.
గాంధీ సరోవర్…! గేట్ వే ఆఫ్ హైదరాబాద్…! ఢిల్లీలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్‌ను కలిసి… ఈసా-మూసీ సంగమస్థలిలో నిర్మించే గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపనకు రావాలని ఆహ్వానించాడు… అంతేకాదు, బాపూఘాట్ దగ్గర, డిఫెన్స్ పరిధిలో ఉన్న 98 ఎకరాల భూమిని ఈ ప్రాజెక్టుకు బదలాయించాలని కూడా కోరాడు…
అసలు ఏమిటీ ప్రాజెక్టు..? ఈసా- మూసీ నదుల సంగమం ఏమిటి..? ఈసా పేరు చాలామంది హైదరాబాదీలు విని ఉండరు కదా… బాపూ ఘాట్ ఎక్కడ ఉంది..? పదండి వివరాల్లోకి వెళ్దాం…
Ads
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో (Musi Rejuvenation Project) భాగం ఈ ఈసా-మూసీ నదుల సంగమ ప్రాంతంలో ‘గాంధీ సరోవర్‘ ప్రాజెక్టు…
1. ప్రాజెక్టు ఎక్కడ..? (Location) హైదరాబాద్‌లోని లంగర్ హౌస్ సమీపంలోని బాపూ ఘాట్ వద్ద ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది… ఇక్కడ ఈసా, మూసీ నదులు సంగమిస్తాయి… ఈ రెండు నదుల కలయిక వద్ద ‘V’ ఆకారంలో ఒక భారీ జలాశయాన్ని (గాంధీ సరోవర్) నిర్మించి, ఆ ప్రాంతాన్ని పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దనున్నారు…
2. ప్రాజెక్టు వివరాలు & ముఖ్యాంశాలు గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ, ఇది 1948లో మహాత్మా గాంధీ అస్థికలను కలిపిన స్థలం… ఇక్కడ గాంధీ విలువలని చాటిచెప్పేలా ఒక భారీ స్మృతి వనాన్ని నిర్మిస్తారు…
-
ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ విగ్రహం…: బాపూ ఘాట్ వద్ద మహాత్మా గాంధీ యొక్క అత్యంత ఎత్తైన విగ్రహాన్ని ప్రతిష్టించాలని ప్రభుత్వం యోచిస్తోంది… సర్దార్ సరోవర్ ప్రాజెక్టు, పటేల్ విగ్రహం తరహాలో అన్నమాట…
-
ఐకానిక్ టవర్ & గేట్‌వే…: ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా తరహాలో ‘గేట్‌వే ఆఫ్ హైదరాబాద్’ను ఇక్కడ నిర్మిస్తారు…
-
ఇతర సౌకర్యాలు…: నాలెడ్జ్ హబ్, మెడిటేషన్ విలేజ్ (ధ్యాన కేంద్రం), హ్యాండ్ లూమ్ ప్రమోషన్ సెంటర్ (చేనేత కేంద్రం), శాంతి విగ్రహ మ్యూజియం, పర్యాటక వినోద ప్రాంతాలు ఉంటాయి…

3. ఎంత ఖర్చు..? (Budget & Funding)
-
మొదటి దశ అంచనా…: మూసీ ప్రక్షాళన తొలి దశ పనుల కోసం సుమారు ₹4,100 కోట్ల వ్యయం అవుతుందని అంచనా…
-
ఆర్థిక సహాయం…: ఈ ప్రాజెక్టు కోసం ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB) సుమారు ₹4,000 కోట్ల మేర రుణం ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది…
-
భూసేకరణ…: ఇటీవల (ఫిబ్రవరి 2026) ప్రభుత్వం సుమారు 50 ఎకరాలకు పైగా భూసేకరణ ప్రక్రియను ప్రారంభించింది… అలాగే రక్షణ శాఖకు చెందిన దాదాపు 98 ఎకరాల భూమిని బదిలీ చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది…
4. ఉద్దేశం – లక్ష్యాలు (Objectives)
-
నదీ పునరుజ్జీవనం…: మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలతో కలుషితమైన మూసీ నదిని శుద్ధి చేసి, నిరంతరం స్వచ్ఛమైన నీరు ప్రవహించేలా చూడటం…
-
పర్యావరణ పరిరక్షణ…: కాలుష్యం కారణంగా నల్లగొండ వంటి దిగువ జిల్లాల్లో ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలను అరికట్టడం…
-
పర్యాటక అభివృద్ధి…: హైదరాబాద్‌ను లండన్ (థేమ్స్ నది) లేదా దుబాయ్ తరహాలో అంతర్జాతీయ స్థాయి పర్యాటక నగరంగా మార్చడం…
-
వరద నివారణ…: నగరాన్ని వరద ముప్పు నుండి తప్పించడానికి శాశ్వత పరిష్కారం చూపడం…
-
నీటి మళ్లింపు…: గోదావరి జలాలను (సుమారు 5 TMC) మూసీలోకి మళ్లించి నదిలో ఏడాది పొడవునా నీరు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు…

ఈసా – మూసీ …. ఈసా నది (River Esa) మూసీ నదికి ఒక ప్రధాన ఉపనది… ఈసా నది వికారాబాద్ కొండ ప్రాంతాల్లో జన్మిస్తుంది… వికారాబాద్ నుండి రంగారెడ్డి జిల్లా మీదుగా ప్రవహిస్తూ ఇది హైదరాబాద్ వైపు వస్తుంది. ఈ నదిపైనే 1927లో హిమాయత్ సాగర్ (Himayat Sagar) జలాశయాన్ని నిర్మించారు… ఈ జలాశయం నిండినప్పుడు, దాని మిగులు జలాలు దిగువకు ప్రవహిస్తాయి… ఇది కిస్మత్‌పూర్, హిమాయత్ సాగర్ గ్రామాల మీదుగా ప్రవహిస్తూ బాపూ ఘాట్ వైపు సాగుతుంది…
సంగమ స్థానం (Confluence)…. ఈసా నది చివరగా లంగర్ హౌస్ సమీపంలోని బాపూ ఘాట్ (టిప్పు ఖాన్ బ్రిడ్జ్) వద్ద మూసీ నదితో కలుస్తుంది… ఇక్కడ మూసీ (దీనిని ఈసా- మూసా అని కూడా పిలుస్తారు) ఈసా నదుల కలయికనే ‘సంగమం’ అని పిలుస్తారు… ఈ V ఆకార సంగమ స్థలంలోనే గాంధీ సరోవర్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది… మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగమే ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్టు…

Share this Article