Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పదేళ్లు వెనక్కి పోతారట… నమ్మితే పదేళ్లు ముందుకు వెళ్లిపోతారు…

February 20, 2026 by M S R

.

ఏదో రీల్… పక్కా దుర్మార్గమైన ఓ యూట్యాబ్ చానెళ్ల నెట్‌వర్క్‌కు సంబంధించిన వీడియో… చాలా తెలివైన యాంకరిణి… పేర్లు వద్దులెండి… చాలా కథలున్నాయి… డబ్బు, డబ్బు, డబ్బు… అదే గబ్బు… కానీ ఆ రీల్‌లో మెడికల్ ఎడ్యుకేషన్ పేరిట, అత్యంత తెలివిగా తమ ప్రొడక్ట్స్‌ను మార్కెెటింగ్ చేసుకుంటున్న తీరు పరమ నీచం అనిపించింది…

ఐ డోన్ట్ కేర్… వాళ్ల మనోభావాలు, మనీభావాలు దెబ్బతిన్నా సరే… చెప్పుకుందాం… సోషల్ మీడియాలో వచ్చే మెడికల్ చిట్కాల్లో 99 శాతం ఫేక్… అవి పాటిస్తే తక్షణ పరలోకమే…. ఆ చానెళ్లకు మాత్రం కాసుల పంటే… సరే, ఇక అసలు వార్తలోకి వెళ్దాం…

Ads

కొల్లాజెన్ ఫ్యుయల్… ఈ పౌడర్ లేదా ఈ జ్యూస్ రోజుకొకటి సాచెట్ తాగేసేయండి, జస్ట్ 2 నెలల్లో మీరు 10 ఏళ్లు వెనక్కిపోతారు అని ప్రచారం… పక్కా దుర్మార్గం… ఎందుకంటే పక్కా మోసం, మన ప్రభుత్వాలకు వాళ్లను ఫిక్స్ చేసి, యాంకరిణులను, సదరు చానెళ్ల వోనర్లను, ప్రచారం చేసే ఫేక్ డాక్టర్లను లోపలేసి కుమ్మేసే వ్యవస్థ మనకు లేదు గనుక…

కొల్లాజెన్

కొల్లాజెన్ డ్రింక్స్: 10 ఏళ్ల యవ్వనం సాధ్యమేనా?  విపరీతమైన ధర… అడ్డగోలు ఖర్చు… కానీ ఉపయోగకరమేనా..? ఆబ్జెక్టివ్‌గా చెప్పుకుందాం…

  • వాస్తవం…: కొల్లాజెన్ అనేది శరీరానికి అవసరమైన ప్రోటీన్ అన్నది నిజమే… కానీ అది తాగగానే నేరుగా వెళ్లి చర్మానికి అతుక్కోదు… కడుపులోకి వెళ్ళాక అది అమినో యాసిడ్స్‌గా విడిపోతుంది…

  • మాయ…: 10 ఏళ్లు వెనక్కి వెళ్లడం అనేది ఒక మార్కెటింగ్ గిమ్మిక్… రోజూ ఒక ఉడకబెట్టిన గుడ్డు, విటమిన్-సి కోసం ఒక నిమ్మకాయ లేదా జామకాయ తింటే లభించే పోషకాలనే ఇలా ఖరీదైన ప్యాకెట్లలో అమ్ముతున్నాయి….

  • నిజం… రోజూ ఒక ఉడకబెట్టిన కోడిగుడ్డు తినండి, లేదా పప్పు… ఓ జామకాయ తినండి… ఆ వేల రూపాయల కొల్లాజెన్ డ్రింక్స్‌కు కొన్ని రెట్ల ప్రయోజనం… పైగా కొల్లాజెన్ వయస్సును వెనక్కి మళ్లించదు, నాన్సెన్స్…

  • చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది… కీళ్ల మృదులాస్థి అరగడాన్ని నెమ్మదిస్తుంది… ఇమ్యూనిటీ సరేసరి… అంతకుమించి మీ యవ్వనంలోకి తీసుకుపోతుందని నమ్మితే మీ పర్సుకే బొక్క… బీకేర్‌ఫుల్… సోషల్ మీడియాలో…. పరమ దుర్మార్గమైన తెలుగు యూట్యూబ్ చానెళ్ల నెట్‌వర్క్ మాయలో పడకండి…

వేలకువేలు ఖర్చు పెట్టి ఇలాంటి ప్రొడక్ట్స్‌ను….. ఎవరో యాంకరిణి, ఎవరో ఫేక్ న్యూట్రిషనిస్టు, ఎవరో ఫేక్ డాక్టర్, ఏదో ప్రజావ్యతిరేక యూట్యూబ్ రీల్స్ నమ్మి… ఏది పడితే అది తాగేయకండి… పదేళ్లు వెనక్కి వెళ్లడం కాదు, పదేళ్లు ముందుకు పోయి హరీమంటారు జాగ్రత్త..!!

ఈ దరిద్రులు వాళ్ల మార్కెటింగ్ కోసం డబ్బులు పెట్టి మరీ ఫేస్‌బుక్‌లో, ఇతర సోషల్ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రమోట్ చేస్తున్నారు..!!! వందల కోట్లు సంపాదిస్తున్నారు కదా యూట్యూబ్ ఆర్సెనిక్ నెట్‌వర్క్‌తో… ఐనా ఈ పెంటలో పైసలు అవసరమా వీళ్లకు..?!

కొల్లాజెన్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పదేళ్లు వెనక్కి పోతారట… నమ్మితే పదేళ్లు ముందుకు వెళ్లిపోతారు…
  • అయ్యో భగవంతుడా… ఆ ముగ్గురినీ పెంచి పోషించేదెలా మాస్టారూ…
  • సర్వపిండి..! చివరకు దీన్ని కూడా భ్రష్టుపట్టించేస్తున్నారు… నిజం..!!
  • ఓ మాజీ జర్నలిస్టు… వెంట నడిచిన ఓ ఆటోడ్రైవర్… ఇదీ ఇంట్రస్టింగు కథే…
  • వామ్మో, ఏం కి‘లేడీ’ ప్లాన్ వేసిందిర భయ్… పాపం, ఆ భర్త బతికిపోయాడు…
  • ఉస్మాన్ తారీఖ్… కంట్రవర్సీ బౌలర్… కానీ నాణేనికి మరోవైపు ఏంటంటే…
  • యాటిట్యూడ్‌కే అమ్మ..! వాణిశ్రీ అంటే అప్పట్లో ఓ సినీ శివగామి..!!
  • ‘‘కల్వర్టు కిందకు లాక్కెళ్లి, దుస్తులు విప్పి… అత్యాచారయత్నమే కాదంటే…?’’
  • ఈ శృతి కథ మీ కథేనా … చదవండి, ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంది…
  • తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిజంగా సిగ్గుపడాల్సిన ఓ వైఫల్యం..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions