.
ఆదానీ యవ్వారంపై అప్పట్లో ఏదో ఓ కేసు అమెరికాలో… ఇంకేముంది..? వివిధ పార్టీల నాయకులు అర్జెంటుగా గొంతెత్తారు… కొంతమంది ఏకంగా Gautam Adaniని ఉరి తీయాలని డిమాండ్ చేశారు… Narendra Modi రాజీనామా చేయాలన్నారు… మోదానీ అని ప్రచారం చేశారు… మీడియా ట్రయల్స్ కూడా జరిగిపోయాయి… ఇక రేపోమాపో నేవీ సీల్స్ ఇండియాకు వచ్చి ఆదానీని పట్టుకుపోతారన్నంత బిల్డప్ ఇచ్చారు… కానీ ఇప్పుడు అదే అమెరికా వ్యవస్థ ఆదానీ కేసు విషయంలో వెనక్కి తగ్గుతోంది…
అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) దాఖలు చేసిన సివిల్ కేసులో సెటిల్‌మెంట్ కుదిరింది… ఇందులో గౌతమ్ అదానీ 6 మిలియన్ డాలర్లు, ఆయన మేనల్లుడు సాగర్ అదానీ 12 మిలియన్ డాలర్లు సివిల్ పెనాల్టీ చెల్లించేందుకు అంగీకరించినట్టు కోర్టు పత్రాలు చెబుతున్నాయి… అయితే “తమ తప్పును అంగీకరించకుండా లేదా ఖండించకుండా” ఈ సెటిల్‌మెంట్‌కు ఒప్పుకున్నారని సమాచారం… అమెరికాలో ఈ వెసులుబాట్లు కూడా ఉంటాయట…
Ads
అదే సమయంలో, అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ (DOJ) అదానీపై ఉన్న ప్రధాన క్రిమినల్ ఫ్రాడ్, లంచాల కేసులను ఉపసంహరించుకునే దిశగా కదులుతోందని Reuters, Bloomberg, New York Times వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు రిపోర్ట్ చేశాయి… ఈ కేసులను “with prejudice” కింద మూసివేసే అవకాశమున్నట్టు సమాచారం — అంటే మళ్లీ అదే ఆరోపణలపై కేసు తెరవడం కష్టమవుతుంది…
ఈ పరిణామాల వెనుక కీలక పాత్ర పోషించింది డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత న్యాయవాది Robert J. Giuffra Jr. నేతృత్వంలోని లీగల్ టీమ్ అని కథనాలు చెబుతున్నాయి… 100 స్లైడ్‌ల ప్రెజెంటేషన్ ద్వారా — ఈ వ్యవహారం మొత్తం భారతదేశంలో జరిగిందని, అమెరికా చట్టాల పరిధి వర్తించదని, తగిన ఆధారాలు లేవని వారు వాదించారు…
అలాగే, లీగల్ ఇబ్బందులు తొలగితే అమెరికాలో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు, 15,000 ఉద్యోగాల సృష్టికి అదానీ గ్రూప్ సిద్ధంగా ఉందని కూడా ప్రస్తావన వచ్చినట్టు రిపోర్టులు చెబుతున్నాయి… అయితే ఈ పెట్టుబడి ఆఫర్ కేసు పరిష్కారాన్ని ప్రభావితం చేయలేదని కొంతమంది ప్రాసిక్యూటర్లు స్పష్టం చేసినట్టు Reuters పేర్కొంది…
బాటమ్ లైన్ ఏంటంటే — ఒకప్పుడు “అదానీ అంటే నేరస్తుడు” అన్నట్టుగా తీర్పులు చెప్పిన మీడియా, రాజకీయ వర్గాలు… ఇప్పుడు అదే కేసుల్లో అమెరికా వ్యవస్థ వెనక్కి తగ్గుతున్నప్పుడు కూడా అంతే గట్టిగా మాట్లాడతాయా అన్న ప్రశ్న వస్తోంది… కోర్టుల తుది తీర్పు వచ్చే ముందే ప్రజల మదిలో నెగెటివిటీని ఇంజెక్ట్ చేసే మీడియా ట్రయల్స్‌పై మరోసారి చర్చ మొదలైంది…
Share this Article