Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నిగ్గదీసి అడుగు… నిజానికి ఈ పాట పాడింది అలనాటి ఆ భానుమతి…

February 9, 2026 by M S R

.

Subramanyam Dogiparthi ….  నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ దగాకోరు ధర్మాన్ని . చాలామంది ఈ సిరివెన్నెల వారి పాట గాయం సినిమాలోనిది అనుకుంటారు . ఈ పల్లవికి దగ్గరగా ఇలాంటి పాట గాయం సినిమాలో ఆయనే వ్రాసారు . అయితే ఆ సినిమాకన్నా ముందే 1990 లో వచ్చిన ఈ అభిసారిక సినిమాలో కూడా ఈ పల్లవి ఉంది . పాటను ఆయనే వ్రాసారు . పాడింది ఫైర్ బ్రాండ్ భానుమతి .

స్త్రీ ఆత్మగౌరవం , ఆత్మాభిమానం వంటి ఉదాత్తమైన అంశాలతో నిర్మించబడిన ఈ సినిమాలో షీరో భానుమతే . టైటిల్ పాత్ర అయిన సారిక పాత్రను పోషించింది మాత్రం సారిక అనే నూతన నటి . ఆమెతో పాటు రెండు ప్రధాన పాత్రల్లో కూడా శ్రీనివాస్ , అశోక్ అనే ఇద్దరు నూతన నటులు నటించారు .

Ads

కధ , స్క్రీన్ ప్లే , దర్శకత్వాన్ని దాసరి నారాయణరావే నిర్వహించారు . సంభాషణల క్రెడిట్స్ టైటిల్సులో ఇద్దరికి ఇచ్చారు . ఒకరు Divakara Babu Madabhushi అయితే రెండో వారు దాసరే . ఇద్దరూ వ్రాసారా లేక ఒకరే వ్రాసారా అనేది దివాకర బాబు గారే చెప్పాలి . పాటల్ని దాసరి , సిరివెన్నెల వ్రాసారు .

కధ ఏంటంటే …: కధలో కర్ణుడు లాంటి వాడు శ్రీనివాస్ . దుర్యోధనుడు వంటి వాడు అశోక్ (పాత్ర పేరు కిరణ్) .అనాధ అయిన శ్రీనివాసుని ఆదుకొని అడ్రెస్ కలగచేసి అందలాన్ని ఇస్తాడు అశోక్ . మిత్రుడు దుర్యోధనుడు , దుశ్ళాసనుడు వంటి వాడయినా విశ్వాసంతో ఏం చేయమంటే అది చేస్తుంటాడు .

కధానాయిక పాత్రలో సారిక పాపులర్ టెన్నిస్ ప్లేయర్ . ఆమెకు కనిపించకుండా ఆరాధిస్తూ ఉత్తరాలను వ్రాస్తూ ఉంటాడు శ్రీనివాస్ . అశోక్ , సారికల తండ్రులు ప్రాణస్నేహితులు . వియ్యంకులు అవటానికి నిర్ణయించుకుంటారు .

దుర్యోధన మనస్తత్వం కల అశోక్ సారిక వర్జినిటీని శోధించేందుకు మిత్రుడు శ్రీనివాసుని విశాఖపట్నం పంపుతాడు . ఈ తతంగం తెలుసుకున్న సారిక అశోకుని పెళ్లి చేసుకునేందుకు నిరాకరిస్తుంది . దాంతో అహం దెబ్బతిన్న అశోక్ తన మిత్రుడు శ్రీనివాసుతో సారికకు అక్రమ సంబంధం ఉన్నదని టాంటాం వేస్తాడు .

సారిక మేనత్త భానుమతి రంగంలోకి ప్రవేశించి సారికను అభిసారికను చేసి శ్రీనివాస్ వద్దకు తీసుకొని వస్తుంది . శ్రీనివాసుతో సారిక పెళ్లి తిరుపతిలో నిశ్చయిస్తుంది . పెళ్ళికి బయలుదేరిన శ్రీనివాసుని రౌడీలతో చావకొట్టిస్తాడు అశోక్ . శ్రీనివాస్ కోమాలోకి వెళ్ళిపోతాడు . భానుమతి అశోకుని రివాల్వరుతో కాల్చి చంపేస్తుంది . సారిక శ్రీనివాసుకి సేవలు చేస్తూ ఉంటుంది . బాలచందర్ లాగా దాసరి సినిమాను ఇక్కడ ముగిస్తాడు .

అభిసారిక

మంచి మహిళా సాధికారత కధ . స్క్రీన్ ప్లేని పకడ్బందీగా తయారు చేసుకోలేకపోయారు దాసరి . బహుశా అందుకనే ఆయన లెవెల్లో ఆడలేదు . పైగా భానుమతితో కాంబినేషన్ . హిట్ కావలసిన కాంబినేషన్ . నాయిక సారిక అందంగానే ఉంటుంది . బాగానే నటించింది కూడా .

వాసూరావు సంగీత దర్శకత్వంలో పాటలు కూడా బాగానే ఉంటాయి . జేసుదాస్ పాడిన ఆగక మనసు ఆగక పోవక నిద్దుర పోవక , భానుమతి పాడిన నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని చాలా బాగుంటాయి . మిగిలిన పాటలు ఆడాలి తొలియేడు , ఒక సీతాకాలం సాయం సమయంలో పాటలు శ్రావ్యంగా ఉంటాయి .

మంత్రపుష్పంతో టైటిల్స్ శుభారంభం చేస్తాయి . కానీ , బలహీన స్క్రీన్ ప్లే , ప్రధాన పాత్రల్లో కొత్త నటులు కావటం సినిమాను వీక్ చేసాయి . భానుమతి రక్షించలేకపోయింది . ఇతర ప్రధాన పాత్రల్లో ప్రభాకరరెడ్డి , జయప్రకాష్ రెడ్డి , సారధి , దీప , కల్పనారాయ్ , తదితరులు నటించారు .

సినిమా యూట్యూబులో ఉంది . చూడబులే . భానుమతి , దాసరి అభిమానులు ట్రై చేయవచ్చు . నేను పరిచయం చేస్తున్న 1233 వ సినిమా . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_స్కూల్ #సినిమా_కబుర్లు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కొరియన్ గేమ్ కాదు… అడిక్షనూ కాదు… వీళ్ల చావు వెనుక ఓ మిస్టరీ…
  • నిగ్గదీసి అడుగు… నిజానికి ఈ పాట పాడింది అలనాటి ఆ భానుమతి…
  • ఇండియన్ నేవీలో FIC … మానవరహిత హైటెక్ పెట్రోలింగ్ బోట్స్…
  • ఆ కేసు ఆధారాలే కాలిపోతున్నట్టు… వాళ్లకు ముందే ఎలా తెలిసిపోయింది..?
  • చిన జియ్యర్ కూడా ఓసారి చదువుకోవాల్సిన ‘హిందూ ధర్మ పరంపర’…
  • మాతృదేవోభవ..! రాజయితేనేం… సన్యాసి ఐతేనేం… ఈ అమ్మకు కొడుకే కదా…
  • తెలంగాణకు భిన్నంగా జగన్ పోరుబాట… కేసీయార్‌కు అస్సలు కనబడదు…
  • అమెరికాతో ట్రేడ్ డీల్..! అమెరికాయే దిగొచ్చింది… ఇవీ నిజాలు…
  • రాజు కాని రాజు రేచర్ల రుద్రుడు… అనితర సాధ్యుడు… రామప్ప ఆద్యుడు…
  • నాటి తెలంగాణ జీవిత చిత్రణ… ఏటికేతంబట్టి ఎయి పుట్లు పండించి…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions