Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కొంపముంచిన అక్రమ సంబంధం… కటకటాలపాలైన దొంగ జ్యోతిష్కుడు…

February 8, 2026 by M S R

.

జనాన్ని మోసగించడానికి కాషాయం కట్టి, జ్యోతిష్కుడి వేషం వేసినంత మాత్రాన మనిషిలోని అసలు నేరగాడు మారడు… ఒరిజినల్ అలాగే ఉండిపోతాడు… కర్నాటకకు చెందిన ప్రముఖ సెల్ఫ్ డిక్లేర్డ్ జ్యోతిష్యుడు కమలాకర్ భట్ అరెస్ట్ వ్యవహారం ప్రస్తుతం సంచలనంగా మారింది…

1. కమలాకర్ భట్ నేపథ్యం (Background) సామాన్య జీవితం, కమలాకర్ భట్ తొలినాళ్లలో తమలపాకులు, మరమరాలు అమ్ముకుంటూ చాలా సామాన్యంగా ఉండేవాడు… శివమొగ్గ సమీపంలో ఏదో ఊరు తనది…

Ads

ఇలా ఎన్నాళ్లురా అంటూ ఓ స్నేహితుడు ఏదో సందర్భంలో ఏదో సలహా ఇచ్చాడుట… ఆ స్నేహితుడి సలహా మేరకు 2005లో కేరళ వెళ్లి జ్యోతిష్యం నేర్చుకున్నాడని ప్రచారం జరిగింది…  ఆ తర్వాత టీవీ ఛానెళ్లలో రాశి ఫలాలు చెప్పడం ద్వారా పాపులరయ్యాడు…  కర్ణాటక, తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు వచ్చింది… ఇంకేముంది..? భారీగా దందా స్టార్ట్ చేశాడు…

  • ఆస్తులు…: టీవీ కార్యక్రమాల ద్వారా వచ్చిన గుర్తింపును వాడుకుని, భక్తుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తూ వందల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి…

2. అసలు కేసు ఏమిటి? (The Case) ఈ కేసు ప్రధానంగా వివాహేతర సంబంధం, హత్య చుట్టూ తిరుగుతోంది… తన దగ్గర సుచిత్ర అనే వివాహిత ఏజెంట్‌గా పనిచేసేది… ఈ క్రమంలో వారిద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది… సుచిత్ర తన భర్త మహేష్ నాయక్‌ను వదిలేసి బెంగళూరులో కమలాకర్ భట్‌తో కలిసి ఉంటోంది…

  • గొడవకు కారణం…: సుచిత్ర కుమార్తె తన తండ్రి (మహేష్) వద్దకు వెళ్లిపోయింది… తన కుమార్తెను తీసుకురావడానికి సుచిత్ర, కమలాకర్ భట్, అతని శిష్యులు ఉత్తర కన్నడ జిల్లాలోని సిద్దాపురంలో ఉన్న మహేష్ ఇంటికి వెళ్లారు…

  • దాడి, హత్య…: అక్కడ సుచిత్ర భర్త మహేష్‌పై దాడి జరుగుతుండగా, అతనిని కాపాడటానికి వచ్చిన మహేష్ సోదరుడు వసంత్ నాయక్ పై కమలాకర్ భట్, అతని అనుచరులు తీవ్రంగా దాడి చేశారు… ఈ దాడిలో వసంత్ నాయక్ మరణించాడు…

తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని, తన అడ్డు తొలగించుకోవడానికి ఈ భట్టు స్వయంగా గ్యాంగుతో వెళ్లాడని, ఆ దాడిలో మహేష్ సోదరుడు, అనగా  సుచిత్ర మరిది మరణించాడని మీడియా వార్తలు… కానీ పోలీసులు పెట్టిన కేసు వేరు…

కమలాకర్ భట్టు

3. పోలీసుల నేరారోపణలు (Police Charges)

సిద్దాపురం పోలీసులు ఈ కేసులో కమలాకర్ భట్‌ను ప్రధాన నిందితుడిగా (A1) పేర్కొంటూ అరెస్ట్ చేశారు… పోలీసుల విచారణలో తేలిన అంశాలు….

  • హత్య (Murder)…: వసంత్ నాయక్ హత్యకు ప్రధాన సూత్రధారి…

  • హత్యాయత్నం (Attempt to Murder)…: మహేష్ నాయక్‌పై ప్రాణాంతక దాడి…

  • కుట్ర (Conspiracy)…: ప్రణాళికాబద్ధంగా మనుషులను తీసుకువెళ్లి దాడికి పాల్పడటం…

  • అరెస్టులు…: ఈ కేసులో కమలాకర్ భట్, సుచిత్ర, ఆమె తండ్రి లోకనాథ్‌తో పాటు మొత్తం ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేసి కార్వార్ జైలుకు తరలించారు… ఆమె తండ్రి పాత్ర ఏమిటో క్లారిటీ లేదు…

ప్రస్తుతం భట్టుపై విచారణ జరుగుతోంది… ఆధ్యాత్మిక ముసుగులో ఇలాంటి నేరాలకు పాల్పడటం స్థానికంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అతి ‘చిన్న’ జియ్యరుడు..! హిందూ మత సంఘటనకే ఓ పే-ద్ధ ప్రమాదుడు..!!
  • ఆ మంచు గడ్డల్లో … చావుకు ఎదురీదుతూ… బరువులు మోసే కొలువు…
  • కొంపముంచిన అక్రమ సంబంధం… కటకటాలపాలైన దొంగ జ్యోతిష్కుడు…
  • సమాజం, సభ్యత, బాధ్యత – బూతులు, సంస్కారం..!
  • అదుగో పొగ… ఇదుగో బురద… ఫోరెన్సిక్ ల్యాబ్ దగ్థమా..? దహనమా..?
  • AI వ్యూహంలో చిక్కుకున్న భారత్… మిషన్లకు అందని సూర్య మ్యాజిక్..!
  • నిజమే… ఐటీ ప్రపంచంలో ఆంథ్రోపిక్ ఎఐ ప్రకంపనలు షురూ…
  • ప్రశ్న కూడా ఇక్కడ ఓ ప్రార్థనలాంటిదే… భూటాన్‌లో కొన్ని ప్రశ్నలు అడగరు…
  • అసలైన హీరో… రోజర్ మూర్ మనసున్న ‘బాండ్’…
  • ఆసియాలోకెల్లా అత్యంత సంపన్న కార్పొరేషన్ పగ్గాలు… ఎవరీమె..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions