Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

గణపతి సైతం..! మావోయిస్ట్ పార్టీ చివరి వికెట్ కూడా త్వరలోనే..!!

February 25, 2026 by M S R

.

తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఆయన టీమ్ ఇక మావోయిస్ట్ పార్టీ చివరి వికెట్ పడగొట్టే పనిలో ఉంది… దాదాపు ఆ వికెట్ ఆల్రెడీ పడిపోయినట్టే అని తెలుస్తోంది… ఆ వికెట్ పేరు ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి…

ఇతర రాష్ట్రాల పోలీసులతో పోలిస్తే తెలంగాణ పోలీసులు మావోయిస్టుల లొంగుబాట్లకు సంబంధించి భిన్నంగా, మానవతా దృక్పథంతో వ్యవహరిస్తున్నారు… దొరికెితే ఖతం చేయడం కాదు, వాళ్లలో నమ్మకాన్ని కలిగించి, వాళ్లకు నచ్చజెప్పి మెయిన్ స్ట్రీమ్‌లోకి తీసుకువచ్చే ‘ఆపరేషన్ ఆమ్నెస్టీ’ ఇక ముగింపుకొచ్చింది…

Ads

లొంగిపోయాక కూడా వాళ్ల గౌరవప్రద జీవనానికి తగిన సాయం (ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, హాస్పిటళ్లలో చికిత్స ఎట్సెట్రా) చేస్తున్న తెలంగాణ పోలీసుల మీద మావోయిస్టుల్లో నమ్మకం పెరగడంతో… ఇక కీలక కేడర్ కూడా ఇక్కడే లొంగిపోతోంది… ఎస్, గణపతికి కూడా ఇక్కడ లొంగిపోవడం తప్ప వేరే దిక్కు లేదు… అదే బాటలో ఉన్నాడని సమాచారం…

ఈయన ఎవరు..? ఎందుకు ఈ వికెట్ కీలకం..? ముప్పాళ్ల లక్ష్మణరావు భారత మావోయిస్టు ఉద్యమంలో అత్యంత కీలకమైన నాయకుడు… ఈయన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) మాజీ ప్రధాన కార్యదర్శి…

  • రాజకీయ జీవితం…: 2004లో పీపుల్స్ వార్ గ్రూప్ (PWG), మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా (MCCI) విలీనమై CPI (మావోయిస్ట్) ఏర్పడినప్పటి నుండి 2018 వరకు ఆయన ప్రధాన కార్యదర్శి… 2018 నవంబర్‌లో అనారోగ్య కారణాల వల్ల ఆ పదవి నుండి తప్పుకున్నాడు…

  • వయస్సు 77 ఏళ్లు… అనారోగ్యం, ముసలితనం… చాన్నాళ్లుగా ఎక్కడో ఓచోట షెల్టర్ తీసుకోవడమే తప్ప ఇప్పుడు క్రియాశీలక పోరాటం ఏమీ లేదు… కేవలం ప్రాణరక్షణే… పార్టీకి కేవలం ఇప్పుడు ఒక “సైద్ధాంతిక మార్గదర్శి” మాత్రమే…

జగిత్యాల జిల్లా (పూర్వపు కరీంనగర్ జిల్లా), సారంగపూర్ మండలం, బీర్‌పూర్ గ్రామానికి చెందిన తను లొంగిపోతే ఇక సాయుధ పోరాట భావజాలంపై ‘రాజ్యం’ విజయం సంపూర్ణమైనట్టు లెక్క…

ఆల్రెడీ తనతో తెలంగాణ పోలీసులు టచ్‌లో ఉన్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి… లొంగిపోయిన దేవ్‌జీ సాయంతో ఆల్రెడీ నేపాల్‌లో ఉన్న గణపతి లొకేషన్ ట్రేస్ చేసి, గణపతి, ఆయన భార్య జోడే రత్నాబాయి అలియాస్ సుజాతను అదుపులోకి తీసుకున్నట్టు కూడా ఓ మెయిన్ స్ట్రీమ్ పత్రిక రాసేసింది… సరే, పోలీసులు అధికారికంగా చూపించేవరకు ఇవన్నీ ధ్రువీకరణ లేని వార్తలే…

తెలంగాణ వాళ్లు ఇంకా 11 మంది మిగిలి ఉన్నారనీ, వాళ్లు కూడా టచ్‌లో ఉన్నారని డీజీపీ చెబుతున్నాడు… వాళ్ల లొంగుబాటు కూడా తప్పదు… మరి గణపతి..? అడవుల్లో లేడు, బయట ఎక్కడో షెల్టర్ తీసుకున్నట్టు తెలుస్తోందని మాత్రమే డీజీపీ వెల్లడించాడు… అంతకుమించి ఇప్పుడేమీ చెప్పడం కుదరదు కూడా… కాకపోతే ఓ చిన్న హింట్ అనుకోవచ్చునేమో…

గణపతి కోసం ఎన్ఐఏ, రా (RAW) కూడా చాన్నాళ్లుగా సెర్చ్ చేస్తున్నాయి… వాళ్లకు దొరక్కుండా తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోవడమే తనకు సేఫ్… బుల్లెట్ పేల్చం, రక్తపుచుక్క పడనివ్వం అనే తమ హామీకి తెలంగాణ పోలీసులు కట్టుబడి ఉన్నారు గనుక…

(ఈ మొత్తం లొంగుబాటు పర్వంలో డీజీపీతోపాటు ఇంటలిజెన్స్ సుమతి చేసిన కృషికీ క్రెడిట్స్ దక్కాలి, అలాగే మానవతాదృక్పథంలోనే వెళ్దాం అని విస్పష్టంగా చెప్పిన రేవంత్ రెడ్డికి కూడా… లొంగుబాట్లకు తెలంగాణ ప్రాంతీయ సెంటిమెంట్ అద్ది మరీ పోలీసులు సక్సెస్ కొట్టడం మరో విశేషం… )

గణపతి



  • నిన్న లొంగిపోయిన మావోయిస్ట్ అగ్రనేతల్లో ఒకరేమో మావోయిజం అంతం కాదంటాడు… మరొకరేమో కేవలం వ్యక్తిగత, అనారోగ్యం కారణంగా మాత్రమే లొంగిపోయాను అంటాడు… లొంగుబాటు వేదిక మీద కూడా పిడికిలి బిగించి చూపిస్తాడు… ఇంకా ఎక్కడున్నావ్ మాజీ కామ్రేడ్..?

 

  • నిజాన్ని అంగీకరించడానికి, సాయుధపోరాటం, వాళ్లు అనుసరించిన పోకడ విఫలమయ్యాయనీ, అందుకే సాయుధ పోరాటాన్ని విరమించే అంశం పొలిట్ బ్యూరోలో కూడా చర్చకు వచ్చిందనీ మాత్రం అంగీకరించరు… ఏదో అడ్డువస్తోంది… పర్లేదు, నాలుగు రోజులు పోతే తత్వాలన్నీ బోధపడతాయి…

 

  • రిక్రూట్‌మెంట్లు లేవు, ఆ విఫల సిద్ధాంతాల వైపు ఎవరూ రావడం లేదు, ముసలి నాయకత్వం, కాలానుగుణంగా పోరాటాన్ని మార్చుకోలేని సైద్ధాంతిక వైఫల్యం, అడవుల్లో ప్రాణరక్షణే కష్టసాధ్యం అయిపోవడం… ఇవన్నీ నిజాలే… క్షేత్ర స్థాయి వాస్తవాలే… రాజ్యం ఎదుట లొంగిపోవడం అంటేనే మా కార్యాచరణ, మా అడుగులు విఫలమైనట్టుగా అంగీకరించడమే మాజీ కామ్రేడ్స్…!!

 



 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాటలు, డాన్సులు, యాక్షన్, స్టయిల్… ఫక్తు చిరంజీవి మార్క్ మూవీ…
  • తాజ్ హోటళ్ల నడుమ స్కై బ్రిడ్జ్… ఆసక్తి కలిగించే ఓ వార్త కథ..!!
  • గణపతి సైతం..! మావోయిస్ట్ పార్టీ చివరి వికెట్ కూడా త్వరలోనే..!!
  • ఆట వస్తువుల ఓ చిన్న వ్యాపారి… ట్రంపును నేల మీదకు దించాడు…
  • పురస్కారాల పందేరం వద్దు… అవార్డుల వైపు అందరి చూపు..!
  • విజయ్ దేవరకొండ అరటి బోదెలను అడ్డంగా నరకాల్సి ఉంటుంది..!!
  • ముందే చెబుతున్నా… మొత్తం చదివాక అస్సలు నవ్వొద్దు సుమీ…
  • విధి రాత… డెస్టినీ… టైమ్… ఈ ఎయిర్ లిఫ్ట్ ప్రమాదమే పే-ద్ద ఉదాహరణ…
  • … ఈసారి ఆపరేషన్ సిందూర్ మామూలుగా ఉండదు..!!
  • రాజ్ షమాని… ఇండోర్ ‘సబ్బుల’ నుంచి ‘గ్లోబల్’ పాడ్‌కాస్టర్ వరకు…!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions