Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అసెంబ్లీ నక్సలైట్..! ముందస్తు జాగ్రత్తగా ఉపా కేసు వర్తిస్తుందా యువరానర్..!!

April 5, 2026 by M S R

.

రేవంత్ రెడ్డి చాలా బిజీ కాబట్టి తన నోటీసుకు వచ్చిందో లేదో తెలియదు… తన టీమ్‌కు కూడా బహుశా ఈ పాడి కౌశిక్ రెడ్డి అడదరిమి పోకడలు, వ్యాఖ్యల తీవ్రత కూడా అర్థమై ఉండదు… ఏమో, తెలంగాణ డీజీపీ కూడా చూసి ఉండడు… అన్నింటికీ మించి, అర్జెంటుగా… లొంగుబాట్లు నచ్చక, ప్రాణాలు పోయినా సరే అని ఇంకా అడవుల్లో మగ్గుతున్న, కాలం చెల్లిన సిద్ధాంత తుపాకులు కూడా చదివి ఉండరు…

పాడి కౌశిక్ రెడ్డి..! నో, నో, మీరు చదివిన పేరు కరెక్టే… బండ్ల గణేష్ కాదు, కేఏ పాల్ కూడా కాదు… మానుకోట జగన్ రాళ్ల దాడి బాధిత కార్యకర్త దగ్గర నుంచి… వోటేయకపోతే చస్తాంరా అని బెదిరించిన కేరక్టర్ దగ్గర నుంచి… కరీంనగర్ సీపీని మతం పేరుతో తూలనాడిన సంఘటన నుంచి… ఏకంగా అసెంబ్లీలోనే అత్యంత సీనియర్ దళిత ఎమ్మెల్యే కడియంను వెక్కిరించిన దాకా… తెలంగాణ ప్రజాస్వామిక వ్యవస్థ సిగ్గుపడాల్సిన చరిత్ర.,.

Ads

అవును, ఇలాంటివాళ్లే కదా, ది గ్రేట్ కేసీయార్‌కు, కేటీయార్‌కు, హరీష్‌రావుకు కావల్సింది… కాలర్ ఎగరేస్తూ ఉన్నారేమో, కౌశిక్ తమ పార్టీలో ఉన్నందుకు..! గర్వపడండి… ఎందుకంటే..? తనను అసెంబ్లీ నక్సలైట్ అంటున్నారట అందరూ… అవున్నిజమే, నేనూ అసెంబ్లీ నక్సలైట్ అవుతాను అంటున్నాడు… అసలు అసెంబ్లీ నక్సలైట్ అంటే ఏమిటి..? అదేమైనా విశేష ఘనతా..? తెలంగాణ స్పీకర్ స్పందించాలి ఓసారి… రేవంత్ రెడ్డి స్పందించకపోయినా సరే, స్పీకర్ అసెంబ్లీ విశిష్టత, పవిత్రత దృష్ట్యా స్పందించాలి…

పాడి

గతంలో మోహన్‌బాబు సినిమా వచ్చింది, అసెంబ్లీ రౌడీ అని..! అప్పట్లో ఆ పదం మీద బోలెడంత విమర్శ… ఇప్పుడు అసెంబ్లీ నక్సలైట్… ఎవ్వడూ మాట్లాడడు… అసలు మావోయిస్టు ఉద్యమమే కొడిగట్టి, పెద్ద పెద్ద తోపు నక్సలైట్లే అన్నీ విడిచేసి, బంగారంతో, డబ్బుతో, తుపాకులతో ‘రాజ్యం’ ఎదుట సరెండర్ అవుతున్న రోజులివి… ప్రజెంట్ జనరేషన్ కూడా ‘ఇక చాల్లే’ అని ఈసడించుకున్న కాలమిది…

అలాంటిది ఓ ప్రజాప్రతినిధి నేను అసెంబ్లీ నక్సలైట్ అవుతాను అంటుంటే… అంతులేని ఫ్రస్ట్రేషన్‌లో, విచక్షణ, విజ్ఞత మరిచి రోజులీడుస్తున్న ఒక కేటీయార్, ఒక హరీష్‌కు ఒడలు పులకరిస్తున్నాయేమో… స్వీయ బందీఖానాలో ఉన్న మాజీ జననేత కేసీయార్‌ ఉబ్బితబ్బిబ్బు అవుతున్నాడేమో… కానీ సోకాల్డ్ ‘రాజ్యం’ ఎందుకు స్పందించడం లేదు…

ఆనందిస్తోందా..? అవునూ… ఇలాంటి ‘ముందస్తు నక్సల్ జీవితం’ మీద హెచ్చరికలు జారీ చేసేవాళ్ల మీద ‘ఉపా’ కేసులు ఏమైనా పెట్టే వీలుందా..? బీఆర్ఎస్ రహస్య దోస్తీ గురువు అమిత్ షా చెప్పాలి… ఏమో… మేం లొంగిపోలేదు, కేవలం అరెస్టయ్యాం అని సన్నాయి నొక్కులు నొక్కుతున్న ఆత్మవంచన నక్సలైట్లు కొంపదీసి అసెంబ్లీ నక్సలైట్లను వాడుకుని… ఏమైనా నక్సలిజాన్ని ఉద్దరించే ప్రమాదం ఉందా..? గణపతి టచ్‌లో లేడు కదా..!!

అవునూ… నేను నక్సలైట్ అవుతాననే తోటి సభ్యుడి వ్యాఖ్యల మీద హరీష్ రావు స్పందన ఏమిటో..? తెలంగాణలో చీమచిటుక్కుమన్నా స్పందిస్తుంటాడు కదా… కౌశికుడి వ్యాఖ్యల పట్ల కాలర్ ఎగరేస్తున్నాడా..? పాపం, కేటీయార్, కేసీయార్‌లను వదిలేయండి… ఇప్పుడు బీఆర్ఎస్ అంటే జస్ట్ హరీష్ రావు మాత్రమే కదా..!! కొంపదీసి కౌశిక్ మానసిక ధోరణిని, వ్యాఖ్యలను సమర్థిస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను అనడు కదా హరీషుడు..!! బీఆర్ఎస్ ఈ ఘన భుజకీర్తుల పట్ల ఉబ్బితబ్బిబ్బు కావడం లేదు కదా..!!



  • అయ్యా, శ్రీమాన్ రేవంత్ సాబ్… నక్సలైట్ల శకం ముగింపు గడువు ముగిసిపోయింది… ఈ కొత్త తరహా నక్సలైట్లపై మీ విధానం ఏమిటో ప్రకటించండి…
  • అయ్యా, బీజేపీ రామచంద్రరావూ… పాత ఉస్మానియా రోజుల్ని యాద్ చేసుకుని స్పందించాలి తమరు… అటూ ఇటూ గాకుండా… మరీ కిషన్ రెడ్డిలాగా గులాబీ దోస్తులాగా గాకుండా…
  • చివరగా…. కొండగట్టు పాదయాత్ర కాళ్లనొప్పులు తగ్గితే… మీ హుజూరాబాద్ ఇష్యూయే బండి సంజయ్ భాయ్… ఈ అసెంబ్లీ నక్సలైట్ అట ఏమంటావు..? తనలాగే పాత విప్లవ భావజాలికుడు ఈటలకే వదిలేస్తానంటావా..!!
  • అఫ్‌కోర్స్, కూనంనేని, తమ్మినేనిలను వదిలేయండి… ఓ దిక్కూదివాణం, దిశదశ లేని ఎర్ర ప్రస్థాన సారథులు పాపం..!!


 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అసెంబ్లీ నక్సలైట్..! ముందస్తు జాగ్రత్తగా ఉపా కేసు వర్తిస్తుందా యువరానర్..!!
  • అన్నదాత చెమట చుక్కకు తెలుసు మెతుకు విలువ… అవమానించకండి…
  • గాలికదుపు లేదు- కడలికంతు లేదు… ప్రతి పదంలోనూ మార్మిక భావన…
  • జంట నెలవంకలుండే నింగి ఉంటుందేమో…. ‘అలాంటి పిల్ల’ దొరకదు…
  • గురువును కేజ్రీ వదిలేశాడు… కేజ్రీని మిగతా నేతలు వదిలేస్తున్నారు…
  • కాళేశ్వరం చిక్కుముళ్లు..! సీఎం పే-ద్ద కొరడా పట్టుకుంటేనే ‘రిపేర్లు’..!!
  • ‘ఇమేజ్ మేనేజ్‌మెంట్’… కోహ్లీ భారీ బ్రాండ్ వాల్యూ రక్షణకు ప్రయాస..!
  • అన్నామలై తగ్గలేదు… తగ్గించబడ్డాడు… నిర్బంధ విరామంలోకి నెట్టబడ్డాడు…
  • అనుకోని ఆఫర్… అమితాబ్‌కు ఆకాశానికి తీసుకుపోయింది…
  • ఏమో… కేసీయార్‌ను కూడా ఇలా చూస్తామేమో… డెస్టినీ వదలదు…!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions