Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తెలంగాణకు భిన్నంగా జగన్ పోరుబాట… కేసీయార్‌కు అస్సలు కనబడదు…

February 9, 2026 by M S R

.

జగన్… పక్కా తెలంగాణ వ్యతిరేకి… తెలంగాణ ఏర్పాటును మనసావాచాకర్మణా తీవ్రంగా వ్యతిరేకించిన నాయకుడు… సమైక్యవాది… చివరకు తెలంగాణ నుంచి తన పార్టీనే ఎత్తిపారేసి ఆంధ్రాకు తరలిపోయిన పొలిటిషయన్… ఉండేది మాత్రం తెలంగాణలోనే…!

మరోవైపు… కేసీయార్ వీర తెలంగాణవాది… తన కార్యక్షేత్రం, తన ఆత్మ తెలంగాణ… తన మూలాలు ఆంధ్రా కావచ్చుగాక, కానీ దశాబ్దాలుగా తెలంగాణే…!

Ads

ఇవి రెండూ పరస్పర భిన్న ధృవాలు… కానీ జాన్ జిగ్రీలు… అధికారంలోకి వచ్చాక ఒకరికొకరు… ఇద్దరూ కలిసి భారీ కాళేశ్వరం వంటి దుమ్ముగూడెం లిఫ్టూ కట్టాలనుకున్నారు… కానీ ఎక్కడో భారీ తేడా కొట్టింది… వాళ్లు తమ ఉభయతారక అవసరాల కోసం కౌగిలించుకుంటారు… ఆహ్వానాలు, భోజనాలు, మంతనాలు… అవసరాల చుట్టరికాలు…

జగన్ గెలవడానికి కేసీయార్ ఫోన్ ట్యాపింగ్ ఉపయోగించి… చంద్రబాబు కదలికలను నియంత్రించి, డబ్బు తరలింపులను అడ్డుకుని, హైదరాబాద్ నుంచి నిధుల ప్రవాహాన్ని అడ్డుకుని ఎంతో సహాయపడ్డాడు అంటారు… అంత జిగ్రీ… జగన్ అంటే అంత ప్రాణం కేసీయార్‌కు…

జగన్ తెలంగాణ వ్యతిరేక రాయలసీమ లిఫ్టు కడితే, పోతిరెడ్డిపాడు పొక్క వెడల్పు చేస్తే… కేసీయార్ చూస్తూ ఊరుకున్నాడు… కిక్కుమనలేదు… తెలంగాణ ప్రయోజనాలు ఏమైపోతేనేం, నా జగన్ ఏది చేసినా టేక్ ఇట్ ఫర్ గ్రాంట్ అనుకున్నాడు… అలా ఎన్నో…

కానీ… జనానికి నచ్చలేదు… తిరస్కరించారు… ఇద్దరినీ ఇంటికి పంపించేశారు… ఐనా ఆ స్నేహం ఆగదు… దొందూ దొందే… అధికారం పోగానే జగన్‌కు అర్జెంటుగా రాయలసీమ ప్రయోజనాలు గుర్తొచ్చాయి… తన హయాంలోనే కదా, ఆ లిఫ్టు ఆగింది… కానీ ఇప్పుడు దాన్ని వెంటనే ప్రారంభించకపోతే సీమ ఏమైపోవాలి అంటూ వైసీపీ ఆధ్వర్యంలో రెండు రోజుల క్రితం కర్నూలులో ఒక సభ నిర్వహించారు…

ఈ పథకం 2020లో జగన్మోహన్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే ఆగిపోతే, ఆ తర్వాత నాలుగేళ్లపాటు అధికారంలో ఉన్నప్పటికీ జగన్‌రెడ్డి దాని గురించి పట్టించుకోలేదు… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ భాషలో చెప్పాలంటే… ‘‘ఆ కుటుంబం కోసం పనిచేసే కొంత మంది రాయలసీమ మోతుబరులు స్వరాలు సవరించుకుంటున్నారు… సీమకు అన్యాయం చేస్తారా? అంటూ గొంతు విప్పే పనిలో ఉన్నారు…’’

  • రాధాకృష్ణ ఇంకా ఏమంటాడంటే..? ‘‘జగన్‌రెడ్డి కోసం రాయలసీమకు చెందిన మోతుబరులే కాకుండా తెలంగాణకు చెందిన బీఆర్‌ఎస్‌ కూడా పనిచేస్తుంటుంది… అందుకే వైసీపీ నిర్వహించిన పోరుబాట గురించి భారత రాష్ట్రసమితి పట్టించుకోలేదు… తెలంగాణకు ద్రోహం చేయాలనుకోవడం ఏమిటి? అని జగన్‌రెడ్డిని నిలదీయలేదు… తెలుగుదేశం పార్టీ లేదా మరో పార్టీ ఈ పని చేసి ఉంటే బీఆర్‌ఎస్‌ నాయకులు నోటికి పనిచెప్పేవారు… కేసీఆర్‌ పత్రికలో గుండెలు బాదుకొనేవారు…

వైసీపీ నిర్వహించిన సభ గురించి కేసీఆర్‌ పత్రికలో ఒక్క వార్త కూడా రాయలేదు… ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఏ కార్యక్రమాన్ని చేపట్టినా తెలంగాణ ఎడిషన్‌లో కూడా ప్రముఖంగా ప్రచురించే జగన్‌రెడ్డి సాక్షి మీడియాలో కూడా ఈ వార్త కనిపించలేదు… అంటే ఆంధ్రప్రదేశ్‌లో తాము చేసే రాజకీయాల వల్ల తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు ఇబ్బంది కలగకూడదు అని జగన్‌ అండ్‌ కో భావిస్తున్నారన్నమాట..!

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌రెడ్డి తన రాజకీయ ప్రయోజనం కోసం చేపట్టే కార్యక్రమాలను కేసీఆర్‌ సొంత మీడియా కప్పిపెడుతోంది… అంటే తెలంగాణ ప్రయోజనాల కన్నా జగన్‌రెడ్డి ప్రయోజనాలే కేసీఆర్‌ అండ్‌ కోకు ముఖ్యమని అర్థమవుతోంది…’’

కేవలం చంద్రబాబు ప్రతిపాదించే గోదావరి- బనకచర్ల మీద మాత్రం ఈ క్యాంపు యాగీ చేస్తుంటుంది… తెలంగాణ ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం బనకచర్ల లేదా నల్లమలసాగర్‌కు అడ్డుపడుతున్నా సరే, కేసీయార్ అండ్ కో ఏదో రచ్చ చేస్తూనే ఉంటుంది… అఫ్‌కోర్స్, అది ఖచ్చితంగా తెలంగాణ ప్రయోజనాలకు విఘాతమే...

ఈ రెండు పార్టీలకూ చెందిన సోషల్‌ మీడియా విభాగాలు కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాయి… ఆంధ్ర ప్రదేశ్‌లో జగన్‌రెడ్డికి మద్దతుగా బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కార్యకర్తలు రంగంలోకి దిగుతున్నారు… తెలంగాణలో కేసీఆర్‌కు కష్టం వస్తే వైసీపీ సోషల్‌ మీడియా రక్షణగా నిలబడుతోంది… రాజకీయ ప్రత్యర్థులపై ఉమ్మడిగా దాడి చేస్తున్నారు…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మాతృదేవోభవ..! రాజయితేనేం… సన్యాసి ఐతేనేం… ఈ అమ్మకు కొడుకే కదా…
  • తెలంగాణకు భిన్నంగా జగన్ పోరుబాట… కేసీయార్‌కు అస్సలు కనబడదు…
  • అమెరికాతో ట్రేడ్ డీల్..! అమెరికాయే దిగొచ్చింది… ఇవీ నిజాలు…
  • రాజు కాని రాజు రేచర్ల రుద్రుడు… అనితర సాధ్యుడు… రామప్ప ఆద్యుడు…
  • నాటి తెలంగాణ జీవిత చిత్రణ… ఏటికేతంబట్టి ఎయి పుట్లు పండించి…
  • తల్లిగర్బంలోనే జ్ఞానబోధ..! ప్రభుత్వ దవాఖానాల్లో ‘గర్భసంస్కార్’..!
  • అతి ‘చిన్న’ జియ్యరుడు..! హిందూ మత సంఘటనకే ఓ పే-ద్ధ ప్రమాదుడు..!!
  • ఆ మంచు గడ్డల్లో … చావుకు ఎదురీదుతూ… బరువులు మోసే కొలువు…
  • కొంపముంచిన అక్రమ సంబంధం… కటకటాలపాలైన దొంగ జ్యోతిష్కుడు…
  • సమాజం, సభ్యత, బాధ్యత – బూతులు, సంస్కారం..!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions