Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఉస్తాద్… తెలంగాణలో మాట చెల్లుబాటు కాలేదేం నాయకా..?

March 18, 2026 by M S R

.

ఈ వార్త రాసే సమయానికి… ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాకు తెలంగాణలో బెనిఫిట్ షోస్ లేవు, టికెట్ రేట్ హైక్ జీవో గానీ, సర్క్యులర్ గానీ, మెమో గానీ లేవు… జస్ట్, మొన్న ప్రిరిలీజ్ ఫంక్షన్ మాత్రం జరిగింది…

ఏపీలో ఎప్పుడో ఈ సినిమా టికెట్ రేట్ల పెంపు అనుమతి వచ్చేసింది, అడ్డగోలు రేట్లు… సరే, వాళ్లదే ప్రభుత్వం కదా… రాజు తలుచుకుంటే దెబ్బలకేం కొదువ..? మరి తెలంగాణలో ఏమిటి..? ఇక్కడే మళ్లీ ఓ పాత కథ రిపీట్ అవుతోందా..? ఇండస్ట్రీ పెద్ద తలకాయలు తమ స్వార్థం, తమ పంచాయితీలను తెరమీదకు తీసుకువస్తున్నాురా..?

Ads

రాజాసాబ్ సినిమా విషయంలో ఏం జరిగిందో చూశాం కదా… చివరిదాకా సతాయించారు… కానీ చిరంజీవి సినిమాకు మాత్రం వారం రోజుల ముందే రహస్యంగా టికెట్ రేట్స్ హైక్ ఉత్తర్వులు ఇచ్చేశారు… కారణం, రాజాసాబ్ డిస్ట్రిబ్యూటర్ మైత్రి… తనకూ దిల్ రాజుకూ పడటం లేదట…

ఇప్పుడు ఉస్తాద్ భగత్‌సింగ్ నిర్మాత కూడా మైత్రి… సో, తెలంగాణకు సంబంధించి శృతి కుదరలేదు… కానీ మైత్రి నిర్మాత నవీన్ ఏదో కవరింగు, కలరింగు చెప్పుకొచ్చాడు… మామూలు టికెట్ల రేట్లతో ఎన్ని వసూళ్లు వస్తాయో చూద్దామని టికెట్ రేట్లు పెంచలేదట… ఏం సినిమా మనుషులురా బాబూ… జనం నవ్వుతారనే సోయి కూడా లేదు…

మరి పవన్ కల్యాణ్ తను చంద్రబాబు ద్వారా లేదా తనే స్వయంగా రేవంత్ రెడ్డికి ఒక మాట చెప్పలేదా..? దిల్ రాజే అడ్డుపడ్డాడా..? వీటికి నిర్ధారణ ఉండదు… పరిణామాలను బట్టి అర్థం చేసుకోవాల్సిందే… రేవంత్ రెడ్డి మరీ ఒకరిపై ఆధారపడి సినిమాలకు సంబంధించిన నిర్ణయాలు తీసేసుకుంటున్నాడా..? ఎప్పటిలాగే ఇప్పుడూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిమిత్తమాత్రుడేనా..?

మరోవైపు అల్లు సినిమాస్ మరో వింత కథ… ఆసియాలోకెల్లా పెద్ద డాల్బీ లార్జ్ స్క్రీన్‌తో థియేటర్ కట్టారు కదా… ఆ షో టికెట్లు బుకింగ్ ప్లాట్‌ఫారాల మీద కనిపించడం లేదు ఎందుకో మరి.,. ఆ స్క్రీన్‌లో టికెట్లకు మస్తు గిరాకీ ఉంది ఇప్పుడు… ఏకంగా అల్లు అరవిందే స్వయంగా ఆ టికెట్ల వ్యవహారం చూస్తున్నాడట…

నిజానికి దురందర్-2 సినిమాతో పోలిస్తే అసలు ఉస్తాద్‌కు జీరో హైప్… ఏపీలో సిట్యుయేషన్ ఏమిటో గానీ, హైదరాబాదులో మాత్రం అంత జోష్ ఏమీ కనిపించడం లేదు… దానికి పోటీగా ఎందుకు రిలీజ్ చేస్తున్నారో, నిర్మాతల ధైర్యం ఏమిటో తెలియదు గానీ… ‘‘అన్నింటికీ’’ సిద్దపడ్డట్టున్నారు చూడబోతే..!!

ప్రపంచవ్యాప్తంగా 200 నుంచి 225 కోట్ల దాకా వసూలు చేస్తే తప్ప వర్కవుట్ కాదట, 150 కోట్ల దాకా ఖర్చు చేశారట… సినిమా లుక్ గట్రా చూడబోతే హరీష్ శంకర్ దీన్ని మరో గబ్బర్‌సింగ్‌లా తీసినట్టు కొడుతోంది… ప్రిరిలీజు ఫంక్షన్‌కు సంగీత దర్శకులు డీఎస్పీ, థమన్ ఎగ్గొట్టారు… ఏదో తేడా కొడుతోంది బాసూ…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • చందమామ మీదకు వెళ్లడం కాదు… క్షేమంగా తిరిగి రావడమే పే-ద్ద ఘనత…
  • ఈ ‘సీతాకోకచిలుక’ చాన్నాళ్ల తరువాత మళ్లీ తెరపై… అదే నవ్వుతో…
  • లెఫ్ట్, రైట్, సెంట్రల్, రీజనల్… ప్రతి పార్టీ నాదే… లాటరీ మార్టిన్ కథ…
  • భార్య… అల్లుడు… కొడుకు… మరి ‘లాటరీ మామ గారా… మజాకా…’
  • ఈ అభ్యర్థి దగ్గర 19 కిలోల బంగారం… 13 కిలోల వెండి… ఎవరీమె..?
  • విజయ్ పార్టీకి రథసారథి… తను తమిళ ప్రశాంత్ కిషోర్… కింగ్ మేకర్…
  • మహానగరంలో మాయగాడు… 39 ఏళ్లుగా మిస్టరీ వీడని ‘నగల చోరీ’…
  • అసలు సినిమా కథకన్నా… కోట- బాబూమోహన్ కామెడీయే హైలైట్…
  • కేసీయార్ గడీలోకి జీవన్‌రెడ్డి..!? ఓ మానసిక విశ్లేషణ ఇదుగో..!!
  • ఎరుపు లోలాకు కులికెను కులికెను… ఆమె గుర్తుందా మీకు..?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions