Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తన జన్మస్థలి- తన రాజధాని ఖిలాషాపూర్… అక్కడ తన కోట…

August 19, 2026 by M S R

.

సర్వాయి పాపన్న… నిన్న సచివాలయం సమీపంలో తన విగ్రహావిష్కరణ జరిగింది… ఒక కల్లు గీత కార్మికుడు సగర్వంగా తలెత్తుకున్నాడు… జనం విగ్రహాలు నెలకొల్పి స్మరించుకోవాల్సింది రాజులు, రాచబంట్లను కాదు, ప్రజలు నాలుగు కాలాలపాటు పాటలు పాడుకున్న చేతనా వ్యక్తులు- పోరాట శక్తులను అని రేవంత్ రెడ్డి చాటిచెప్పాడు, గుడ్…

ఓ చిన్న ముచ్చట చెప్పుకుందాం… యాదకొస్తోంది… 1998, 99 ప్రాంతం… అప్పట్లో మా చేర్యాల నియోజకవర్గంలోనిదే… ఖిలాషాపూర్… అక్కడ ఓ చిన్న కోట… అది సర్వాయి పాపన్న అడ్డా, రాజధాని… పాపన్న జన్మస్థలి అది… నేనప్పుడు వరంగల్ ఈనాడు జిల్లా రిపోర్టర్‌ను… (ఆ కోట ఉంది కాబట్టే అది ఖిలాషాపూర్ అయ్యింది)…

Ads

ఆ ఖిలాషాపూర్ మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య…, మాజీ ఐపీఎస్, ఏపీపీఎస్సీ చైర్మన్ పేర్వారం రాములు, కవి- రచయిత, తెలుగు యూనివర్శిటీ మాజీ వీసీ పేర్వారం జగన్నాథం జన్మస్థలి కూడా… ఆ మట్టి విశిష్టమైనది…

అప్పుడు పొన్నాల లక్ష్మయ్య జనగామ ఎమ్మెల్యే… పొద్దున్నే కాల్ చేసి, ఖిలాషాపూర్ వస్తావా అనడిగాడు… కారణం అడిగితే, వచ్చెయ్, అక్కడే చెబుతాను అన్నాడు చనువుగా… వెళ్లాను… వెళ్లేసరికి అక్కడ పేర్వారం రాములు కూడా ఉన్నాడు… నాకు జగన్నాథంతో పరిచయం లేదు… రాములు అప్పుడు ఏసీబీ హెడ్…

ఏదైనా వార్త దొరుకుతుంది అని కదిలిస్తే, మనం ఇక్కడ కలిసింది వేరే పర్పస్ కోసం, అవన్నీ వదిలెయ్ అన్నాడు తనూ చనువుగా… సర్వాయి పాపన్న తొలి విగ్రహ ఆవిష్కరణ ఆరోజు… బాగా చేశారు ప్రోగ్రామ్… ఊరు బలంగా స్మరించుకుంది తనను, ఆ మట్టి బిడ్డే కదా…

సర్వాయి పాపన్న

తరువాత భోజనం చేస్తున్నప్పుడు లక్ష్మయ్య, రాములు ఇద్దరినీ ఓ ప్రశ్న అడిగాను… వార్త కోసం కాదు, జస్ట్, లైక్ దట్… ‘‘నువ్వు మాజీ మంత్రివి, అంటే అధికారంలో ఉన్నవాడివి, ఇప్పుడూ చట్టం- రాజ్యంగం పరిధిలో మాత్రమే పనిచేయాల్సిన ప్రజాప్రతినిధివి, అఫ్‌కోర్స్, రాములు సార్, ఏకంగా ఓ పోలీసు విభాగానికే హెడ్, తిరుగుబాట్లను, విప్లవాల్ని అణిచేసే వర్గంలో కీలక స్థానం…

మరి ఓ తిరుగుబాటుదారుగా, అప్పటి నవాబులు ఓ బందిపోటుగా చిత్రించిన వ్యక్తి విగ్రహాన్ని మీరే ఆవిష్కరించడం కంట్రాస్టుగా అనిపించడం లేదా..?’’ ఇదీ నా ప్రశ్న.., అప్పటికే పీపుల్స్‌వార్ ఆ ఏరియాలో విస్తరించింది… రాములు సమాధానం నాకు బాగా నచ్చింది…

సర్వాయి పాపన్న

  • ‘‘అప్పట్లో తమపై ఎవరు తిరగబడ్డా సరే బందిపోటు అని, దొంగ అని ముద్ర వేయడం పాలకులకు అలవాటే… ఐనంత మాత్రాన తను దొంగ అయిపోడు, అదే అసలు చరిత్ర అయిపోదు… ప్రజలు చెప్పుకుంటారు నిజమైన చరిత్రను, అదీ అసలు సత్యం… తను సొంత విలాసాల కోసం ఎవరినీ కొల్లగొట్టలేదు, తనకంటూ సైన్యాన్ని కూడా సమకూర్చుకుని తిరగబడ్డాడు, సాహసి, వీరుడు… తన తొలి విగ్రహాన్ని, అదీ మా ఊరి పోరుబిడ్డ విగ్రహాన్ని ఆవిష్కరించడంకన్నా మాకు సంతోషం ఏముంటుంది..?’’

ఇన్నేళ్ల తరువాత రాజ్యం ఆ తిరుగుబాటుదారుడి అసలు చరిత్రను గుర్తించింది, విగ్రహాన్ని ఏర్పాటు చేసి, గౌరవించింది… నిన్న ఆరోజు వచ్చింది !!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తన జన్మస్థలి- తన రాజధాని ఖిలాషాపూర్… అక్కడ తన కోట…
  • రేవంత్ నేరాలు- ఓ నిశిత విశ్లేషణ ! ఈ సంఖ్య కేసీయార్ వేధింపుల పుణ్యమే !!
  • పెదరాయుడు రజినీకాంత్ ! అత్యంత సహృదయ స్నేహశీలి !
  • ఫేక్ న్యూస్‌పై కేంద్ర ప్రభుత్వం ‘యుద్ధం’ ప్రారంభించింది !
  • ఓ ప్రియురాలి వేదన – ఈ ఒక్క పాటతో గుల్జార్ వెనక్కి చూసుకోలేదు ఇక !!
  • తడి తడిమే ఓ ఆర్ద్రగీతం- కర్కశ హృదయుల కళ్లూ చెమర్చాల్సిందే
  • మంత్రి క్షమాపణ ! ఇది స్వీయ అభిశంసన !! అయ్యో, పొంగులేటి !!
  • ధ్రువ… ఆ రీల్ అపరిచితుడి కొడుకేనా ఈ రియల్ అపరిచితుడు..?!
  • ఛిన్న మస్తాదేవి ! ఓ స్టేజ్ షో ప్రదర్శనపై రచ్చ ! అసలేం జరిగిందంటే !!
  • ఫాఫం తెలంగాణ బీజేపీ ! హైకమాండ్ గాలికి వదిలేసినట్టుగా ఉంది !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions