గతంలో పండుగ లేదా ప్రత్యేక సందర్భం ఏది వచ్చినా సరే… ఈటీవీ స్పెషల్ ప్రోగ్రామ్స్‌తో ముందంజలో ఉండేది… ఆ జబర్దస్త్ టీం కమెడియన్లకే తలా కొంత తాయిలం పెట్టేసి, ఓ మూడు గంటల ప్రోగ్రామ్ చేసి వదిలేది… దీనివల్ల ఈటీవీకి యాడ్స్ డబ్బులు ప్లస్ రీచ్ ప్లస్ రేటింగ్స్ ప్లస్ నాన్-ఫిక్షన్ కేటగిరీలో పైచేయి… ఇవన్నీ దక్కేవి… మాటీవీ చేస్తే బిగ్‌బాస్ వంటి పెద్ద పెద్ద రియాలిటీ షోలు తప్ప ఈ పండుగ స్పెషల్స్ గట్రా ఆనేవి కాదు… జీ వాడికి ఎంతసేపూ ఏదైనా సందర్భం వస్తే ఇంటర్నల్ అవార్డులు, వనభోజనాలు టైపు ప్రోగ్రామ్స్ చేసుకుని, మురిసిపోయేవాడే తప్ప వాటిని డబ్బులు కురిపించే టైపులో చెక్కుకోలేకపోయేవాడు… జెమినిని వదిలేయండి… వాడికిప్పుడు ఏదీ చేతకాదు…
ఇప్పుడు మాటీవీతో నువ్వా నేనా అనే తరహా పోటీ ఉంది జీవాడికి… బార్క్ అర్బన్ కేటగిరీలో ఆల్రెడీ నంబర్ వన్ అయ్యాడు కూడా… ఫిక్షన్, అంటే సీరియళ్లలో సమానం అయిపోయాడు, ఇక నాన్-ఫిక్షన్ అంటే రియాలిటీ షోలలో మాటీవీని కొట్టేస్తే సరి… అందుకని ఈ సంక్రాంతిని ఎంచుకున్నది జీటీవీ… మామూలుగా అందరూ ఒకేరోజు మూడు గంటల ప్రోగ్రాం చేస్తారు కదా… జీవాడు వరుసగా రెండు రోజులు షోలు పెట్టేశాడు… ఆల్రెడీ నిన్న ఒకటి అయిపోయింది… ఈరోజు ఉదయం 9 గంటల నుంచి పార్ట్-2 సంక్రాంతి సంబరాలు మోతమోగుతున్నయ్… ఇంత ప్రయాస దేనికంటే..?
Ads
- రెండు పార్టులు కలిసి, ఆరు గంటలు… ప్లస్ హై లైట్ అని మరో గంట… 13న పోటీయే లేదు… కాబట్టి రేటింగ్స్ బాగానే వస్తయ్… 14న ఉదయమే ప్రసారం… పోటీ లేదు… రెండూ కలిపి నాన్-ఫిక్షన్ రేటింగ్స్ పెరుగుతయ్, ఓవరాల్ రేటింగ్స్‌కు కలిసొస్తయ్…
- 14న ఉదయం మాటీవీ ఫ్యామిలీ పార్టీ అని ఓ ప్రోగ్రామ్ ప్రసారం చేయనుంది… అదంతా బిగ్‌బాస్ తరహా సందడి ప్లస్ మాటీవీ సీరియళ్ల నటీనటులతో సరదాగా ఓ పార్టీ టైపు… ఈటీవీ తెలివిగా అదే మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం చేయబోతోంది… అత్తోఅత్తమ్మకూతురో అని షో… అందులో రోజా ఓవరాక్షన్ సహా ఈసారి చాలా నాన్-వినోద అంశాలు ఉండబోతున్నయ్… ప్రదీప్ భజన, సుధీర్ గైర్హాజరీ ఎట్సెట్రా… రైతులు, ఓ ప్రేమజంట ఆత్మహత్యల ఎపిసోడ్స్ పండుగపూట నెగెటివిటీని పెంచేవి… దాన్నలా వదిలేస్తే…
- జీవాడికి గతంలో ఈ పండుగ ప్రత్యేక షోల ద్వారా వచ్చే యాడ్స్ డబ్బు రుచి తెలియలేదు… ఈమధ్య ప్రతి పండక్కీ స్పెషల్స్ చేస్తున్నాడు… యాడ్స్ డబ్బులు ప్లస్ రేటింగ్స్ రుచిమరిగాడు కదా… ఇక వదలడు… ఈసారి రెండు రోజులు…
- ఇలాంటి షోలతో వచ్చే ప్రయోజనం ఏమిటంటే..? యాడ్స్, డబ్బులు, రేటింగ్స్ మాత్రమే కాదు… మన చానెల్ నుంచి ప్రేక్షకులను వేరే చానెళ్ల వైపు పోనివ్వకుండా కాపాడుకోవడం ముఖ్యం… ఇలా ఈ స్పెషల్స్ ప్రయోజనాలు తెలిశాక ఇక ఎందుకు ఊరుకుంటారు… కుమ్మేస్తున్నారు… ఏముందీ..? సీరియళ్ల నటీనటులు, సరిగమప సింగర్స్… నాలుగు జోకులు, ఆరు గంతులు… చివరలో భోజనాలు… అంతే…
- యాడ్స్ డబ్బులే కాదు… సినిమా ప్రమోషన్లనూ లాగించేస్తున్నాడు జీవాడు… 13న రామ్ వచ్చి కాసేపు సందడి చేసి వెళ్లాడు… తన రెడ్ సినిమా ప్రమోషన్… కాకపోతే 13 నాటి జీ ఎపిసోడ్ పెద్దగా రక్తికట్టలేదు… బోర్… మాటీవీ కూడా అంతే… అల్లుడు అదుర్స్ ప్రమోషన్ కోసం బెల్లంకొండ శ్రీనివాస్‌ను రప్పిస్తోంది… వేదిక మీద కొన్ని సిల్లీ హీరోయిక్ వేషాలు కూడా ఉండబోతున్నయ్… భరించండి… ఈటీవీ అలా, ఈ రెండు టీవీలు ఇలా…!!
- చివరగా :: వచ్చేసారి జీ వాడు భోగి, సంక్రాంతి, కనుమ స్పెషల్స్ అని మూడు రోజులు కుమ్మేస్తాడు… వాడికే ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి అనుకుని మిగతావాళ్ళు కూడా సేమ్ షేమ్… ఎడిటింగ్ మర్చిపోయి పార్ట్-1,2,3 అని కొట్టేయడమే కదా… షో చివరలో సద్దాం చెప్పింది కూడా అదే…
- అవునూ… సంక్రాంతి పూట మయూరి సుధా చంద్రన్ తో దుర్గ వేషం వేయించడం ఏమిటో… ముసలామెని అంత ఆయాస పెట్టడం నేరం కాదా…!!
Share this Article