ఎహె, తెలుగు వినోద చానెళ్లలో రెండో స్థానంలో ఉండి, ప్రథమ స్థానం కోసం కష్టపడుతున్న జీతెలుగు చానెల్ వాడు ఆఫ్టరాల్ మూడో ప్లేసులో ఉన్న ఈటీవీ చానెల్ వాడికి భయపడటం ఏమిటి..? శీర్షిక చూడగానే ఈ ప్రశ్న స్ఫురించిందా మీకు..? జీతెలుగు ఈరోజు మాంచి ప్రైమ్ టైమ్‌లో ప్రసారం చేసిన ‘ఇయర్ ఎండ్’ స్పెషల్ షో దావత్ చూస్తే మీకు కూడా ఇదే అభిప్రాయం వస్తుంది… అసలు ఇయర్ ఎండ్ ప్రోగ్రామ్ అయిదు రోజుల ముందే ప్రసారం చేయడం ఏమిటి అంటారా..? దాన్నే జీతెలుగు వాడి భావదరిద్రం అంటారు… ఈటీవీ ఇయర్ ఎండ్‌న ప్రసారం చేయనున్న ‘పెళ్లాం వద్దు- పార్టీ ముద్దు’ అనే షోకు పోటీ ఇవ్వలేమని గ్రహించి, ఈ దావత్ అనే షో నాణ్యతకు తనే సిగ్గుపడిపోయి పోటీ నుంచి విరమించుకుని, నాలుగు రేటింగ్స్ కోసం ఈ సండే ప్రైమ్ టైమ్‌లో ప్రసారం చేసేసి, చేతులు దులిపేసుకుంది… ఫాఫం, జీతెలుగు వ్యవహారాలు చూస్తున్నవాళ్లెవరో గానీ, మీకు సానుభూతి…
చానెళ్ల నడుమ పోటీ అంటే పోటీయే… దావత్ పేరిట ప్రోగ్రాం చేశారు, ఏముంది..? అప్పట్లో ఈటీవీ జబర్దస్త్ నుంచి నాగబాబు పట్టుకొచ్చిన క్రియేటివ్ డైరెక్టర్లు జీతెలుగులోనే ఉన్నట్టున్నారు… ఇంకేముంది..? ఈ షోలో కూడా మళ్లీ అదే నాగబాబు, అదే నీహారిక… వీళ్లకుతోడుగా మొహమాటానికి చుట్టపుచూపుగా వచ్చి, మధ్యలోనే జంపైపోయిన సుమ… (నాగబాబు శ్రీమతి కూడా చివరిదాకా ఉన్నట్టు కనిపించలేదు)… అదే రియాజ్, సద్దాం టీం… పోనీ, ఏమైనా క్రియేటివిటీ జాడలు కనిపించాయా అంటే… జీరో…! ఆలీ, బ్రహ్మానందం, విశ్వక్‌సేన్, సింగర్ రేవంత్ తదితరులు కనిపించారు… అందరూ పెద్ద పెద్ద డప్పులు మెడలో వేసుకుని వచ్చారు… ప్రదీప్ సరేసరి… (ప్రదీప్ అంటే ఈమధ్య మొనాటనీ వచ్చేస్తోంది)… షో అంతా ఒకరినొకరు పొగుడుకోవడం… ఢం ఢం వాయించిపడేశారు… ఇదేం షోరా బాబూ అని చాలామంది ఇంకేదో చానెల్‌లో వచ్చిన తలైవి సినిమాకు మళ్లిపోయారు…
Ads
ఒకటి మాత్రం బాగా నచ్చింది… అదొక్కటే ఈ షోలో నచ్చింది… చమ్మక్ చంద్ర తెలుసు కదా… తను యధావిధిగా తన కామెడీ పార్టనర్ సత్యశ్రీతో చేసిన స్కిట్ బాగుంది… అంతేకాదు, తన తల్లిదండ్రులను పిలిచి, తను కట్టిస్తున్న కొత్త ఇంటి వివరాలు చెబుతూ ఎమోషన్‌కు గురయ్యాడు… ఇంటి డిజైన్ కూడా బాగుంది… ఇక షోలో మిగతా అంశాల గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు… కానీ షో చివరలో ‘ఊ అంటావా, ఊఊ అంటావా’ పాటకు భానుశ్రీ మరో ఇద్దరు డాన్సులు చేశారు… భానుశ్రీ డ్రెస్సింగ్ సరిచూడాల్సిన సోయి కూడా లేదు ఆ షో క్రియేటర్స్‌కు… ఆమె డాన్స్ చేస్తున్నంతసేపూ చెడ్డీయే కనిపించింది… పాపం శమించుగాక… (మరో డాన్సర్ సత్యశ్రీ కాదు కదా కొంపదీసి…) నిజానికి బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా సూపర్ హిట్ తరువాత ఇప్పుడు ఊఅంటావా ఊఊఅంటావా పాటే సూపర్ హిట్… టీవీ షోలు, సోషల్ మీడియా పోస్టులు, ట్యూబ్ చానెళ్ల షోలు, సైట్ల కథనాల్లో… మొత్తం అదే పాట గింగురుమంటోంది… ఈ రికార్డింగ్ డాన్స్‌ను మించి మరో కొత్త ఆలోచన కూడా జీతెలుగు క్రియేటివ్ టీంకు రాకపోవడం ఆ చానెల్ మేనేజ్‌మెంట్ దురదృష్టం… అంతే…
Share this Article