Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సోషల్ మీడియా డర్టీ క్యాంపెయిన్‌లో రేవంత్ ఫెయిల్… కేసీయార్ డిస్టింక్షన్…

January 29, 2026 by M S R

.

నేరం చేసినవాడు మామూలు మనిషి అయితే కథ వేరు… తనను బోనులో నిలబెట్టే తీరు వేరు….. కానీ రాజకీయాల తీరు వేరు కదా… బోనులో నిలబెట్టడానికి కూడా ప్రొటోకాల్ ఉంటుంది… మరి తప్పుచేసినవాడికి ఈ మర్యాదలు ఏమిటీ అంటారా..? అదే కదా మన దేశ దౌర్భాగ్యం…

సరే, ఏడ్చేవాళ్లు ఏడ్వనీ… అది దరిద్రం బ్యాచ్… విషయం ఏమిటంటే..? తెలంగాణ రాజకీయాల్లో అత్యంత నీచ్, నికృష్ట్, కమీన్ ఎపిసోడ్ ఫోన్ ట్యాపింగు కథ తెలిసిందే కదా… బయటికి ఏం చెప్పినా సరే, సూత్రధారి, పాత్రధారి, మూలవిరాట్టు కేసీయారే కదా… ఈ దేశం మునుపెన్నడూ ఎరుగని కేరక్టర్ కదా…

Ads

రేవంత్ రెడ్డి ఎందుకు, ఏం భయపడుతున్నాడో, ఎందుకు చేతకావడం లేదో తెలియదు గానీ… పోనీ, కేసీయార్ అంటే లోలోపల బాగా తీవ్ర గాఢ పాత అభిమానం ఉందేమో తెలియదు గానీ… అత్యంత నీచమైన ఫోన్ ట్యాపింగ్ నేరానికి ప్రధాన సూత్రధారి, పాత్రధారి కేసీయార్‌కు ఇంటికి వెళ్లి మరీ నోటీసులు ఇస్తుందట సిట్…

(కేసీయార్ రహస్య స్నేహితుడు మోడీకి కోపం వస్తుందనే భయం ఉందా మోడీ మరో దోస్త్ రేవంత్ రెడ్డికి..?)

వీలయితే అక్కడే విచారణ చేస్తుందట…. పొరపాటున, తెలంగాణ దురదృష్టం కొద్దీ మళ్లీ కేసీయార్ పాలన……….. సారీ, తనదేముందిలే… తన నోరు మూసి, మూయించి, ఎప్పటిలాగే కేటీయార్ పాలన వస్తుందని భయపడ్డారో ఏమో… ఫాపం, తెలంగాణ ప్రభుత్వం…

(ఐనా కేసీయార్‌ను క్షమించేశాం, బారా ఖూన్ మాఫీ అని శ్రీమాన్ రేవంత్ రెడ్డి చెప్పొచ్చు కదా… భయమా, భక్తా… భయంతో కూడిన భక్తి వల్ల కలిగిన గౌరవమా..?)

kcr

ఇటు హరీష్ రావు, అటు కేటీయార్ పెయిడ్ బ్యాచులన్నీ రేవంత్ రెడ్డి మీద టన్నుల కొద్దీ బురద జల్లుతుంటాయి… కడుక్కోవడానికే రేవంత్ రెడ్డి అండ్ టీమ్‌కు టైమ్ సరిపోవడం లేదు…

మరో మంత్రి గానీ, మరో ఎమ్మెల్యే గానీ పట్టించుకోడు… మంత్రులందరికీ సోషల్ మీడియా టీమ్స్ ఉన్నాయి, ఖర్చు ఉంది… కానీ తెలంగాణ కాంగ్రెస్‌కు ఫాయిదా లేదు, సరైన కౌంటర్లూ లేవు… ఫాఫం… బీఆర్ఎస్ చెత్తా సోషల్ మీడియా ఆర్గనైజేషన్ల ఖర్చులో రేవంత్ రెడ్డి టీమ్స్ ఖర్చు ఫాఫం… ఓ ఆకుకూ ఓ పోకకూ సరిపోదు…

సరే, ఏ కేసయితేనేం..? నిందితుడి రేంజ్ ఏమైతేనేం..? వ్యవస్థ, చట్టం, న్యాయం సాగిలబడాలా..? అన్ని మరిచిపోయినట్టు నటిస్తూ… ఫామ్ హౌజులో బతుకుతుంటే చట్టం ఉపేక్షించాలా..?

  • అసలు ఇక్కడ కేసీయార్ తప్పు కాదు… సోకాల్డ్ తన కొడుకు, తన మేనల్లుడు, తన షడ్డకుడి కొడుకు పెంచి పోషించే సోషల్ మీడియా టీమ్స్ ఏది చెబితే అదే చెలామణీ కావాలా..? చివరకు రేవంత్ రెడ్డి కూడా పడిపోయాడా.,? ఫాఫం కాంగ్రెస్ సోషల్ మీడియా… రేవంత్ రెడ్డికి ఈ కోణంలో ఏ సోయీ లేనట్టుంది ఫాఫం…

అప్పట్లో ఎవరో .... కాంగ్రెస్ పార్టీకి సునీల్ కనుగోలు అనే టీమ్ పేరు విన్నట్టు గుర్తు... ఎందుకు ఫాఫం మరీ వెనుకబడిపోయింది..? ఈ సోషల్ మీడియా చెత్తా సమరంలో ఫాఫం... వెనుకబడి, మరీ చేతులెత్తేసిందా..? అయిందానికీ కానిదానికీ గాయిగత్తర చేసే సోకాల్డ్ బీఆర్ఎస్ సోషల్ గ్యాంగులు, మరీ ప్రత్యేకించి టీన్యూస్, నమస్తే వంటి చెత్తా మీడియా రేవంత్ రెడ్డి మీద అప్పర్ హ్యాంగ్ సాధించినట్టేనా..?!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాకిస్థాన్‌లో రాముడి కొడుకు లవ కుమారుడి ఆలయ పునరుద్ధరణ..!!
  • సోషల్ మీడియా డర్టీ క్యాంపెయిన్‌లో రేవంత్ ఫెయిల్… కేసీయార్ డిస్టింక్షన్…
  • పక్కపక్కనే మూడు ప్రేమ కథలు… విషాద ముగింపులు వేర్వేరు…
  • ఎయిర్ బస్సా… ఎర్ర బస్సా…! ఓ ఇంట్రస్టింగ్ వార్త ఏదో తేడా కొడుతోంది..!!
  • ఒక పోలీసమ్మ… దాడులకు వెళ్లి… కాసేపు ఓ బిడ్డకు అమ్మయింది..!!
  • వెరీ మిస్టీరియస్ ప్రొఫైల్…! ఆమెకు తెలిసిన విద్యల పేర్లూ విచిత్రమే..!!
  • శృతి ద్వివేది..! లేడీ వేణుస్వామి..! అజిత్ మృతిని ముందే చెప్పింది..!!
  • ఎన్సీపీ, శరద్ పవార్ కుటుంబ తదుపరి రాజకీయ వారసుడు ఎవరు..?
  • గళ మాధుర్యం..! నడత, నడక అన్నీ విశేషమే… అరుదైన కేరక్టర్ అర్జీత్…
  • ‘ముసలి సమాజాలు’… రష్యా, చైనా, జపాన్ బాటలో తెలుగు రాష్ట్రాల అడుగులు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions