Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కథ, లాజిక్కులు జాన్తా నై …. గరం మసాలాల దట్టింపుతోనే చల్తా…

March 31, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. నాగార్జున ఫ్రెండ్ టబు తెలుగులో నటించిన మొదటి సినిమా 1991 లో వచ్చిన ఈ కూలీ నెం.1 సినిమా . అయితే వెంకటేష్ జోడీగా …!! An excellent romantic comedy entertainer . వెంకటేష్ అయ్యో అయ్యో అయ్యయ్యో అంటూ ప్రేక్షకులకు చక్కటి రిలీఫుని అందిస్తాడు అక్కడక్కడా .

ముందుగా ఈ సినిమా కధను నేసిన పరుచూరి బ్రదర్సును అభినందించాలి . హీరో ఆత్మాభిమానం కల ఓ రైల్వే కూలీ . తాత విజయవాడ రైల్వే స్టేషన్లో మహాత్మాగాంధీ చేత ఆదరించబడటం వలన కూలీ నెం.1 గౌరవాన్ని కూలీలందరు కలిసి ఇస్తారు . అదే ఆ కుటుంబానికి వారసత్వ ఆస్తి .

Ads

హీరోయినుకి బాగా డబ్బు చేయటం వలన పేదల ఎడ తుస్కారం జాస్తి . ఆ క్రమంలో హీరోని అఫెండ్ చేయటం , హీరోని జైల్లో పెట్టించటం , హీరోయిన్ తల్లి హీరోని ఆయుధంగా చేసుకుని కూతురి అహంభావాన్ని తొలగించటం కధకు మూలం .

సీన్ సింగపూరుకి షిఫ్ట్ అయి హీరో గారు కోటీశ్వరుడు అవతారం ఎత్తి హీరోయిన్ని ఆకర్షిస్తాడు . సింగపూర్లోనే పెళ్లి , అక్కడే పెటాకులు కావటం , హీరోయిన్ తల్లి సహకారంతో మొదటి రాత్రి , హీరోయిన్ గర్భవతి కావటం , హీరోయిన్ కుటుంబాన్ని విలనాసురులు కిడ్నాప్ చేయటం , అందరినీ శిక్షించి శుభం పలికించటంతో సినిమా ముగుస్తుంది .

  • మంచి ట్విస్ట్ ఏంటంటే హీరోయిన్ తన అహంతో ఎవరి మరణానికి కారణం అవుతుందో ఆమే తల్లి అని తెలవటం . సినిమాలో తల్లి కూతురిని మోసం చేసి మొదటి రాత్రి జరిపించటం కొందరు ప్రేక్షకులకు జీర్ణం కానిది . సినిమా సాగాలి కదా ! ప్రేక్షకులు కాసేపు రాజీ పడటమే .

మొత్తం మీద సినిమా మంచి ఎంటర్టైనర్ . ఆ క్రెడిట్ ఇళయరాజా , రాఘవేంద్రరావులకు చెందాల్సిందే . ఇళయరాజా సంగీత దర్శకత్వంలో పాటలన్నీ హిట్టే . ముఖ్యంగా దండాలయ్యా ఉండాళ్ళయ్యా అనే వినాయకుని మీద పాట , తిత్రీకరణ బాగుంటాయి . పాట వినాయక చవితో పందిళ్ళలో కూడా వింటుంటాం .

కలయా నిజమా పాటలో మేల్ వాయిస్ ఇళయరాజాది కావటం విశేషం . చిత్రీకరణ గురించి చెప్పాలంటే ఫక్తు రాఘవేంద్రరావు మార్క్ . బాగా హాటుగా ఉంది . సింగపూర్లో డ్యూయెట్లు కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే ఉన్నది , అటెన్షన్ ఎవిరీబడీ నే వస్తున్నా బి రెడీ హుషారుగా ఉంటాయి . అలాగే మరో డ్యూయెట్ కిలకిలమని కళావరి రాణి కూడా .

పాటలనన్నీ సిరివెన్నెల వారు వ్రాయగా బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , చిత్ర , ఇళయరాజా శ్రావ్యంగా పాడారు . పరుచూరి బ్రదర్స్ డైలాగులు బాగుంటాయి . సుందరం , ప్రభుదేవా డాన్సుల్ని బాగా కంపోజ్ చేసారు . ఇవన్నీ సినిమా విజయానికి బాగా తోడ్పడ్డాయి .

ప్రధాన పాత్రల్లో శారద , రావు గోపాలరావు , పరుచూరి వెంకటేశ్వరరావు , “ర” అనే అక్షరాన్ని “ల” గా పలికే పాత్రలో మోహన్ బాబు , బ్రహ్మానందం , మాడా , డబ్బింగ్ జానకి , రజిత , రాళ్ళపల్లి , బాబూమోహన్  ప్రభృతులు నటించారు .

రామానాయుడు నిర్మించిన ఈ హిట్ సినిమా హిందీ , తమిళంలోకి డబ్ అయ్యాయి కూడా . తరచూ ఏదో చానల్లో వస్తూనే ఉంటుంది . టబూ అభిమానులు తప్పక చూడాలి చూసి ఉండకపోతే .

చూసినా మొహమాటపడకుండా ఇంకో సారి చూడండి . వెంకటేష్ అభిమానులు కూడా . సినిమాలను ఎంపిక చేసుకోవటంలో , కెరీర్ని తీర్చిదిద్దుకోవటంలో వెంకటేష్ చాలా సంసారపక్షం . Down to the earth . Genuinely professional …

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాకిస్థాన్ మాజీ ఆర్మీ చీఫ్ బజ్వాకు ఏమైంది..? తల ఎందుకు పగిలింది..?!
  • కాళేశ్వరంపై అభిశంసన సరే… మరి శిక్షించే చర్యలేవి మంత్రివర్యా…
  • కథ, లాజిక్కులు జాన్తా నై …. గరం మసాలాల దట్టింపుతోనే చల్తా…
  • అమెరికా- రష్యా… భలే గేమ్ వీళ్లది…
  • దశావతారం…! కథ కోసం పాత్రలా..? పది పాత్రల కోసం కథా..?!
  • ‘‘మీ ఏడుపే మాకు దీవెన’’… లారీల వెనుక కనిపిస్తుంటుంది కదా… ఇదే…
  • రియల్ లైఫ్‌పై రీల్ లైఫ్ ఇంపాక్ట్…! పాపం, ఓ సినిమా విలన్ కథ…!!
  • ఓటి కుండకు మోత ఎక్కువ- గిల్ట్ నగలకు మెరుపు ఎక్కువ…
  • పాపం సాక్షి..! పాత ఎడిటర్ వ్యాసాలకూ ఇంత నాసిరకం ప్రజెంటేషనా..?
  • పక్షపాతం- పక్షవాతం…! తటస్థ మీడియా ఎక్కడుంది చంద్రబాబూ…?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions