Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కావ్య మారన్ హిట్ వికెట్… బ్రాండ్ ఇమేజ్ ఒక్కసారిగా పాతాళంలోకి…

March 16, 2026 by M S R

.

కావ్య మారన్ హిట్ వికెట్… ఈ వాక్యం ప్రస్తుతం సన్‌రైజర్స్ జట్టు ఓనర్ కావ్య మారన్ పరిస్థితికి సరిగ్గా వర్తిస్తుందేమో… తెలుసు కదా, క్రికెెట్‌లో హిట్ వికెట్ అంటే… తనంతట తానుగా (తన బ్యాట్‌తో గానీ లేదా శరీరంతో గానీ) వికెట్లను తగిలి బెయిల్స్ (Bails) కింద పడేస్తే దానిని ‘హిట్ వికెట్’గా పరిగణిస్తారు… సెల్ఫ్ వికెట్ అన్నమాట…

ఒక పాకిస్థానీ బౌలర్ అబ్రార్… తనను ఇండియాలో కాదు, ఇంకెక్కడో జరిగే పోటీలకు తీసుకున్నందుకు గాను సన్‌రైజర్స్‌కు ఎన్నో దెబ్బల మీద దెబ్బలు..? కావ్య మారన్ జట్టుపై జాతీయ స్థాయిలో ఇంకా ఇంకా పెరుగుతున్న ఆగ్రహం… ఇప్పట్లో ఆగేలా లేదు, ఇప్పటికే విపరీతమైన నెగెటివిటీ పెరిగింది ఆమెపై, ఆ జట్టుపై… జరగాల్సినంత డ్యామేజ్ జరిగిపోయింది…

Ads

ఒక ఆటగాడిని కొనుగోలు చేస్తే జట్టుకు బలం పెరగాలి. కానీ ఒక ఆటగాడి ఎంపికతోనే జట్టు బ్రాండ్ కుదేలవుతుందని ఎవరూ ఊహించరు. కానీ ఇప్పుడు అదే పరిస్థితి ఎదుర్కొంటోంది Sunrisers Hyderabad…

పాకిస్థాన్ స్పిన్నర్ Abrar Ahmed ఎంపిక తర్వాత సోషల్ మీడియాలో మొదలైన ఆగ్రహం… ఇప్పుడు పూర్తిస్థాయి ఇమేజ్ సంక్షోభంగా మారుతోంది. ఆ జట్టు కోచ్ డేనియల్ వెటొరి అయితే అబ్రార్ దొరక్కపోతే తారిఖ్‌ను తీసుకుందామని కూడా టచ్‌లోకి వెళ్లాడనే సమాచారం కూడా వస్తోంది… ఈ వివాదం తర్వాత జరిగిన పరిణామాలు ఒక్కొక్కటిగా చూస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందో అర్థమవుతుంది.


మొదట సోషల్ మీడియాలో ఒక్కసారిగా #BoycottSRH ట్రెండ్ మొదలైంది… 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకూ ఈ హ్యాష్‌ట్యాగ్ టాప్ ట్రెండింగ్‌లో కనిపించడం అభిమానుల అసంతృప్తి ఎంత పెద్దదో చూపించింది… అక్కడితో ఆగలేదు. జట్టు అధికారిక సోషల్ మీడియా ఖాతాలపై అభిమానులు పెద్దఎత్తున రిపోర్టులు కొట్టడం మొదలుపెట్టారు. ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీ అధికారిక ఖాతానే టార్గెట్ అవ్వడం అరుదైన పరిణామం… ఓ దశలో రద్దయింది, తరువాత రికవర్ అయినా సరే, జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది.,..

అదే సమయంలో మరో నిశ్శబ్ద నిరసన కూడా జరిగింది. వేలాది మంది అభిమానులు జట్టు సోషల్ మీడియా ఖాతాలను అన్‌ఫాలో చేయడం ప్రారంభించారు. ఏ బ్రాండ్‌కైనా ఇది స్పష్టమైన హెచ్చరిక. స్పష్టమైన అభిశంసన ఇది…

సోషల్ మీడియాలో మొదలైన ఆగ్రహం త్వరగా మీడియాలోకి చేరింది. జట్టు నిర్ణయం, అభిమానుల ఆగ్రహం, బాయ్‌కాట్ పిలుపులు… ఇలా వరుసగా నెగెటివ్ కథనాలు బయటకు రావడం మొదలైంది. ఇంత జరుగుతున్నా జట్టు యాజమాన్యం నుంచి ఒక్క మాట కూడా రాలేదు. ప్రత్యేకంగా Kavya Maran… ఐపీఎల్ జట్లు ఆడుతున్నప్పుడు బాల్ బాల్‌కూ ఆగ్రహం, నిరాశ, నవ్వు గట్రా బోలెడు ఉద్వేగాల్ని ప్రదర్శించే ఆమె ఇంత రాద్ధాంతం జరుగుతున్నా సరే, అసలు వివరణ ఇవ్వడానికి కూడా ప్రయత్నించడం లేదు…

మరింత నెగెటివిటీ పెరుగుతుందనీ, పైగా దేశభక్తితో ముడిపడిన వ్యవహారం కాబట్టి, అదీ పాకిస్థాన్ లింక్డ్ కాబట్టి తమాయించుకుంటున్నదేమో, లేదా నాలుగు రోజుల్లో సమసిపోతుందిలే అనే తేలిక భావన కూడా కావచ్చు… కానీ ఇలా ఇప్పటికీ స్పందించకపోవడం కూడా సోషల్ మీడియాలో మరో పెద్ద చర్చగా మారింది.

