.
కాలా హిరణ్ అనే సినిమా… (The Battle For Legacy)… దీనిపై ఢిల్లీ హైకోర్టులో ఓ కేసు… సల్మాన్ ఖాన్ – కృష్ణ జింకల వేట కేసు నేపథ్యంలో ఓ కథ… ఐతే ఇందులో ఓ పాత్ర తన పేరు పెట్టకపోయినా సరే, తన హావభావాలు, తన లుక్కును పోలి ఉండి, ఆ ప్రచార చిత్రాలు, పోస్టర్లు తననే ఫోకస్ చేస్తున్నాయని సల్మాన్ ఖాన్ కోర్టుకెక్కాడు…
ఇది సల్మాన్ ఖాన్ వ్యక్తిత్వ హక్కులకు భంగకరం అని తన లాయర్ల వాదన… సరే, కోర్టు మీ సమాధానం ఏమిటో చెప్పండంటూ నిర్మాతలకు నోటీసులు జారీ చేసింది… ఐతే ఇక్కడ కొన్ని అంశాలు…
Ads
సల్మాన్ ఖాన్ కృష్ణ జింకల వేట నిజం… దానికపై పోలీసు కేసు నిజం… ఏళ్ల తరబడి విచారణ నిజం… పుంఖానుపుంఖాలుగా ప్రింట్, సోషల్, టీవీ మీడియాలో వార్తలు, విశ్లేషణలు నిజం… అవును, ఆ కేసు నేపథ్యంలో అదే సల్మాన్ ఖాన్‌ను పోలిన పాత్రధారితో సినిమా తీస్తే తప్పేమిటి..?
సినిమా నిర్మాతలకు సల్మాన్ ఖాన్ నైజం తెలుసు, అందుకే లీగల్‌గా ఇరుక్కోకుండా ఉండేందుకే ఏదో పేరు పెట్టేసి, ఆ 1998 కేసు చుట్టూ… పబ్లిక్ డొమయిన్‌లో ఉన్న వార్తలు, సమాచారం ఆధారంగానే ఓ కథ రాసుకున్నారు… ఐనాసరే, తనను పోలిన లుక్కు, హావభావాలు తననే ఎత్తిచూపుతున్నాయని, సినిమాను నిలిపివేయాలని సల్మాన్ ఖాన్ వాదన… సో వాట్..? దీన్ని కూడా ఓ వార్తలాగా ఎందుకు చూడకూడదు… మీడియాలో తన ఫోటోలు, వీడియోలు ఎన్ని రాలేదు..?
విచారణ కూడా ఏమీ రహస్యం కాదు కదా, సినిమా కథలు కూడా భావవ్యక్తీకరణలో భాగమే… అది రాజ్యాంగం ఇచ్చిన హక్కే… ఐతే వ్యక్తిత్వ హక్కులేమిటి..? ఇందులో కూడా తనను నిందితుడిగా చూపిస్తే అది తన వ్యక్తిత్వ హక్కులకు విఘాతం అనడమేమిటి..?
మీడియాలో రాజకీయ నాయకులు, సినిమా నటులే కాదు, సెలబ్రిటీల మీద వారినే పోలినట్టు లక్షల కార్టూన్లు వచ్చాయి, టీవీ మీడియాలో కార్టూన్ బొమ్మల్ని పెట్టి మరీ సెటైర్లు వస్తుంటాయి… అది అభిప్రాయ ప్రకటన… కావాలని కించపరిచినట్టు, అబద్ధాల్ని క్రియేట్ చేసి జనంలో పలుచన చేయడానికి గనుక అవి ఉద్దేశిస్తే అవీ చట్టరీత్యా ఆక్షేపణీయం అవుతాయి…
ఈమధ్య చాలామంది తమ మీద ఏ వార్తలూ రావద్దు, రాయవద్దు అంటూ గ్యాగ్ ఆర్డర్లు తెచ్చుకుంటున్నారు కోర్టుల నుంచి… ఈ కాలా హిరణ్ సినిమాపై సల్మాన్ ఖాన్ కేసు కూడా ఆ కోవలోనే కనిపిస్తోంది… కృష్ణ జింకల్ని ప్రేమించే బిష్ణోయ్ తెగ సల్మాన్ ఖాన్‌ను ఏవగించుకోవడమే కాదు, గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సల్మాన్ ఖాన్‌ను ఇదే విషయంలో టార్గెట్ చేశాడనే వార్తలు కూడా ఉన్నవే…
సల్మాన్ ఖాన్ చుట్టూ ఇలాంటి నేరాలు, వివాదాలు, విచారణలు ఉన్నవే… 2002 ఫుట్‌పాత్ మీద నిద్రిస్తున్న వారిపైకి కారు ఎక్కించాడనే కేసు కూడా తీవ్రమైందే… అందులో సెషన్స్ కోర్టు జైలు శిక్ష కూడా విధించింది… హైకోర్టు నిర్దోషి అని చెబితే, దానిపై సర్కారు వేసిన రివ్యూ పిటిషన్ సుప్రీం విచారణలో ఉంది…
సో, వ్యక్తిత్వ హక్కులు ( personality rights ) పరిధిలోకి ఏమేం అంశాలు వస్తాయి, దాని నిర్వచనం ఏమిటో కోర్టు క్లారిటీ ఏం ఇస్తుందో వేచిచూడాలి, ఆసక్తికరం…
Share this Article