.
మరీ ఓ వ్యసనంలా అలవాటైన ఆడ లేడీస్ తప్ప…. మిగతావాళ్లందరికీ తెలుగు టీవీ సీరియళ్లు చూస్తుంటే ఓ ఎలపరం..! ఓసారి చూద్దాంలే అనుకుని ఒక్క ఎపిసోడ్ చూస్తే, అది ఏ సీరియల్ అయినా సరే… డజనుసార్లు … రేయ్, ఎవుర్రా మీరంతా అనాల్సిందే…
అఫ్‌కోర్స్, ఇండియన్ టీవీ సీరియళ్లు అంటేనే ఓ దరిద్రం… ప్రత్యేకించి తెలుగులో సీరియళ్ల రచయితలకు ఒక్కొక్కడికీ నాలుగేసి పద్మ పురస్కారాలు ఇవ్వాలి… మరి అంత సాగదీత ప్రపంచంలో ఎవడికి చేతనవుతుంది…?
Ads
ఎప్పుడోసారి సదరు ది గ్రేట్ నాగార్జున గారి అన్నపూర్ణ స్టూడియోస్ వారి సతీ త్రినయని అనే సీరియల్ చూడబడతాను… పక్కా తెలుగు సీరియళ్ల దరిద్రానికి ప్రతీక అది… తాజా ప్రోమో చూశాక కళ్లు తిరిగాయి… సేమ్… మీ క్రియేటివిటీ దరిద్రం పాడుగాను… అసలు ఎవుర్రా మీరంతా అని గట్టిగా అనాలినిపించింది…
ఏనాటి నుంచో ఒకటే గోల… యమగోల నుంచి యమదొంగ దాకా… యముడు పిచ్చోడు ఈ క్రియేటర్స్‌కు… చిత్రగుప్తుడు తప్పులు చేస్తుంటాడు… చిత్రగుప్తుడి మేకప్ సేమ్… అదే ఓ లావుపాటి పుస్తకం… అదే యమధర్మరాజు, అదే ఆహార్యం… మరీ రాజమౌళి మార్క్ యమదొంగ మరీ దరిద్రాతిదరిద్రం… దిక్కుమాలిన వెగటు, వెకిలి సీన్లు బోలెడు… మరి ప్రపంచ దర్శకుడు రాజమౌళి క్రియేటివిటీ అంటే మజాకా…
ఈ సతీ త్రినయని సీరియల్‌లోనూ అంతే… చిత్రగుప్తుడు ఏదో తప్పు చేస్తాడు… యమపాశం వెళ్లి హీరోయిన్ మెడలు పెట్టి లాక్కొస్తుంది… చివరకు యముడికి తన తప్పు చెబుతాడు చిత్రగుప్తుడు… ఏం జరుగుతుంది..? భలేవారే… సతీసావిత్రి దగ్గర నుంచీ చూస్తున్నదే కదా… రేపో మాపో త్రినయని మళ్లీ భూలోకం వచ్చేస్తుంది… సేమ్ మేకప్పుతో, సేమ్ చీర, సేమ్ నగలతో…
వీటికి భారీ ఎత్తున టీఆర్పీలు… భారీ ఖర్చులు… భారీ యాడ్స్… భారీగా రెవిన్యూ… ఒరేయ్, కాస్త బుద్దీజ్ఞానం ఉన్న రచయితలను పెట్టుకోవచ్చు కదరా అని మనం అనకూడదు… వాళ్లకూ సంఘాలున్నయ్… కస్సుమంటారు… ఏ దిక్కుమాలిన టీవీ చానెల్‌లో సినిమా వార్తలు రాసేవాడో అందరినీ ఎగేసుకుని మహిళా కమిషన్‌కు పోవచ్చు కూడా…
లోకస్ స్టాండీ అంటారా..? భలేవారే… ఆ యమధర్మరాజు మీద ఒట్టు… అవి ఎవరూ పట్టించుకోరు ఇక్కడ… మన పాత సినిమాల్లో ఆర్టిఫిషియల్ పులిపిరి చెంప మీద పెట్టుకుంటే చాలు, ప్రపంచంలో ఎవడూ వాడిని గుర్తించలేడు తెలుసు కదా… సేమ్, కరోనా మాస్కులు పెట్టుకుని తిరుగుతుంటే జగద్ధాత్రిలో హీరోహీరోయిన్లను ఎవ్వడూ గుర్తించలేడు…
మనం మాత్రం సతీ త్రినయని, సతీ జగద్ధాత్రిలు చూస్తూ తరిస్తుంటాం… ఖర్మ కాకపోతే మరేమిటి..? సర్, సర్, రేవంత్ రెడ్డి గారూ,.. అర్జెంటుగా ప్రభుత్వ టీవీ అవార్డులు ప్రకటించి, ఇలాంటోళ్లకు దండలేద్దాం సర్… మీదే ఆలస్యం… ప్లీజ్..!!
Share this Article