Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జాతిపిత అంటే ఎవరు..? రేవంత్ పగులగొట్టే ఓ ఆర్టిఫిషియల్ షెల్..!!

February 3, 2026 by M S R

.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎవరైనా సూచించారో, తనకే తట్టిందో తెలియదు గానీ… కాంగ్రెస్, బీజేపీలకు ఉపయుక్తమయ్యే….. కాదు, తెలంగాణ సమాజానికి ఉపయోగపడే ఓ పొలిటికల్ స్ట్రాటజీకి తెరతీశాడు…

బీజేపీలో ఒక్క బండి సంజయ్‌కు మాత్రమే ఆ తెలివిడి, స్పూర్తి ఉంది… మిగతావాళ్లు హోప్‌లెస్… ఈవెన్ కాంగ్రెస్‌లో కూడా ఏ మంత్రికీ సోయి లేదు… ఏమిటంటే..?

Ads

మహితాత్ముడు, మహోన్నతుడు, జాతిపిత, బాపు అంటూ కేసీయార్ చుట్టూ ఓ కృత్రిమ షెల్, పెంకు, ఓ మహిమాన్విత వెలుగు చక్రాన్ని నిర్మించడానికి సోకాల్డ్ పింక్  బ్యాచ్ ప్రయత్నిస్తుంటే… దాన్ని బద్దలు కొట్టే స్ట్రాటజీ… అఫ్‌కోర్స్, సొంత బిడ్డ కవిత, రోజుకో స్కామ్ బయటపెడుతూ ఆ పెంకును ఇప్పటికే సగం బద్దలు కొట్టేసింది…

కేసీయార్ అంటే ఏ జాతికీ బాపు కాదు, జాతి పిత కాదు… అంత సీన్ లేదు, జస్ట్, తను ఓ సగటు ఇండియన్ పొలిటిషియన్… అదీ అనేకానేక అవినీతి, అక్రమాల ఆరోపణలున్న… ఓ వ్యక్తి కేంద్రిత పార్టీ అధినేత, కుటుంబ పార్టీ మూలకర్త… సింపుల్‌గా తను మరో శిబూ సోరెన్ మాత్రమే అనే నిజస్వరూపాన్ని జనం ఎదుట పెట్టే స్ట్రాటజీ ఇది…

    కాస్త వివరంగా చెప్పుకుందాం… ఏ జాతికీ మూలపురుషుడు, జాతిపితలు, తాతలు ఎవరూ ఉండరు… శతాబ్దాలు, తరాలుగా ఏ జాతైనా తమ మూలాల నుంచి క్రమేపీ భిన్న సంస్కృతి, భిన్న భాష, భిన్న జీవనసరళి వైపు పరిణమిస్తుంది… ఎవల్యూషన్ అండ్ ఎమర్జింగ్ న్యూ రేస్… డార్విన్ దగ్గర నుంచీ చెప్పిన శాస్త్రీయత అదే…

వ్యక్తులు, కొద్ది జీవులు జాతుల పరిణామాన్ని నిర్దేశించలేరు… అది ఓ హంబగ్ థియరీ…


శాలివాహన శకం స్టార్ట్ చేసిన ది గ్రేట్ తెలుగు రూలర్ శాతకర్ణిని కూడా మనం జాతిపిత అనం… చరిత్రలో తను ఓ కీలకవ్యక్తి తప్ప, పిత కాదు, తాత కాదు… సరే, ఓసారి మహాత్మా, జాతిపతి గాంధీ వైపు వెళ్దాం…



  • మహాత్మా గాంధీకి ‘జాతిపిత’ (Father of the Nation) అనే బిరుదు అధికారికంగా ప్రభుత్వం ఇవ్వలేదని స్పష్టం చేస్తూ కేంద్ర ప్రభుత్వం గతంలో సమాధానం ఇచ్చింది… పిడివాదులు, భజనపరులు చూసుకోవచ్చు…

shell

https://timesofindia.indiatimes.com/city/agra/mahatma-gandhi-was-never-declared-father-of-nation-reveals-rti-reply/articleshow/73448147.cms

2012లో ఐశ్వర్య పరాశర్ అనే 10 ఏళ్ల బాలిక వేసిన RTI ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది…

  • ప్రభుత్వ వివరణ…: భారత రాజ్యాంగంలోని Article 18(1) ప్రకారం, విద్యా సంబంధిత (Academic), సైనిక (Military) బిరుదులు తప్ప, పౌరపురస్కారాలు తప్ప ప్రభుత్వం పౌరులకు ఎలాంటి ఇతర బిరుదులను ప్రదానం చేయకూడదు…

  • అధికారిక హోదా..: అందుకే ప్రభుత్వం గాంధీజీని ‘జాతిపిత’ అని అధికారిక పత్రాల్లో ప్రకటించలేదు…

  • పైగా గాంధీ నేషన్ (జాతి)కి సంబంధించిన ఓ విముక్తి పోరాటానికి లీడర్… భారతీయ ధార్మిక లక్షణాలైన హింస, సత్యం, జీవన శైలి, నిరాడంబరత, అధికార వ్యామోహ రాహిత్యానికి తను ఓ ఐకన్… మరి ఓ ప్రాంతీయ నేత, కేసీయార్‌ వీటన్నింటికీ పూర్తి కంట్రాస్టు… మరి జాతిపిత ఎలా అయ్యాడు..? పైగా జనం తన నిజస్వరూపం తెలిసే కదా తిరస్కరించింది… ఫామ్ హౌజుకు పరిమితం చేసింది… మరి జాతి పిత, జాతి బాబాయ్ ఎలా అయ్యాడు..? జనమే కదా అంతిమ నిర్ణేతలు..?!

జాతిపిత

ఎస్, రేవంత్ రెడ్డి అడిగిందీ అదే… కదిలిస్తే చాలు, ఓ భ్రమాత్మక వ్యక్తి చుట్టూ పెనవేసుకున్న అనేకానేక అవినీతి అక్రమాల బాగోతాల పుట్టలు బద్దలవుతూ… ఓ లీడర్ నిజస్వరూపం తెలంగాణ సమాజం ఎదుట ఆవిష్కరింపబడుతోంది కాబట్టి… ఆ కృత్రిమ పెంకును పూర్తిగా బద్ధలు కొట్టే పనిలో పడ్డాడు రేవంత్ రెడ్డి…



అధికారిక గుర్తింపు లేకపోయినప్పటికీ, ప్రజల హృదయాల్లో గాంధీ స్థానం చెక్కుచెదరనిది… ఐనా సరే, వర్తమాన జాతీయవాదులు అనేకానేక గాంధీ ప్రతికూల లక్షణాలను, జాతికి చెడు చేసిన నిర్ణయాలను తవ్వి తీసి, విశ్లేషిస్తున్నారు…

  • సుభాష్ చంద్రబోస్..: 1944, జూలై 6న సింగపూర్ రేడియో నుండి ప్రసంగిస్తూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ మొదటిసారిగా గాంధీని “జాతిపిత” (Father of the Nation) అని సంబోధించాడు…

  • ఆ తర్వాత స్వతంత్ర భారతదేశంలో జవహర్‌లాల్ నెహ్రూ కూడా అదే పిలుపును కొనసాగించడంతో అది ప్రజల్లో స్థిరపడిపోయింది…. అంటే జాతిపిత అనే జాతి ఇచ్చిన కీర్తికిరీటం కాదు, గౌరవం కాదు… నిర్బంధంగా, పదే పదే బహుళ ప్రచారంలో జాతి మెదళ్లకు ఎక్కించబడిన ఓ అబద్ధం…

సేమ్… ఒక రాష్ట్రానికి జాతిపిత ఉండడు… సంకుచిత, కుత్సిత తత్వాలకు ఆ పదమే వర్తించదు… కానీ కేసీయార్ చుట్టూ ఆ కృత్రిమ ఇమేజ్ పెంకును బిల్డ్ చేసే విఫల ప్రయత్నాలు హరీష్ రావు ద్వారా… కేటీయార్ ద్వారా… ఆ సోషల్ మీడియా క్యాంపెయిన్ ద్వారా… అవును, జస్ట్, విఫల ప్రయత్నాలు మాత్రమే… సగటు తెలుగు హీరోల బాపతు ఫ్యానిజం బాపతు ధోరణి…

దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్ర, కర్ణాటకలో పండగలు, తిథులు లెక్కించడానికి ఇప్పటికీ శాలివాహన శకాన్నే అనుసరిస్తారు… ఐనా సరే ఎవరూ శాతకర్ణిని జాతిపిత అని పిలవరు….

  • ఎస్… అమెరికా జార్జ్ వాషింగ్టన్, దక్షిణాఫ్రికాకు నెల్సన్ మండేలా, పాకిస్థాన్‌కెు మహమ్మద్ ఆలీ జిన్నా, టర్కీకి ముస్తఫా కెమాల్ అటాతుర్క్, సింగపూర్ లీ క్వాన్ యూ, వియత్నాం హో చి మన్‌లను జాతి నిర్మాతలుగా పిలుస్తారు తప్ప జాతి అంకుల్స్, జాతి పితలు అని పిలవరు… వారి వ్యక్తిత్వాలు ఉన్నతం, మత ఛాందస జిన్నా తప్ప…

 

మరి ఈ జాతిపిత ప్రచారం ఏమిటి..? ఇది ఓ రకమైన ‘రాజకీయ ఆధునికత’ (Political Modernity)… ప్రాచీన కాలంలో ఇలాంటి బిరుదులు లేవు, కేవలం రాజులు ఉండేవారు… ఇప్పుడు ఆ రాజరికాన్ని గుర్తుచేయడమే ఈ జాతిపిత బాపతు ఆర్టిఫిషియల్ కిరీటాలు, బిరుదులు…

ఏ జాతి అయినా అది అనేది నిరంతరం ప్రవహించే నదీ ప్రవాహం… వ్యక్తులు వస్తుంటారు, స్వార్థంతో భుజకీర్తులు తగిలించుకుంటారు… అదొక రాజరికం, నియంతృత్వం… కేసీయార్‌ను అంతకు భిన్నంగా చూడలేం… చూడాల్సిన అవసరమూ లేదు… జాతిపిత పేరు ఒక కల్పిత గౌరవం (Metaphorical honor)…  మూలాలు ఎప్పుడూ ప్రాచీన చరిత్రలో, సామాజిక మార్పులలోనే ఉంటాయి కానీ వ్యక్తులలో ఉండవు…

చివరగా... జార్ఖండ్ శిబూ సోరెన్‌ను ఆ జాతి ఎప్పుడూ జాతిపిత అని పిలవలేదు... అనేకసార్లు జైలుకు వెళ్లాడు, మూడు హత్య కేసుల్లో నిందితుడు... కుటుంబ పాలన... అనేక అవలక్షణాలు... కేసీయార్ మీద కూడా బోలెడు ఆరోపణలు... మరి జాతిపిత ఎలా అవుతాడు..? ఇదే రేవంత్ రెడ్డి ప్రశ్న...!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వాట్సాప్ ప్రైవసీ వివాదం… సుప్రీం ఫైర్… అసలేం జరుగుతోంది? 
  • టీకే రాధ..! అపారమైన మేధస్సుతో అరవైలలోనే అంతర్జాతీయ గుర్తింపు..!
  • జాతిపిత అంటే ఎవరు..? రేవంత్ పగులగొట్టే ఓ ఆర్టిఫిషియల్ షెల్..!!
  • తమిళుడు ఏమంటున్నాడు..? ఆసక్తికరమైన ఓ ఓపీనియన్ సర్వే…!!
  • స్లోగా మింగేస్తున్న ‘డిజిటల్ స్లో పాయిజన్’… చికిత్స లేని అడిక్షన్…
  • గుంజి గుంజి… వేదికపైనే పరమ వికారం… సాహిత్యమా..? రోత పైత్యమా..?
  • అమెరికా ట్రేడ్ డీల్ – జియో పాలిటిక్స్ – చమురు- హైదరాబాద్ రియల్ ఎస్టేట్..!!
  • ట్రంపు తనే దిగొచ్చాడా..? దింపబడ్డాడా…? ఎందుకు..? ఎలా..? ఏమిటి..?
  • వెండితో బహుపరాక్..! ‘ఫ్యూచర్ ఆప్షన్స్’ కూడా పడిపోతున్నయ్..!!
  • అయోధ్య రామమందిర భవ్య నిర్మాణం ఇంకా ‘పూర్తి కాలేదు’..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions