జొమాటో… ఎప్పుడూ ఏదో వివాదంలో ఉండటం, లెంపలేసుకోవడం అలవాటే… ప్రత్యేకించి అది విడుదల చేసే వాణిజ్య ప్రకటనలు, సాగించే ప్రచారానికి సంబంధించిన టీం ఏదో దరిద్రంగా ఉన్నట్టుంది… తాజాగా మరో వివాదం… విషయం ఏమిటంటే..? ఆమధ్య హీరో హృతిక్ రోషన్‌తో ఓ యాడ్ చేయించింది… ‘‘తాలి తినాలని ఉంది, మహాకాళ్ నుంచి తెప్పించాను’’ (రఫ్ అనువాదం)… అని అంటుంటాడు ఆ వీడియోలో…
తాలి అంటే తెలుసు కదా, ఓ ప్లేటు భోజనం… సౌతిండియన్ తాలి, నార్త్ ఇండియన్ తాలి అని హోటళ్లలో ప్రధాన మెనూలో ఉంటుంది… ఫిక్స్‌డ్ ఐటమ్స్‌తో సప్లయ్ చేస్తారు… అయితే మధ్యప్రదేశ్‌లోని ప్రఖ్యాత ఉజ్జయిని మహాకాళీశ్వరుడి గుడిలో ప్రసాదాన్ని కూడా తాలి అంటారు… అది ఉచిత అన్నదానం…
ఇక్కడే కాదు, దేశంలోని ప్రముఖ 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లోనూ అన్నదానం ఉంటుంది… హృతిక్ రోషన్ యాడ్ ఎలా ధ్వనిస్తోందీ అంటే… ‘‘ప్రసాదం తినాలనిపించింది, గుడికి ఆర్డర్ ఇచ్చి తెప్పించాను’’… సో, డైలాగ్ అనుకోకుండా అలా వక్రమార్గం పట్టిందా..? లేక కావాలనే జొమాటో వాళ్ల క్రియేటివ్ టీం ఆ గుడి పేరును, ప్రసాదాన్ని తమ ప్రచారం కోసం ఇలా తెలివిగా వాడుకోదలిచారా..?
Ads
అసలు భక్తులు ప్రసాదంగా భావించే తాలిని, అంటే అన్నదానాన్ని కూడా కమర్షియల్ యాక్టివిటీ కోసం దుర్వినియోగం చేయడం ఏమిటి..? దాన్ని ఆర్డర్ చేసి తెప్పించడం ఏమిటి..? నాన్సెన్స్… అనుకున్న సదరు గుడికి సంబంధించిన ఇద్దరు పూజారులు ‘బాయ్‌కాట్ జొమాటో’ అంటూ ట్విట్టర్‌లో ప్రచారాన్ని స్టార్ట్ చేసి, ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చారు…
కలెక్టర్ ఆశిష్ సింగ్‌కు జొమాటోపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు… ‘‘నిజమే, ఆ యాడ్ మిస్‌లీడింగుగా ఉంది… గుడి ఉచితంగా ఆఫర్ చేసే అన్నాన్ని ఆర్డర్ చేయడం ఏమిటి..?’’ అన్నాడు కలెక్టర్… ఆ గుడి ట్రస్టుకు చైర్మన్ తనే… ఈలోపు మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రాకు విషయం తెలిసింది… ఎందుకైనా మంచిది, సోషల్ మీడియాలో కొన్నిసార్లు మార్ఫ్‌డ్ వీడియోలు ప్రసారం అవుతుంటాయి, సో, దర్యాప్తు చేసి, నాకు నివేదిక ఇవ్వండి’ అని సీఐడీ పోలీసులకు పురమాయించాడు…
ఇదేదో తలకు చుట్టుకుంటున్నట్టు గ్రహించిన జొమాటో వెంటనే సర్దుకుంది… నరోత్తమ్ మిశ్రా ఇలాంటి విషయాల్లో కాస్త దూకుడుగా ఉంటాడు… దాంతో ఓ క్లారిఫికేషన్ జారీ చేసింది… ‘‘అబ్బెబ్బే… హృతిక్ రోషన్ చెబుతున్నది మహాకాళ్ అంటే గుడి నుంచి ఆర్డర్ కాదు, మహాకాళ్ అనే రెస్టారెంట్ ఉంది, అక్కడి నుంచి తాలి తెప్పించుకున్నాను అంటున్నాడు హృతిక్… అంతే తప్ప ఇక్కడ గుడి, ప్రసాదం ప్రస్తావనే లేదు… మేం పాన్ ఇండియా వాణిజ్య ప్రకటనలు చేస్తున్నాం… ఆయా ప్రాంతాల ప్రముఖ రెస్టారెంట్ల పేర్లను వాడుకుంటుంటాం…’’ అని ఏదో కవరప్ చేసింది…
ఐనా ఎందుకొచ్చిన తిప్పలు అనుకుని… ‘‘హిందువుల మనోభావాలు గాయపడితే క్షమించండి… ఆ వీడియోను కూడా ఇక రన్ చేయడం లేదు… అని విస్పష్టంగా పేర్కొంది… నిజంగానే ఓ సీరియస్ ప్రశ్న… జొమాటోకు ఇది కొత్త కాదు… కావాలనే చేస్తుందా..? ఆ యాడ్స్ చేసే సదరు క్రియేటివ్ టీంకు తెలివి లేక కాదు, తెలివి ఎక్కువై… ఇలాంటి చెత్తా యాడ్స్ పుట్టుకొస్తాయి… హాఫ్ బ్రెయిన్ హృతిక్ రోషన్ వంటి నటులు కళ్లుమూసుకుని నటించేస్తుంటారు..!!
Share this Article