.
ఆమధ్య రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మీద కొందరు చేసిన రాద్ధాంతం తెలుసు కదా… రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్థిరంగా నిలబడటంతో, చివరకు ఏ అవాంతరాలు లేకుండా విగ్రహం నిలబడింది… తెలుగువాళ్లు… కాదు కాదు… తెలంగాణ వాళ్లు బాలును గౌరవించుకున్నారు…
ఏళ్లుగా అనేక సందర్భాల్లో తమిళనాడే తనను ఓన్ చేసుకుంది… మరి తాజాగా..? ఈ వార్త చదవండి, మిత్రుడు Rochish Mon రాసిన వార్త…
Ads
ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ – కేరళలో
—————–
భారతదేశంలోనే అత్యంత ప్రతిభావంతమైన సినిమా గాయకుడు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం విగ్రహం నిన్న (31, మార్చ్) వీ.టి. భట్టత్తిరిపాడ్ కల్చరల్ కాంప్లెక్స్, పాలక్కాడ్ లో ఆవిష్కారం అయింది. సంగీత దర్శకుడు కీరవాణి విగ్రహావిష్కరణ చేశారు.
మలయాళ సినిమా గాయకుల సంఘం (Samam), మనోరమ పత్రిక సంయుక్తంగా ఈ విగ్రహావిష్కరణ కార్యాన్ని సాకారం చేశాయి. అంతే కాకుండా ఎస్.పీ.బీ. స్మారక ఉద్యానవనాన్ని గాయకుడు హరిహరన్, గాయని చిత్ర ప్రారంభించారు.
మలయాళంలో ఎస్.పీ.బీ. చాల తక్కువ సంఖ్యలో పాడారు. అయినా ఎస్.పీ.బీ.కి అక్కడ ఈ మర్యాద పెద్ద ఎత్తున జరిగింది!
మరి మన తెలుగులో…?
హైదరాబాదులో ఎస్.పీ.బీ. విగ్రహ ప్రతిష్ఠాపన విషయంగా జరిగిన రచ్చ తెలుగు జాతికి మాయని మచ్చ. ఆ రచ్చ చేసిన వాళ్లు, ఆ రచ్చను సమర్థించిన వాళ్ల విజ్ఞత ఈ మలయాళీల ఎదుట ఎంత?
తెలుగులో ఉన్న ప్రాంతీయ, కుల ఉన్మాదం ఇంకో చోట లేవు… ఎందుకని?
బాలు మలయాళీ కాదు. అయినా ఆయన గొప్ప గాయకుడు కాబట్టి ఆయనకు ఈ మన్నన కేరళలో జరిగింది. ఈ సంఘటనకు తమిళ్షులు కూడా మురిసిపోతున్నారు! మరి మన తెలుగు వాళ్లు…?
మన తెలుగు మేధ ఇంకా ఘంటసాల బావిలో నివాసం చేస్తోంది; తెలుగు జాతి కులం, ప్రాంతీయత ఉన్మాదంలో పొర్లాడుతోంది. చీ…చీ…
తెలుగులోలా ఇతర ప్రాంతాల్లో కళకు కులం, ప్రాంతీయత లేవు. తెలుగులో ఉన్న కులం, ప్రాంతీయత ఉన్మాదులు ఇదిగో ఇలాంటి వాటిని చూశాకైనా సిగ్గు తెచ్చుకుని మామూలు మనుషులవగలరా?
ఎస్.పీ.బీ. గానంపై, గాత్రంపై ఇకనైనా తమిళ్ష్, కన్నడం, మలయాళం భాషల వాళ్లలా తెలుగు వాళ్లకూ తెలివిడి రావాలి.
ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణం – కేరళలో మన తెలుగు కళాకారుడికి జరిగిన పెను మర్యాద; పెను మన్నన.
ఘంటసాల బావి లోంచి బయటకు వచ్చి మనం మన బాలును సముచిత రీతిలో స్మరించుకోవడానికి ఇంకా ఎన్ని యుగాలు పడుతుంది? కులం, ప్రాంతీయత ఉన్మాదాన్ని వదిలించుకుని మనం ఇతరుల్లా బాలును పరిగణించడానికి ఇంకా ఎన్ని శతాబ్దుల కాలం అవసరం అవుతుంది?
రోచిష్మాన్
9444012279
Share this Article