.
ఒకటి మాత్రం నిజం… కొరియన్ కనకరాజు అనే సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ గుర్తొచ్చే ఓ డైలాగ్ ఉందని సినిమా చూసినవాళ్లకే థియేటర్ నుంచి బయటికి వచ్చాక కూడా గుర్తులేదు… ఇప్పుడు దీనిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ వార్ మొదలయ్యాక, ఓహో, ఆ డైలాగ్ వెనుక ఇంత కథ ఉందా అని ఆశ్చర్యపోతున్నారు… అరెరె, సరిగ్గా గమనించలేదే అనుకుంటున్నారు… వివాదం పుణ్యమాని సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ వస్తోంది…
అటు తిరిగి, ఇటు తిరిగి నాగబాబే ఈ డైలాగ్ పెట్టించాడని ఆరోపణలు కూడా చేస్తున్నారు ఇప్పుడు… ఇంతకీ ఆ డైలాగ్ కథేమిటీ అంటారా..?
Ads
డైలాగ్ ఏమిటి… సీనియర్ ఎన్టీఆర్ నటించిన పాత చిత్రం ‘యుగపురుషుడు’ సినిమాలో ఒక ఫైటింగ్ సన్నివేశంలో ఆయన “మీ స్ట్రోక్ చాలా అమెచ్యూరీష్ (Amateurish) గా ఉంది.. ఇదివరకు ఎప్పుడైనా ఫైట్ చేశారా?” అని ఎదుటి వ్యక్తితో అంటాడు.

సినిమాలో ఎలా వాడుకున్నారు…: ‘కొరియన్ కనకరాజు’ చిత్రంలో ఒక కొరియన్ ఫైటర్ చేతిలో దెబ్బలు తిన్న కమెడియన్ సత్య, తేరుకుని అదే మేనరిజంతో “నీ స్ట్రోక్స్ చాలా ఇమెచ్యూరిష్‌గా ఉన్నాయి” అంటూ సీనియర్ ఎన్టీఆర్‌ను ఇమిటేట్ చేస్తూ ఈ డైలాగ్ చెబుతాడు.
https://www.facebook.com/reel/1044542178220561
వివాదానికి కారణం… సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందు నుంచే సోషల్ మీడియాలో ఎన్టీఆర్ నటించిన ఆ పాత సినిమా క్లిప్ మీమ్స్ రూపంలో వైరల్ కావడం, సినిమా విడుదలైన తర్వాత సరిగ్గా అదే సీన్‌ను కమెడియన్ సత్యతో పేరడీ చేయించడంతో నందమూరి అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగు చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ దిగ్గజ నటుడిని కించపరిచేలా ఈ సన్నివేశం ఉందని, కావాలనే ప్రమోషన్ కోసం ఈ మీమ్స్‌ను క్రియేట్ చేయించి సినిమాలో వాడారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
ఈ వివాదంపై హీరో వరుణ్ తేజ్ స్పందిస్తూ.. తాము ఎన్టీఆర్‌ను ఎక్కడా అవమానించలేదని, కేవలం ఆయనను ఇమిటేట్ చేశామని (పేరడీ మాత్రమేనని), ఈ సన్నివేశాన్ని చాలా నెలల క్రితమే (గతేడాది నవంబరులో) షూట్ చేశామని క్లారిటీ ఇచ్చాడు…
సరదా కోసం ఇతర సీనియర్ నటుల్ని కూడా ఇమిటేట్ చేశాడే తప్ప సత్య ఎవరినీ అవమానించలేదని చెప్పుకొచ్చాడు… నిజానికి అది సీనియర్ ఎన్టీఆర్‌ను అమానించినట్టుగా కూడా ఏమీ లేదు… ఇందులో మరీ నాగబాబు ఏదో కుట్ర చేసి ఆ సీన్ పెట్టించాడు అన్నట్టుగా కూడా లేదు…
కూటమిలో టీడీపీ, జనసేన భాగస్వాములు… అలాంటప్పుడు కావాలని ఈ సీన్ పెట్టేందుకు ఎందుకు ప్రయత్నిస్తాడు నాగబాబు… ఎన్టీఆర్‌ను అవమానించాల్సిన అవసరం కూడా ఏముంటుంది ఇప్పుడు..? బట్ అఫ్‌కోర్స్, తన చేష్టలు, తన మాటలు ఎవరికీ అర్థం కావు కొన్నిసార్లు !!
ఇది ట్రోలింగ్ శకం… అన్నట్టు; ఏదో స్వామివారి గెటప్ మీద కూడా అఖండ అని విమర్శలు వస్తున్నాయి… ట్రోలింగుకు కాదేదీ అనర్హం !!
Share this Article