.
మహారాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, జాతీయ రాజకీయాల్లో ఒకప్పుడు బాగా వెలిగింది శరద్ పవార్ కుటుంబం… తన పార్టీని, తన పార్టీ గుర్తును, రాజకీయ వారసత్వాన్ని హైజాక్ చేసిన అజిత్ పవార్ ఈరోజు విమాన ప్రమాదంలో దురదృష్టవశాత్తూ మరణించాడు… శరద్ పవార్ ఆల్రెడీ వయోభారంతో డౌనయిపోయాడు…
కొడుకుల్లేరు… మరి ఎన్సీపీ భవిష్యత్తు ఏమిటి..? అసలు ప్రభావశీలమైన ఓ కుటుంబంలో ఓ కీలక నేత మరణిస్తే ఇక ఆ పార్టీ మూతపడినట్టేనా..? వారసులు అందుకుంటారా అనేది ఎప్పుడూ చర్చనీయాంశమైన ప్రశ్నే… మన రాజకీయాల్లో సహజంగానే ఒకరు మరణిస్తే తదుపరి ఎవరు అనే ప్రశ్న ఎప్పుడూ మృతుడి అంత్యక్రియలు కూడా జరగకముందే చర్చల్లోకి వస్తుంది…
Ads
ఇప్పుడూ అంతే.,.. శరద్ పవార్‌కు కొడుకుల్లేరు… తన పెద్దన్నయ్య అనంతరావు పవార్ కొడుకు అజిత్ పవార్‌ను లోకల్‌గా ఎంకరేజ్ చేసి, బిడ్డ సుప్రియా సూలేను పార్లమెంటుకు పంపిస్తున్నాడు ఇన్నేళ్లు… కానీ అజిత్ పవార్ శరద్ పవార్‌తో విభేదించి… బీజేపీ కూటమిలో చేరాడు… అటూ ఇటూ జంపింగులో ప్రసిద్ధుడే…

మరి ఇప్పుడెవరు ఆ పార్టీని లీడ్ చేసేది… ఫస్ట్ కనిపించే మొహం అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్… ఇప్పటికే ఈమె రాజ్యసభ ఎంపీ, రాజకీయాల్లో చురుకు… వీళ్ల స్వస్థలం బారామతి ఏరియాలో సామాజిక సేవలతో పట్టుంది… ఎన్సీపీ మనుగడలో ఈమె పాత్రే కీలకం కానుంది… తెలివైంది కూడా…

తదుపరి పేరు పార్థ్ పవార్… అజిత్ పవార్ కొడుకు… ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నాడు… అజిత్ పవార్ సంపాదనను వ్యాపార మార్గాల్లో పెట్టి డీల్ చేసేది ఇతనే… ఓసారి 2019లో ఎంపీగా పోటిచేశాడు, కానీ ఓడిపోయాడు… అజిత్ పవార్, ఎన్సీపీ రాజకీయ వారసత్వం బహుశా ఇతనిదే… పార్టీ ప్రజాప్రతినిధులు తనకే సపోర్ట్ చేస్తారు… తన తమ్ముడు జయ్ పవార్ ఎక్కువగా బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటాడు, రాజకీయాల్లో పెద్దగా కనిపించడు…

మరో కీలక పేరు రోహిత్ పవార్… ఇతను శరద్ పవార్ సోదరుడు అప్పాసాహెబ్ పవార్ మనమడు… రాజకీయాలు, బిజినెస్ వ్యవహారాల్లో బాగా యాక్టివ్… 2019లో ఎన్సీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు… విద్యావంతుడు…
NCP (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) చీలిపోయినప్పుడు, రోహిత్ పవార్ తన బాబాయ్ అజిత్ పవార్ వైపు వెళ్లకుండా, తాత శరద్ పవార్ వైపు నిలబడ్డాడు… ప్రస్తుతం ‘NCP (శరద్ చంద్ర పవార్)’ వర్గంలో కీలక నేత… రాజకీయాల్లోకి రాకముందు ‘బారామతి ఆగ్రో లిమిటెడ్’ (Baramati Agro Ltd) సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్… ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ISMA) అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు…
సో, సునేత్ర పవార్, ఆమె కొడుకు పార్థ్ పవార్ గనుక ఎన్సీపీని సరిగ్గా లీడ్ చేయకపోతే… మొత్తం పార్టీని ఏకం చేసి, మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారే సత్తా ఈ రోహిత్ పవార్ దగ్గర ఉంది… ఇక సుప్రియా సూలే పిల్లలు అంటారా..? కొడుకు విజయ్ సూలేకు రాజకీయాలపై ఆసక్తి లేదు, క్రీడాకారుడు… అమెరికాలోని ప్రొఫెషనల్ బాస్కెట్‌బాల్ లీగ్ (G League) లో ఆడేందుకు ఎంపికయ్యాడు… అలాగే పూణేలో యువత కోసం బాస్కెట్‌బాల్ అకాడమీని కూడా ప్రారంభించాడు… బిడ్డ రేవతి సూలే తన వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచుతుంది… ఆమె రాజకీయాల్లోకి రాలేదు, ఆసక్తి కూడా ఉన్నట్టు లేదు…
దేశంలో మగ వారస రాజకీయాలే కదా చెలామణీ అయ్యేది... సో, రాబోయే రోజుల్లో పార్థ్ పవార్ లేదా రోహిత్ పవార్... ఎవరో ఒకరే బహుశా ఎన్సీపీని ఏకం చేసి ఏలే అవకాశాలున్నాయి...
Share this Article