సీరియల్ రేటింగ్స్ కూడా 2 దాకా వస్తాయి… కానీ జీ తెలుగు వాడు సమర్పించే సరిగమప అనే మ్యూజిక్ షో రేటింగ్స్ సాధనలో అంతకన్నా నాసిరకం పనితీరు…
రకరకాల భ్రష్ట ప్రయోగాలతో మ్యూజిక్ షోను మరో శ్రీదేవి డ్రామా కంపెనీ షోలాగా మార్చేశారు అని గతంలో కూడా చెప్పుకున్నాం కదా… అసలు దీని రేటింగ్స్ ఎలా ఉంటున్నాయి అని ఈవారం బార్క్ జాబితాలు చూస్తుంటే అక్కడెక్కడో దిగువన… ముందే చెప్పుకున్నట్టు తీసికట్టు సీరియల్స్‌కు దిగువన… 1.90 రేటింగులతో కనిపించింది…
Ads
అవును, 15 నాటి షో రేటింగ్స్ అవి… (హైదరాబాద్ బార్క్ కేటగిరీ)… తక్కువ రేటింగ్స్ ఊహించినవే… సంగీత ప్రియులు ఏమాత్రం ఇష్టపడని తిక్క ప్రయోగాలు కాబట్టి… మ్యూజిక్ తప్ప అన్నీ అందులో జొప్పిస్తున్నారు కాబట్టి…
సరే, వచ్చేవారం ఇంకెలా ఉండబోతున్నదో చూద్దామని సెర్చితే ఓ తాజా ప్రోమో కనిపించింది… మళ్లీ అనంత శ్రీరాం వచ్చాడు… ఈసారి డెడికేషన్ రౌండ్ అట… అంటే ప్రతి కంటెస్టెంట్ తమకు ఇన్‌స్పిరేషన్‌గా లేదా తాము బాగా అభిమానించి, తమకు తోడుగా నిలబడేవాళ్లకు పాటను అంకితం చేయడం… దాదాపు ప్రతి కంటెస్టెంట్ కన్నీళ్లు పెట్టుకున్నారు…
సరే, వాళ్ల జ్ఞాపకాలు, వాళ్ల అనుభవాల్ని చెబుతూ ఎమోషన్ పండించారు… పాడటంలో నైపుణ్యాన్ని పరీక్షించడానికి ఈ డెడికేషన్లకు సంబంధం ఏమిటీ అనడక్కండి… తెలుగు టీవీల్లో మ్యూజిక్ షోలను ఇంకా భ్రష్టుపట్టించడం అనే ప్రక్రియ మరింత దిగజారబోతోంది…
ఈ షో గురించి గతంలోనూ ముచ్చటించుకున్నాం, పదే పదే అవన్నీ చెప్పుకోవడం అక్కర్లేదు… ఈసారి ఏకంగా వేదిక మీద కోటికి పాదపూజ ముచ్చట కూడా వచ్చిచేరింది… కృతజ్ఞత అలా చెప్పాలా… అది చూపాలా..? అసలు పాదపూజ అనే ఛాందసానికి ఇలాంటి మాస్ షోలలో ప్రాధాన్యం ఎందుకిస్తున్నట్టు..? ఈ పాదపూజల ప్రభావం పాటగాళ్లకు ఇచ్చే మార్కుల్ని ప్రభావితం చేయదా మిస్టర్ కోటీ..!!
బహుశా ఈ జీసరిగమప చూస్తూ,.. చివరకు కాస్త ఇలాంటి భ్రష్టప్రయోగాలకు దూరంగా ఉండే ఈటీవీ పాడుతా తీయగా కూడా మసకబారుతోంది… ఏదో ఎంటర్‌టెయిన్‌మెంట్ ప్రధానంగా సినిమా పాటల కచేరీ నడపాలని అనుకుంటే వోకే… కానీ దానికి సరిగమప వంటి పెద్ద పెద్ద టైటిళ్లు దేనికి..? ఇదేదో సింగర్స్ సింగింగ్ ఎబిలిటీ, క్వాలిటీలకు పరీక్ష అనే కలరింగులు, కవరింగులు దేనికి..?
ప్రేక్షకుల్ని రంజింపచేయడానికి కొన్ని పిచ్చి ప్రయోగాలు, ఎలివేషన్లు గట్రా ఉన్నా సరే… ఈరోజుకు కూడా ఇండియన్ ఐడల్ హిందీ షోయే కాస్త బాగుంటోంది… అఫ్‌కోర్స్, ఆహాలో దీని తెలుగు అనుకరణ షో కూడా ఇటీవల చెడగొట్టేశారు, తెలుసు కదా..!!
Share this Article