ఇమేజ్ సంక్షోభం ఇక్కడితో ఆగలేదు. జట్టు స్పాన్సర్లు కూడా పరిస్థితిని గమనిస్తున్నారన్న వార్తలు బయటకు రావడం మొదలైంది. ఒక ఫ్రాంచైజీ బ్రాండ్‌కు ఇది పెద్ద హెచ్చరిక. జట్టు కోచ్ Daniel Vettori కూడా ఇప్పుడు వివాదం చుట్టూ వచ్చిన చర్చలతో కొత్త ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టే కనిపిస్తోంది. అబ్రార్ ఎంపికతో పాటు ఇతర నిర్ణయాలపైనా ప్రశ్నలు లేవుతున్నాయి.

ఇదిలా ఉండగా పాకిస్థాన్‌కు చెందిన కొంతమంది క్రికెటర్లు Abrar Ahmed కు మద్దతుగా మాట్లాడటం, కావ్యా నీ వెనుక 27 కోట్ల మంది పాకిస్థానీలు ఉన్నారు, కమాన్, గో ఎహెడ్ అన్నట్టు వ్యాఖ్యలు చేశారనే సోషల్ మీడియా పోస్టులతో ఈ వివాదం మరింత పెరిగింది… సోషల్ మీడియాలో వాదోపవాదాలు మరింత తీవ్రమయ్యాయి…

ఇది The Hundred టోర్నమెంట్‌కు సంబంధించిన వివాదం అయినప్పటికీ దాని ప్రభావం మాత్రం నేరుగా
Indian Premier League లోని Sunrisers Hyderabad జట్టుపైనే పడుతోంది. ఈసారి ఐపీఎల్‌లో ఈ జట్టుకు అభిమానుల మద్దతు ఎంతవరకు ఉంటుందన్న ప్రశ్న ఇప్పుడు పెద్దది. ఇన్ని పరిణామాల తర్వాత చివరికి మరో సందేహం ముందుకొచ్చింది.

అసలు Abrar Ahmed ఆ జట్టుకు నిజంగా ఆడతాడా…? లేక ఈ వివాదం చివరికి ఆ నిర్ణయాన్నే మార్చేస్తుందా…? ఆడే చాన్సులు ఫిఫ్టీ ఫిఫ్టీ అంటున్నారు… తను ఆడకపోయినా ఇప్పట్లో బ్రాండ్ ఇమేజీకి జరిగిన డ్యామేజీ పూడేలా లేదు… ఆడితే మరింత డ్యామేజీ తప్పదు… ఒక ఆటగాడి ఎంపికతో మొదలైన కథ…
ఇప్పుడు ఒక ఫ్రాంచైజీ బ్రాండ్ భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తే స్థాయికి చేరింది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • చిన్న భాష సినిమా… పెద్ద సంచలనం … మణిపురి బూంగ్…
  • మధుబాలగా సాయి పల్లవి..? ఆమె జీవితం నిజంగానే ఓ సినిమా కథ! 
  • కావ్య మారన్ హిట్ వికెట్… బ్రాండ్ ఇమేజ్ ఒక్కసారిగా పాతాళంలోకి…
  • జై పాతాళ భైరవీ… గుర్తుతెచ్చుకోవాల్సిన ఓ పేరు… వి.జె.వర్మ ….
  • బఫూన్‌లా కనిపిస్తున్నామా..? సినిమా కంపోజర్ కోటికి మండిపోయింది..!!
  • ఒకప్పుడు హెడింగ్స్ మీద కేర్… వర్తమానంలో పక్కా కేర్‌లెస్…
  • డ్రగ్స్ కేసు… రేవంత్ రెడ్డికి భలే కలిసొచ్చింది… ఎలాగంటే..?
  • మాస్ జాతర..! జబర్దస్త్ ఫార్మాట్‌కు జెమిని మరో కామెడీ వెర్షన్..?
  • వావ్… నటి రాధిక చెప్పిన ఓ సిగ్గు కథ… ఎంత మురిపెంగా ఉందో…
  • 90 ఏళ్ల దాకా మోదీ ఆ కుర్చీ వదలడా..? మరో రెండు టరమ్స్ తనేనా..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions