.
సినిమా అవార్డులకు సంబంధించి ఎప్పుడూ ఏదో ఓ వివాదం, ఓ అసంతృప్తి వ్యక్తం అవుతూనే ఉంటాయి.., కానీ అసలు ఇప్పటికీ విడుదల కాని సినిమాకు అవార్డులు వస్తే…?
ఓ తమిళ సినిమాకు సంబంధించి అదే వివాదం… సినిమా పేరు సందకరి… అసలేం జరిగిందీ అంటే..? తమిళనాడు ప్రభుత్వం 2015 నుండి 2024 వరకు పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర చలనచిత్ర అవార్డులను ఇటీవల ప్రకటించింది… ఇందులో 2020 సంవత్సరానికి సంబంధించి ‘సందకరి’ (Sandakari) చిత్రానికి మూడు అవార్డులు దక్కాయి…
Ads
-
ఉత్తమ చిత్రం (రెండవ బహుమతి)
-
ఉత్తమ నటి (శ్రియ శరణ్)
-
ఉత్తమ గాయకుడు (మధు బాలకృష్ణన్)
వివాదానికి ప్రధాన కారణం ఈ సినిమా ఇప్పటికీ థియేటర్లలో విడుదల కాకపోవడమే….
వివాదానికి దారితీసిన అంశాలు సాధారణంగా స్టేట్ అవార్డ్స్ ఇవ్వాలంటే ఆ సినిమా ఆ సంవత్సరంలో సెన్సార్ పూర్తి చేసుకుని ఉండాలి లేదా విడుదల కావాలి… కానీ ‘సందకరి’ సినిమా 2020లో విడుదల కాలేదు…
-
అర్హతపై ప్రశ్నలు…: విమల్, శ్రియ జంటగా నటించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని చాలా కాలమైంది. లండన్ నేపథ్యంలో సాగే ఈ రీమేక్ చిత్రం (మలయాళం ‘మై బాస్’కు ఇది రీమేక్… దానికి హాలీవుడ్ ‘ది ప్రపోజల్’ ఆధారం) ఆర్థిక కారణాల వల్ల ల్యాబ్‌లోనే ఉండిపోయింది… విడుదలే కాని సినిమాకు ‘ఉత్తమ చిత్రం’ కేటగిరీలో అవార్డు ఎలా ఇస్తారనేది నెటిజన్ల ప్రధాన ప్రశ్న…
తమిళనాడు ప్రభుత్వం నియమించిన జ్యూరీ కమిటీ ఈ విమర్శలపై స్పందిస్తూ… సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్స్ పొందిన చిత్రాలను తాము పరిగణనలోకి తీసుకుంటామని, విడుదల అనేది ప్రధానం కాదని సమర్థిస్తున్నా, ఇది సంప్రదాయానికి, నైతికతకూ విరుద్ధమనే వాదన కూడా బలంగా ఉంది…
సోషల్ మీడియా రియాక్షన్ .. తమిళ సినీ అభిమానులు ఈ అవార్డుల నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు… తమిళనాడు ప్రభుత్వం జనవరి 29, 2026న ఈ అవార్డులను ప్రకటించినప్పటి నుండి, సినీ విశ్లేషకులు, నెటిజన్లు ఎంపిక ప్రక్రియపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు… ముఖ్యంగా పా రంజిత్ వంటి ప్రముఖ దర్శకులు, అవార్డుల ఎంపికలో “నిజాయితీ – పారదర్శకత” ఎంతవరకు ఉందని బహిరంగంగానే సోషల్ మీడియా (X) వేదికగా ప్రశ్నించారు…
అధికారికంగా ప్రభుత్వం నుంచి ఇంకా తుది నిర్ణయం రాలేదు, కానీ జ్యూరీ వర్గాల వివరణ… ‘‘ఒక సినిమా అవార్డుకు అర్హత సాధించాలంటే అది థియేటర్లో విడుదల కావాల్సిన అవసరం లేదు, సెన్సార్ బోర్డు (CBFC) నుండి సర్టిఫికేట్ పొంది ఉంటే చాలు… ఈ చిత్రం 2020లోనే సెన్సార్ పూర్తి చేసుకుంది..,’’
ఇతర చిత్రాల పట్ల అన్యాయం జరిగిందనే వాదన
ఈ వివాదం ‘సందకరి’తోనే ఆగలేదు… 2020, ఇతర సంవత్సరాల్లో జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందిన ‘జై భీమ్’, ‘సూరారై పోట్రు’, ‘పేరంబు’ వంటి చిత్రాలకు సరైన గుర్తింపు దక్కలేదని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు… ముఖ్యంగా మలయాళ సినిమాకు రీమేక్ అయిన ‘సందకరి’కి మూడు అవార్డులు ఇచ్చి, ఒరిజినల్ కంటెంట్‌ను విస్మరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి…
తాజా స్థితి (Status) ప్రస్తుతానికి ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో ఎలాంటి మార్పులు చేయలేదు… ఫిబ్రవరి 13, 2026న చెన్నైలో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరగాల్సి ఉంది… వివాదం పెద్దది కావడంతో, సాంకేతిక లోపాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో ప్రభుత్వం అంతర్గతంగా సమీక్షిస్తున్నట్లు సమాచారం… ఒకవేళ నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే, ఆ అవార్డులను వెనక్కి తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు…
ఈ సినిమాకు ఈ వివాదం వల్ల మంచి ప్రచారం వచ్చి ఉండవచ్చుగాక… కానీ అవార్డుల ఎంపికకు తీసుకున్న ప్రమాణాలు, ఎంపిక తీరుకు ఓ పెద్ద మచ్చ..!!
Share this Article