Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈమె గుర్తుందా ? అథ్లెటిక్ ట్రాక్ వదిలేసి, రీల్ కెరీర్ ఎంచుకుని ఫ్లాప్ !!

August 22, 2026 by M S R

.

Subramanyam Dogiparthi … ముగ్గురు హీరోల మధ్య ఓ షీరో సినిమా 1993 ఏప్రిల్లో వచ్చిన ఈ ఆదర్శం సినిమా . మంచి సినిమా . Family sentiment+action+little bit political . ఓ తాగుబోతు తండ్రి , బాధ్యతతో సంసారాన్ని లాక్కొచ్చే తల్లి . తండ్రిగా తనికెళ్ల భరణి , తల్లిగా సుజాత .

ముగ్గురు కుమార్తెలు . తమిళ సినిమాలలో ఎక్కువగా కనిపించే శరణ్య , యమున , అశ్వినీ నాచప్ప . సాకలేక తాగుబోతు తండ్రి మూడో కూతురయిన అశ్వినిని అనాధాశ్రమంలో పడేస్తాడు . తప్పించుకుని ఇంటికి చేరుతుంది .

Ads

చిన్నప్పటి నుంచే గడుగ్గాయిగా చలాయించుకుంటుంది అశ్విని . అలాగే పెరుగుతుంది . ఎక్కడ అన్యాయం జరిగినా ఎదురు తిరుగుతుంది . మిగిలిన ఇద్దరు కుమార్తెలలో ఒకరయిన శరణ్య కష్టపడి చదువుకుని IAS పాసయి ఆ జిల్లాకే కలెక్టరుగా వస్తుంది . రెండో కుమార్తె సింగర్ . ఆ టాలెంటుతో ఇంటికి ఆసరాగా ఉంటుంది .

అదే ఊళ్ళో ఇనస్పెక్టర్ జగపతిబాబు . కూలీ రౌడీ రఘు . మరొకరు రాజా రవీంద్ర . అదే ఊళ్ళో ఓ రాజకీయ నాయకుడి కొడుకు జె డి చక్రవర్తి . ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుంటాడు మన నాయకుల పుత్ర రత్నాల్లాగా (అందరూ కాదులెండి) . ఈ ముగ్గురు కుమార్తెలు ఆ ముగ్గురు యువకులు ఆఖర్లో భార్యాభర్తలు అవుతారు .

తన కూతురికి అన్యాయం చేసాడని సాధు స్వభావం కల సుజాత జె డి చక్రవర్తిని కత్తితో పొడిచేస్తుంది . వెనుక నుంచి తనికెళ్ళ భరణి ఇంకా ఎక్కువ పోట్లు వేసి లేపేసి జైలుకు వెళతాడు . సినిమా సందేశం ఏంటంటే ఆడపిల్లలు అయినా కష్టపడి తమ జీవితాలను తామే తీర్చిదిద్దుకోవటం .

మొదట్లోనే చెప్పినట్లు ఫేమిలీ సెంటిమెంట్ సినిమా . షీరో అశ్విని నాచప్ప ఏక్షన్ సీన్లు . జె డి చక్రవర్తి రాజకీయ తండ్రి . కాస్త రాజకీయ వాసన . సినిమాలో నటులు అందరి చేత మంచి ఏక్షన్ని రాబట్టుకున్నాడు దర్శకుడు మౌళి . ఈయనే అశ్విని టైటిలుతో ఆమె బయోపిక్ ని తీసారు .

ఈ ఆదర్శం సినిమాకు కధ కూడా మౌళినే సమకూర్చారు . చిక్కని స్క్రీన్ ప్లే తయారు చేసుకుని ఓ మంచి సినిమాను ప్రేక్షకులకు అందించారు . డైలాగులను తనికెళ్ల భరణి వ్రాయగా పాటల్ని చంద్రబోస్ వ్రాసారు . కీరవాణి సంగీత దర్శకత్వంలో పాటలు థియేటర్లో బాగానే ఉంటాయి . బయట హిట్ అయినట్లుగా లేదు .

మా గుంటూరు భామ జయలలిత ద్విపాత్రాభినయం సరదాగా ఉంటుంది . బ్రహ్మానందం , మల్లికార్జున రావులకు భార్యలు . ఈ కామెడీ ట్రాక్ బాగుంటుంది . అశ్విని తర్వాత చెప్పుకోవలసిన పాత్రలు , నటులు భరణి , సుజాత . సుజాత గురించి చెప్పేదేముంది ! ఇతర పాత్రల్లో నూతన్ ప్రసాద్ , అనంత్ , హేమ , సాక్షి రంగారావు , తదితరులు నటించారు .

సినిమా యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూడనట్లయితే తప్పక వాచ్ లిస్టులో వేసుకోవచ్చు .

అశ్విని




నిజానికి అశ్వనీ నాచప్ప హీరోయిన్‌గా పనికొచ్చేలా ఏమీ ఉండదు… తన బయోపిక్‌కు రామోజీరావు కోరిక మేరకే ఆమెనే తీసుకున్నారు, కానీ ఇక సినిమాల్లోనే కెరీర్ వెతుక్కోవాలని ప్రయత్నించి విఫలమైంది ఆమె… ఆమెతో ఫైట్లు చేయించి, పాటలు పాడించి దర్శకుడు ఈ సినిమాలో ఏదో విఫలప్రయత్నం చేశాడు గానీ ఆమె ఈ పాత్రకు సూట్ కాలేదు… రన్నింట్ అథ్లెటిక్ ట్రాక్ వదిలేసి, రీల్ బాట ఎంచుకుని అటూ ఇటూ గాకుండా పోయింది పాపం — ముచ్చట




 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Not Appropriate – రేవంత్ USA పర్యటనపై కేంద్రానికి డౌట్లు అర్థరహితం..!
  • ఈమె గుర్తుందా ? అథ్లెటిక్ ట్రాక్ వదిలేసి, రీల్ కెరీర్ ఎంచుకుని ఫ్లాప్ !!
  • ఓహ్, ఈమెను తరిమేయడం వెనుక ఇంత ‘స్పిరిట్’ ఉందా?
  • Awarapan-2 … అనూహ్యంగా హిట్ – భారీగానే వసూళ్లు !!
  • Prakash Raj … ‘స్పిరిట్’ నుంచి తరిమేశారు – మరి వారణాసి మాటేమిటి !?
  • ఓడలు బళ్లు – బళ్లు ఓడలు … వెస్టిండీస్ – బంగ్లాదేశ్ మంచి ఉదాహరణ
  • షావుకారు జానకి ! ఆ అన్నపూర్ణ ఎందుకు గుర్తొస్తున్నదీఅంటే !!
  • రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం మోకాలడ్డు – ఎందుకంటే..?!
  • షావుకారు జానకి ! ఒకనాటి దక్షిణ అతిరథులందరికీ కథానాయిక !!
  • టఫ్ కంపిటీషన్ ! అంబానీ మీడియా ఆధిపత్యానికి సోనీ చెక్ !?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions