Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చేతుల విరిచి కట్టి, గడ్డిమోపులు చుట్టూ పేర్చి… కాలబెట్టారు…

March 14, 2026 by M S R

.

‘ముచ్చట’ వాల్ మీద కసబ్ కళ్ళలోకి చూస్తూ… అనే పోస్ట్ చదివాకా ఒకటి గుర్తుకువచ్చింది. తెలంగాణా సాయుధ పోరాటం దేవరుప్పుల కేంద్రంగా సాగుతున్న రోజులు అవి… రజాకార్లు ఊరు మీద పడి విచ్చలవిడిగా దాడులు చేస్తున్నారు.

ఊళ్ళో ఎనిమిది మందిని ముందుగా పట్టుకొని… ఎనుకట ఎడ్లబండి ఎడ్లను అదిలించేందుకు తోలు బెల్టు కట్టిన వార్పటల్ తో ఇల్లిల్లూ  తిరిగి, మరో పది మందిని పట్టుకొని, బయటకు లాక్కొచ్చి, కొడుతూ ఊరంతా తిప్పారు. ఊరంతా బిక్కచచ్చి పోయింది.

Ads

రజాకార్ల భయంకర అరుపులు, బాధితుల అర్తనాదాలతో వూరు పానాలు అరచేతిలో పెట్టుకుంది. వీరందరిని ఇప్పుడున్న దేవరుప్పుల చిన్నబడి దగ్గర గడ్డివాముల్లో వీరిని కాళ్ళు చేతులు కట్టి కూర్చోపెట్టి, గడ్డిమోపులు వేసి నిప్పుపెట్టారు. పైశాచిక ఆనందంతో రజాకార్లు ఉరంతా నినాదాలు చేస్తూ తిరుగుతూ పాత శివాలయం దగ్గరకు వస్తుండగా.. ఒక వృద్ధురాలు తెగించింది.

ఇంకెంతమంది పుస్తెలు తెగుతాయో అని భయంతో గంపెడు ధైర్యంతో వీరికి ఎదురేగింది. ఏమే ముసలిదానా.. పోవాలని ఉందా అని ఒకడు తుపాకీ ఎక్కుపెట్టాడు. భయపడని ఆ ధీశాలి ‘‘ఓ బిడ్డా కొంప మునుగుతుంది. కడెండి (ఇప్పటి కడవెండి) నుంచి అన్నల దళం (కమ్యూనిస్టులు) వస్తున్నదట.. ఊళ్ళోకాంచి తొందరగా ఉరుకుండ్రి… ఉత్త పుణ్యానికి పానాలు పోగొట్టుకోకండి. మీ దండం పెడుతా.. ఉరుకుండ్రి.. అని గుండెలు బాదుకుంటూ దొంగ ఏడ్పుతో చెప్పిందట.

జరిపిన ఘోరకలి తరువాత ఈ ఏడ్పుతో ఒక్కసారిగా సోయి వచ్చిన రజాకార్లు.. ఆమె చెప్పే మాట నిజమనుకుని వూరు వదిలి హడావుడిగా పారిపోయారట. లేకపోతే ఇంకెంత మందిని ఇలా బలిగొనేవాళ్లో… ఇది నిజంగా జరిగిన సంఘటనగా ఊరు ఈరోజుకూ చెప్పుకుంటుంది.

##ఇందుకు సంబంధించి… గడ్డివాములో సజీవదహనమైన వారి పేర్ల శిలాఫలకం ఫోటో ఇదుగో…  వుప్పల రమేష్ శర్మ (దేవరుప్పల) 

దేవరుప్పల

  • (ముచ్చటలో ‘కసబ్ కళ్లలోకి చూస్తూ… అనే కథనం కసబ్ గ్యాంగ్ పైశాచిక దాడి వేళ… 20 మంది గర్భిణులను, ఆ కడుపుల్లో పిల్లల్ని కాపాడిన అంజలి కుల్తే అనే నర్సు గురించి…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • చేతుల విరిచి కట్టి, గడ్డిమోపులు చుట్టూ పేర్చి… కాలబెట్టారు…
  • శుష్క రాజకీయ మూసీ వ్యూహాలకు… అసలు నిజాల వెల్లడితో సీఎం అడ్డుకట్ట…
  • శృంగేరీ పీఠం ఉత్తరాధికారి నకిలీ శంకరాచార్యుడా..? ఏంటీ రచ్చ..?!
  • శివధర్‌రెడ్డి దగ్గర తుపాకీ లేదా..? దాంట్లో బుల్లెట్లు లేవా మాజీ కామ్రేడ్ దేవ్‌జీ..?
  • ఎంజీఆర్‌పై ఉచ్చ భాష… మన తెలుగుతనంలోనే ఏదో తేడా ఉన్నట్టుంది…
  • శెట్టి గ్యాంగ్… ఎనిమిదేళ్లు దాటినా రష్మికపై అదే కక్ష… అదే వేధింపులు…
  • ఆహా..! నిన్న కేసు, జైలు… సీన్ కట్ చేస్తే… నేడు హాలీవుడ్ ఆశీస్సులు..!!
  • ప్రధాన ఎన్నికల కమిషనర్‌‌కు అభిశంసన… ఇండి కూటమి వృథా ప్రయాస…
  • …. చివరకు దాసరితో కూడా యముడి వేషం వేయించేశారు…
  • ‘‘మీరు శివం దూబె కదా… అయ్యో, నో, నో, అందరూ అలాగే పొరబడతారు సర్’’

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions