Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పాపం కేటీయార్… తను కూడా ఇలా తయారయ్యాడేంటి..?

May 17, 2026 by M S R

.

నిన్ననే చెప్పుకున్నాం కదా… విజ్ఞత, రాజకీయ జ్ఞానం కలిగిన ప్రతిపక్ష నేతలు ఎవరూ తమ ఓటమికి కుంటిసాకులు వెతకరు అని… సర్ ప్రక్రియ దెబ్బ తీసింది, వోట్లు తీసేశారు, ఈవీఎంలు దెబ్బ తీశాయి, మళ్లీ బ్యాలెట్లకు వెళ్దాం అనే డిమాండ్లకు వెళ్లరు…

ఒక స్టాలిన్… సర్‌నో, ఈవీఎంలనో నిందించలేదు… మా వోట్లు తీసేశారు అనీ సాకులు వెతకలేదు… జనం తీర్పును యాక్సెప్ట్ చేశాడు, తామెక్కడ తప్పు చేశారో ఆత్మమథనం చేసుకుంటోంది డీఎంకే పార్టీ..! ఒక ఒమర్ అబ్దుల్లాను అడగండి, ఈవీఎంలను నిందించడాన్ని కొట్టిపారేశాడు…

Ads

ఒక జగన్… తాజాగా ఒక కేటీయార్ ఈవీఎంలపై నిందలకు దిగుతున్నారు… మరి వీళ్లే కదా, గత ఎన్నికల్లో గెలిచింది, అప్పుడు కూడా ఈవీఎంలే కదా వాడింది… ఈవీఎంలు ఏమైనా కొత్తగా ప్రవేశపెట్టారా..?

కేటీయార్

నిజంగా బీజేపీకి అంత చేతనైతే 2021 లోనే బెంగాల్‌లో మమతను తొక్కేసేవాళ్లు కదా… అంత చేతనైతే గత జనరల్ ఎన్నికల్లో మెజారిటీలోపుకి పడిపోయి, మరీ చివరకు చంద్రబాబు మీద ఆధారపడే దుస్థితికి ఎందుకు చేరుకుంటుంది..? పోనీ, తమిళనాడులో మరీ ఒక స్థానానికి ఎందుకు పరిమితమవుతుంది ఈ ఎన్నికల్లో..?

సో, ఈవీఎంలపై సాకులు, నిందలు పొలిటికల్ అవిజ్ఞత… మరి కేటీయార్‌కు ఎవరు సలహాలు ఇస్తున్నారో గానీ… పాపం అనుకోవాల్సిందే…! ఇప్పుడు జరగాల్సింది ఆత్మమథనం… పార్టీపరంగా ఏం తప్పులు జరిగాయి..? కుటుంబం పరంగా ఏం తప్పులు చోటుచేసుకున్నాయి.,.? జనం ఎందుకు అసహ్యించుకున్నారనే సమీక్ష కదా జరగాల్సింది… అది విడిచి కోట్ల ఖర్చుతో సోషల్ మీడియా  Smear campaign మాత్రమే శరణ్యం అనే బాట కరెక్టేనా..?

ఓకే, జనానికి మొహం చాటేసిన దొరవారు ఎట్టకేలకు  బయటికి వచ్చి సభ్యత్వ సేకరణ, కమిటీల మార్పులు, ప్రక్షాళన అంటున్నాడు… పార్టీ కోణంలో గుడ్… దీనికితోడు గత పాలనకాలంలో జరిగిన తప్పులు, ఘోరాలపై ఆత్మపరిశీలన కదా జరగాల్సింది… అది మరిచిపోయి ఈవీఎంలపై ఎందుకు నిందలు..?

ఈవీఎం బాక్సులలో “గోల్‌మాల్” జరుగుతోంది, అందులోని “మైక్రోచిప్స్” హ్యాకింగ్ లేదా మానిప్యులేషన్‌కు గురవుతున్నాయనే ఆందోళన ఉంది, పెద్ద పెద్ద దేశాలే ఈవీఎంలు వాడటం లేదు, పాత పేపర్ బ్యాలెట్ల పద్ధతికే వెళ్లాల్సిన అవసరం ఉందని నిన్న ఎక్కడో చెప్పుకొచ్చాడు… సర్ మీద కూడా సందేహాలు వ్యక్తం చేశాడు…

కేసీయార్

మరో వార్త కనిపించింది… రేవంత్, మోడీతో అలర్ట్ అని కెేసీయార్ కేడర్‌కు, తన నాయకులకు బోధించాడట… కవితను లైట్ తీసుకోమంటున్నాడు వోకే… కానీ మోడీని లైట్ తీసుకోగలడా..? పోనీ, వచ్చే ఎన్నికల్లో మోడీతో అంటూసొంటూ లేకుండా ఒంటరిగా బరిలో నిలబడతాడా..? అలా తెలంగాణ సమాజానికి హామీ ఇస్తాడా..? సరే, తను మాటమీద నిలబడే కేరక్టర్ ఏమీ కాదు… కానీ ఓసారి మాటవరుసకైనా స్పష్టత ఇస్తాడా..? నెవ్వర్..!

ఎప్పుడైతే జనం మీద అలిగి, జనానికి మొహం చాటేసి, ఫామ్ హౌజులో బందీ అయిపోయాడో… తను ప్రజాజీవితం తాలూకు నైతికతను కోల్పోయాడు… ఇంకా ఇంకా ఈ మాయమాటలు, దాగుడుమూతలు ఏమిటి దొర వారూ..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తను దెయ్యమా..? వామ్మో, నన్నే ఎందుకు పలకరిస్తున్నాడు..?!
  • ప్రతిపక్షం అంటే ఇదీ… ఇటాలియన్ ట్రూ స్పిరిట్ అంటే ఇదీ…
  • ఇంతకీ అతను ఖతం అయిపోయినట్టేనా..? మరి ఇవేం రాజకీయాలు..?!
  • Still గుర్తుండిపోయే ఫోటోగ్రాఫర్… ఆయన పేరే ‘స్టిల్ భూషణ్…
  • Alia Bhatt … ‘Alpha’ మోడల్… ఏ చట్రంలోనూ బందీ కాదు…
  • ఈవీవీ మార్క్ అప‘హాస్యం ట్రాక్… లేటు వయస్సుల రొమాన్స్…
  • పంప్డ్ స్టోరేజీ..! తెలంగాణ పవర్ సెక్టార్‌లో ఓ నిశ్శబ్ద విప్లవం..!
  • పేదల వాహనం..! పల్లె బాటలపై ఈరోజుకూ తోపు టూవీలర్ ఈ మోపెడ్..!
  • సీరియస్ స్టోరీ..! ఈ నేరానికి పేరేమిటి..? అసలు ఇది నేరమేనా..?
  • అయ్యా, నవీన్ బాబూ… ఒక్క ప్రశ్న… ఈ సినిమా ఎందుకు తీసినట్టు..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions