Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కోమటిరెడ్డి, జీవన్‌రెడ్డి… తెలంగాణ కాంగ్రెస్‌లో తాటాకు చప్పుళ్లు…

March 18, 2026 by M S R

.

అయ్యో, అయ్యో, జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వదిలేస్తున్నాడట… అంతటి సిన్సియర్, సీనియర్ నాయకుడినే ఫోఫొమ్మంటోందట కాంగ్రెస్, దుర్మార్గం, అన్యాయం, దారుణం అని బోలెడు పోస్టులు, కథనాలు, విమర్శలు, విశ్లేషణలు కనిపిస్తున్నాయి… అసలు జీవన్‌రెడ్డికి (73) కూడా లేనంత బాధను పింక్ క్యాంప్ అనుభవిస్తోంది పాపం…

నిజానికి ఆయన పుట్టు కాంగ్రెస్ ఏమీ కాదు… 1983లోనే తెలుగుదేశం, ఎన్టీయార్ కెేబినెట్‌లో మంత్రి… తనకు వెన్నుపోటు పొడిచిన నాదెండ్ల కేబినెట్‌లో కూడా మంత్రి… తరువాత కాంగ్రెస్… సో, పుట్టు కాంగ్రెస్ కాదు, తన రాజకీయ చరిత్ర ఆ పార్టీ పట్ల కమిటెడ్ కూడా కాదు… ఈలెక్కన కాంగ్రెస్ నుంచి వెళ్లిపోబడిన పొన్నాల లక్ష్మయ్య (82) మొదటి నుంచీ కాంగ్రెస్… ఓ రోజు వస్తుంది, ఏదో సమీకరణంలో… బయటికి వెళ్లిపోయే పరిస్థితి…

Ads

(జీవన‌రెడ్డి మొదట్లో జనసంఘ్… తరువాత నక్సల్స్ అనుకూలవాది… టీడీపీ (ఎన్టీయార్)… నాదెండ్ల వర్గం… తరువాత కాంగ్రెస్… రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కావద్దని పోరాడాడు… మొదటి నుంచీ రేవంత్ రెడ్డి వ్యతిరేకమే…)

సరే, జీవన్‌‌రెడ్డి పోవాలనుకున్నా బీజేపీలో ఒక్కరోజు కూడా ఇమడలేడు… అదే ఉమ్మడి జిల్లా ఈటల రాజేందర్ సిట్యుయేషన్ చూస్తున్నాం కదా… ఇక మిగిలింది, తను కూడా కాంగ్రెస్‌లాగే మారిపోయిన బీఆర్ఎస్‌లో చేరడం తప్ప తనకు అన్యథా శరణం నాస్తి… ఇది కాంగ్రెస్, కొత్త నీరు వస్తూనే ఉంటుంది, పాత నీరు పక్కకు తొలిగిపోతూనే ఉంటుంది… ఎమోషన్‌తో బెదిరిస్తే కుదరదు, బలంగా నిలబడితేనే కాంగ్రెస్‌లో ఈ పాత నీరు నిలబడుతుంది, లేదంటే ఏ బీఆర్ఎస్‌ పార్టలోనికో కొట్టుకుపోతుంది…

ఇదంతా వదిలేస్తే, కొన్నాళ్లుగా కాంగ్రెస్‌లో ఓ రాజకీయ కలకలం… కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి ఓ డజను మంది ఎమ్మెల్యేలను ‘అసమ్మతి మీటింగు’కు పిలిచాడట… 9 మంది హాజరయ్యారట.,.. ఇంకేముంది..? రేవంత్ రెడ్డి కుర్చీ గల్లంతు అనే స్థాయిలో పింక్ క్యాంప్ ప్రచారాలు…

కాంగ్రెస్ ఓ పే-ద్ద సముద్రం, రాజగోపాలరెడ్డికి మంత్రి పదవిపై ఆశలుండటంలో తప్పులేదు… ఉండకపోతేనే తప్పు… సో, సీఎం మీద ప్రెజర్ టాక్టిక్స్ ప్రయోగించడాన్ని కూడా తప్పుపట్టలేం, అదంతా రాజకీయం… కాదు, రాజకీయం అంటేనే అది… కానీ రకరకాల ఈక్వేషన్స్ కుదరాలి… ఎలాగంటే… అదే జిల్లా నుంచి ఆల్రెడీ ఇద్దరు మంత్రులున్నారు, ఆ ఇద్దరూ రెడ్లు… పైగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయానా రాజగోపాల రెడ్డి బ్రదర్…

ఒక కుటుంబానికి ఒకే పదవి అనే ఓ సిస్టం పెట్టుకుంది కాంగ్రెస్… సరే, మినహాయింపులు ఉండవని కాదు, చల్తా… కానీ మిగతా సామాజికవర్గాలకు జవాబు చెప్పుకోల్సిన స్థితిలో పడిపోతుంది కాంగ్రెస్… అదీ చిక్కు ప్రశ్న… అన్నట్టు రాజగోపాల రెడ్డి కూడా ప్యూర్, కమిటెడ్ కాంగ్రెస్‌వాది ఏమీ కాదు, ఆమధ్య బీజేపీని కొన్నాళ్లు ఉద్దరించినవాడే…

ఇంకొంచెం లోతుగా వెళ్దాం… ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ నాయకుడిగా ఓ దశలో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించాడు వైఎస్ఆర్… కారణాలు ఏమైనా సరే ఎఐసీసీని కూడా శాసించాడు అనేకాంశాల్లో… ఐనా సరే, కాంగ్రెస్ అంటే కాంగ్రెసే కదా… పాల్వాయి, ఉప్పునూతల, వెంకటస్వామి, మధు యాష్కి, హన్మంతరావు, ఎంఎస్ఆర్, ధర్మపురి, హర్షకుమార్… ఇలా అనేకమంది వైఎస్ వ్యతిరేక గళాలు ఎత్తినవారే… గొణిగినవారే, వరుస ఫిర్యాదులు చేసినవారే… బట్ నో యూజ్… అంతటి వైఎస్‌కే తాటాకు చప్పుళ్లు తప్పలేదు… కానీ..?

ఇప్పుడు రేవంత్ రెడ్డి… మెల్లిమెల్లిగా కాదు, వేగంగా, బలంగా పాతుకుపోతున్నాడు… వర్తమాన రియాలిటీ ఏమిటంటే… ఏవో అరకొర ఫేక్ ప్రచారాలే తప్ప ఎఐసీసీ తనను వదులుకోలేదు… అటు కర్నాటకలో కూడా కాంగ్రెస్ దెబ్బతినిపోతున్న సూచనల నేపథ్యంలో… జాతీయ కాంగ్రెస్ పార్టీకి అన్నిరకాలుగా తెలంగాణ కాంగ్రెస్ అలియాస్ రేవంత్ రెడ్డే దిక్కు… ఒక రాజగోపాలరెడ్డి కోసం అది వొంగిపోదు, లొంగిపోదు… అంతెందుకు రాజగోపాలరెడ్డి బ్రదరే తనను సమర్థించడు…

మొదట్లో రేవంత్ రెడ్డి అర్జెంటుగా కుర్చీ దింపేద్దాం అనుకున్న పెద్ద నాయకులే… రోజులు బాగాలేవు అనుకుని సైలెంటయిపోయారు… అలాంటి స్థితిలో ఓ మంత్రి పదవి పంచాయితీలో ముఖ్యమంత్రికి ఎసరు పెట్టే గ్రహణకాలం కాదు, గణాంకాల కాలం కూడా కాదు ఇది… సరే, ఒకవేళ రాజగోపాలరెడ్డికి కూడా పొరపాటునో, గ్రహపాటునో మంత్రి పదవి ఇచ్చారనుకుందాం… పర్ సపోజ్…

సో, వాట్..? ఇది అనైతికం, దారుణం అని విమర్శించే సీన్ బీఆర్ఎస్‌కు ఉందా..? పక్కా వెయ్యి శాతం కుటుంబ పార్టీ, కుటుంబ పాలన కదా… హరీష్ రావు, కేటీయార్, కేసీయార్, సంతోష్, కవిత… సీఎం, యాక్టింగ్ సీఎం, డిఫాక్టో సీఎం, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు… అంతా వాళ్లే కదా… ఇప్పుడంటే ఆడబిడ్డను గోసపెడుతున్నారు గానీ…

సో, కుటుంబ పాలన, ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి అనే మాటలు బీఆర్ఎస్‌లో తప్పులు కావు, తప్పేదీ కాదు… సో, రాజగోపాలరెడ్డి ప్రెజర్ పనిచేసినా, అది పెద్దగా కొంపలు మునిగే యవ్వారమేమీ కాదు, కాంగ్రెస్‌కు నష్టం చేసేదీ కాదు… అసలు ఇలాంటి సీక్రెట్ భేటీలు లేకపోతేనే అది కాంగ్రెస్ కాదని లెక్క… అదీ అసలు సంగతి… కాంగ్రెస్ మే సబ్ చల్తా..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • 100 కోట్ల శ్రీదేవి చెన్నై ఆస్తిపై… జాన్వి, ఖుషీ కపూర్ ఇంట్రస్టింగ్ ఫైట్..!!
  • కోమటిరెడ్డి, జీవన్‌రెడ్డి… తెలంగాణ కాంగ్రెస్‌లో తాటాకు చప్పుళ్లు…
  • వాడెవడో ఏదో కూశాడట..! రాహుల్ గాంధీ డప్పు కొడుతున్నాడు..! ప్చ్, పిటీ..!!
  • హవ్వ మంగ్లీ..? నీ నోట ఈ బూతు పాటేంటి..? యూట్యూబ్‌లో మాయం..!!
  • భద్రాచలానికి ఇక కొత్త కళ… కేసీయార్ నిర్లక్ష్యానికి రేవంత్ దిద్దుబాటు…
  • ఈ సినిమాలో అందరికన్నా మెచ్చుకోవలసింది సత్యనారాయణనే
  • సాయం కోరుతూ కన్నీళ్లు, విన్నపాలు… ఇదోరకం మోసం, జాగ్రత్త…
  • ఆస్కార్ జ్యూరీని ఎందుకు ఈ సినిమా అంతగా ఇంప్రెస్ చేసింది..?!
  • పాత కేసీయార్ ఫ్యాన్… ధాటిగా ఆ పొలిటికల్ అనైతికతపై ప్రశ్నలు…
  • దిష్టి వ్యాఖ్యలు, వెక్కిరింపుల్ని తొక్కిపడేస్తూ… తెలంగాణ పరుగులు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions