Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఫాఫం జీతెలుగు టీవీ… స్టార్ మాటీవీ దూకుడుతో విలవిల… పూర్ రేటింగ్స్…

September 15, 2024 by M S R

ఫాఫం, నానాటికీ తీసికట్టు నాగంభొట్లు అన్నట్టుగా మారింది జీతెలుగు వాడి ప్రస్థానం… ఎలాగూ జెమిని టీవీ వినోద ప్రేక్షకుల జాబితా నుంచి దాదాపు అంతర్థానమయ్యే సిట్యుయేషన్… లేదా ఉన్నదంటే ఉన్నది అన్నట్టుగా మారిపోయింది…

ఈటీవీ గతంలో కనీసం రియాలిటీ షోలతో, నాన్ ఫిక్షన్ కేటగిరీలో కాస్త పోటీపడేది… ఇప్పుడు ఫాఫం, ఇప్పుడు అదీ భ్రష్టుపట్టింది… చివరకు యూట్యూబ్ రెవిన్యూ మీద ఆధారపడుతోంది… టీవీ రేటింగ్స్‌లో పూర్… ఒకప్పుడు బాగా వెలిగిన రియాలిటీ షోలు కూడా ఇప్పుడు ఎవడూ దేకని సిట్యుయేషన్… లైక్ జబర్దస్త్, ఢీ, సుమ అడ్డా ఎట్సెట్రా…

ఇక స్టార్ మాటీవీకి కాస్తో కూస్తో పోటీ ఇస్తూ వస్తున్నది… రెండు చానెళ్లకూ పెద్దగా రియాలిటీ షోల మీద పట్టు లేదు… రక్తికట్టవు… ఒక్క బిగ్‌బాస్ హడావుడి తప్ప… ఫిక్షన్, అంటే సీరియల్స్ మీదే వాటి రేటింగ్స్ ఆధారపడ్డయ్… చివరకు ఇప్పుడు ఆ జీతెలుగు కూడా చేతులెత్తేస్తోంది క్రమేపీ… ఈ రేటింగ్స్ చూడండి, తాజావి…

Ads


Top 5 Channels – AP/Telangana,

(WEEKLY AMA’000 {AVG.}
1  STAR Maa            2401.35
2  Zee Telugu            1552.18
3  ETV Telugu           816.73
4  Star Maa Movies   611.59
5  Gemini Movies      541.18


జెమిని అసలు టాప్ ఫైవ్‌లోనే లేకుండా పోయింది… ఈటీవీ స్టార్ మా రేటింగ్స్‌లో మూడో వంతు మాత్రమే… జీతెలుగు కూడా బాగా వెనకబడిపోతోంది… స్టార్ మా రీచ్ ఎక్కువ, పైగా మీటర్లున్న ఇళ్లు బాగానే దొరికినట్టున్నయ్… ఇంకేం..? రేటింగ్స్ ఝుమ్మని ఎగురుతున్నయ్… దేశంలోనే టాప్ టీవీ ఇప్పుడది…

ఈసారి బార్క్ టాప్ 30 ప్రోగ్రామ్స్ రేటింగుల్లో ఒక్కటంటే ఒక్కటీ జీతెలుగు సీరియల్ లేదు… మొత్తం స్టార్ మా సీరియళ్ల గుత్తాధిపత్యమే… బ్రహ్మముడి, కార్తీకదీపం, చిన్ని, గుండెనిండా గుడిగంటలు, ఇంటింటి రామాయణం ఆధిపత్యం సాగుతోంది… పెద్దగా క్రియేటివ్ సీరియళ్లు ఏమీ కావు… కానీ జీతెలుగు సీరియళ్ల నాసిరకం స్టార్ మా సీరియళ్ల పాపులారిటీ పెంచుతోంది…

గతంలో కనీసం త్రినయని వంటి సీరియళ్లు టాప్ 30 జాబితాలో కనిపించేవి… అది ఎంత విఠలాచార్య మార్క్ సీరియలే అయినా రొటీన్, బోర్ అయిపోయింది… ఒకడు కాకపోతే మరో మాంత్రికుడు, మంత్రగత్తె తరహా అత్తగారు, ఏమాత్రం అఫెన్స్ చేతగాని మూడోకన్ను నయని… కాస్త జగద్ధాత్రి నయం అనుకుంటే… అది మరీ జోక్ చేసిపారేశారు…

పాత ఎన్టీయార్ సినిమాల్లో హీరో చెంప మీద ఓ పులిపిరి అతికించుకుంటే ఎవడూ గుర్తుపట్టడు అన్నట్టుగా… ఇందులో హీరోహీరోయిన్లు కరోనా మాస్కులు వేసుకుంటారు ఎప్పుడూ… అంతే, ఇక వాళ్లను ఎవరూ గుర్తుపట్టరు… మేఘసందేశం, పడమటి సంధ్యారాగం కాస్త ఆదరణ పొందుతున్నాయి ఈమధ్య… జీతెలుగు జాబితాలో అవే టాప్… మొదట్లో అమ్మాయిగారు కాస్త బాగున్నట్టనిపించింది… ఇప్పుడదీ తగ్గుముఖం పట్టింది… నిండు నూరేళ్ల సావాసం వోకే…

కాస్త ఆ సోది కథలు… తీసేవాడికి చూసేవాడు లోకువ అన్నట్టుగా సాగే చిత్రీకరణలు మానేయకపోతే జీతెలుగు ప్రభ కొడిగట్టడం ఖాయం… ఫాఫం, ఆమధ్య త్రినయనిలో కొన్ని గ్రాఫిక్స్ బాగానే చేశారు… కానీ అదే సోది ప్రజెంటేషన్… ఓ హాలు, ఊఁ అంటే చాలు, ఇరవై నాలుగు గంటలూ అలంకరణతో, పట్టుచీరెలతో, నగలతో అలరారే కేరక్టర్లు వరుసగా పదీపదిహేను నిలబడతాయి… ఛపక్ ఛపక్ అనే ఫ్రీజ్ షాట్ల పైత్యం సరేసరి…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions